కాణిపాకం గర్భగుడిలో అగ్నిప్రమాదం
Published Wed, Aug 30 2017 11:36 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయ గర్భగుడిలో ఏసీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఆలయ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement