
కాణిపాకం (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. ఈవో కార్యాలయంలో ఆయన ఆలయంలోని అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వామివారి దర్శన వేళల్లో మార్పు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులంతా దర్శన వేళలను కుదించడానికి ఒప్పుకోవడంతో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న దర్శన వేళలను సాయంత్రం 7 గంటలకు కుదించారు. క్యూ లైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లడ్డు పోటులో, నిత్య అన్నదానం వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరాదని స్పష్టం చేశారు.
ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు సేకరిస్తే సమాచారమివ్వండి
కాణిపాక ఆలయాభివృద్ధికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు విరాళాలను అడిగితే వెంటనే సమాచారం అందించాలని ఈవో కోరారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి ఆలయ అభివృద్ధి పేరిట విరాళాలు సేకరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు అడిగిన వెంటనే స్థానిక పోలీసులకు, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఇక్కడ చదవండి:
Comments
Please login to add a commentAdd a comment