Vinayaka Bramhotsavams
-
వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు
-
రేపటి నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు
కాణిపాకం (చిత్తూరు): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆలయ ప్రాకారం లోపల మాత్రమే ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 10వ తేదీ శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం, సాయంత్రం పుష్పకావళ్ల కార్యక్రమంతో మొదలయ్యి, 30వ తేదీ గురువారం ఉదయం అభిషేకం, సాయంత్రం తెప్పోత్సవంతో ముగుస్తాయి. ఈ మేరకు ఉత్సవ ఏర్పాట్లలో దేవస్థానం అధికారులు తలమునకలయ్యారు. -
కాణిపాకంలో స్వామి వారికి ధ్వజారోహణం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని వరసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి ధ్వజారోహాణం కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమూర్తి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం స్వామివారు హంస వాహనంపై గ్రామ పుర వీధుల్లో ఉరేగనున్నారు. కాణిపాకం వరసిద్ధ వినాయకుని బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాణిపాకం చేరుకున్నారు. భక్తుల కోసం కాణిపాకం ఆలయ ఉన్నతాధికారులు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.