
సాక్షి, చిత్తూరు: కాణిపాకంలో కరోనా కలకలం సృష్టించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హోంగార్డుకు కరోనా వైరస్ సోకడంతో భక్తుల అనుమతిని నిషేధించారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,858కి చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,068కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు 202 మంది ఉన్నారు. (కరోనాకు వర్షం తోడు..)