
గర్భాలయంలో ఫోన్ మాట్లాడుతున్న ఈశ్వరబాబు
కాణిపాకం: ఆయన అధికార పార్టీ నేత. కాణిపాకం ఆలయంలో నిబంధనలు తనకు వర్తించవు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. గర్భగుడిలోనైనా నిబంధనలు అడ్డురావు. యథేచ్ఛగా సెల్‌ఫోన్ వినియోగిస్తుంటారు. అది సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని తెలిసినా పట్టించుకోడు. టీడీపీ నేత ఈశ్వరబాబు (బుజ్జినాయుడు) కాణిపాకం ట్రస్టుబోర్డు చైర్మన్ రేసులో ఉన్నారు.
తనకు నిబంధనలేమీ వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. గర్భగుడిలో అభిషేకం జరుగుతుంటే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆలయ భద్రత దృష్ట్యా సెల్‌ఫోన్లు ఆలయంలో నిషేధించినా బుజ్జినాయుడు వ్యవహరించిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment