Kanipakam
-
వైభవంగా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
కాణిపాకం : కనులపండువగా సిద్ధి వినాయక రథోత్సవం (ఫొటోలు)
-
18 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
యాదమరి(చిత్తూరు జిల్లా): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నా యి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారు నిత్యం వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వినాయక చవితి మరుసటి రోజు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. ఆ తర్వాత హంస వాహన సేవ, మయూర వాహన సేవ, మూషిక వాహన సేవ, చిన్న, పెద్ద శేష వాహన సేవ, వృషభ వాహన సేవ, గజవాహన సేవ, రథోత్సవం, అశ్వవాహన సేవ, ఏకాంత సేవలు తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మాట్లాడుతూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆలయ పరిసరాలు, అనుబంధ ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. -
శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
-
గణనాథుని సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఆమె కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనార్థం కాణిపాకం విచ్చేయగా ఆలయ ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్స్పెక్టర్ బాబు పాల్గొన్నారు. -
చిత్తూరు జిల్లా : కాణిపాకం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
Kanipakam: కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓ సురేష్ బాబుపై బదిలీ వేటు
సాక్షి, చిత్తూరు: టికెట్ ధరల పెంపుపై కాణిపాకం ఇన్ ఛార్జి ఈఓ సురేష్ బాబు ఇచ్చిన ఉత్తర్వులపై దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. సురేష్ బాబును కాణిపాకం ఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాణిపాకం ఇన్‌ఛార్జి ఈఓగా కర్నూలు డిసి రాణా ప్రతాప్ కి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ కమీషనర్ హరి జవహర్ లాల్ ఇప్పటికే సురేష్ బాబుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. కాణిపాకంలో అభిషేకం టిక్కెట్ ధరని పెంచడానికి ప్రజాభిప్రాయం పేరుతో జారీ చేసిన ఉత్తర్వులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిక్కెట్ ధరని పెంచడం లేదంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ స్పష్టమైన ప్రకటన చేసిందని ఆయన తెలిపారు. సురేష్ బాబుపై విచారణ చేపటనున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. -
కాణిపాకం వివాదంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందన
-
కాణిపాక గణపయ్యను దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో సందడి.. తెల్లవారుజాము 3గంటల నుంచే అభిషేకాలు
-
అక్టోబర్ 11న కాణిపాకానికి సీఎం వైఎస్ జగన్
సాక్షి, కాణిపాకం(యాదమరి): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 11వ తేదీన దర్శించుకోనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. శనివారం ఆయన కాణిపాకంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పర్యటనలో భాగంగా సీఎం.. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా వినాయక స్వామివారికి టీటీడీ తయారు చేసి ఇచ్చిన బంగారు రథాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చదవండి: (మహిళా మార్ట్.. సరుకులు భేష్) -
బాలికపై అత్యాచారయత్నం
కాణిపాకం (యాదమరి): బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడిని.. దిశ యాప్ ద్వారా సమచారం అందుకున్న పోలీసులు మూడు నిమిషాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కాణిపాకం మండలంలో జరిగింది. కాణిపాకం ఎస్ఐ రమేష్‌బాబు కథన మేరకు.. మండలంలోని చిగరపల్లె దళితవాడలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటిముందు వీధిలో ఆడుకుంటున్న బాలిక (9)కు అదే ప్రాంతానికి చెందిన కేశవులు (55) మాయమాటలు చెప్పి పక్కనున్న చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెళ్లగా కేశవులు పారిపోయాడు. తర్వాత స్థానిక మహిళలు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాణిపాకం పోలీసులు మూడు నిమిషాల్లో గ్రామానికి చేరుకుని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేశవులుపై కేసు నమోదు చేసినట్టు ఎస్.ఐ. చెప్పారు. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు సీజే
తిరుమల/కాణిపాకం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆదివారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి ధ్వజస్తంభానికి మొక్కుకుని, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అదనపు ఈవో, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టిలు స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని జస్టిస్‌కు అందించారు. వినాయకుని సేవలో... కాణిపాకం వినాయక స్వామిని జస్టిస్ గోస్వామి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వెంకటేశు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేపట్టారు. ఆశీర్వాద మండపంలో ఆశీర్వచనం ఇప్పించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగే, కాణిపాకం వినాయకుడిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వెంకన్న సేవలో ప్రముఖులు తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇందులో ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, ఏపీ సమాచార కమిషనర్ రాజా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి ఉన్నారు. -
కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు
-
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో చవితి ఉత్సవాలు
-
నకిలీ వజ్రం ఇచ్చి.. రూ.58 లక్షలు స్వాహా
కాణిపాకం (యాదమరి): నకిలీ వజ్రం ఇచ్చి ఓ వ్యక్తి నుంచి రూ.58 లక్షలు దోచేశారు ముగ్గురు ఘరానా మోసగాళ్లు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరుకు చెందిన శ్రీనివాసులు, బంగారుపాళెంకు చెందిన దామోదరం, తవణంపల్లెకు చెందిన బొజ్జయ్య నాలుగు నెలల క్రితం నకిలీ వజ్రం తీసుకొచ్చి కాణిపాకంలోని భాస్కర్ నాయుడుకు రూ.58.6 లక్షలకు విక్రయించారు. భాస్కర్ నాయుడు దీన్ని విక్రయించేందుకు నెల క్రితం ఓ వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్లాడు. అక్కడ వజ్రం నకిలీదని తెలియడంతో అవాక్కయ్యాడు. వజ్రం తిరిగి ఇచ్చేస్తాను, డబ్బులు ఇవ్వండని సదరు ముగ్గురు వ్యక్తులను బతిమలాడినా ససేమిర అనడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
కాణిపాకం దర్శన వేళల కుదింపు
కాణిపాకం (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులకు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే స్వామి వారి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఆలయ ఈవో వెంకటేశు తెలిపారు. ఈవో కార్యాలయంలో ఆయన ఆలయంలోని అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వామివారి దర్శన వేళల్లో మార్పు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులంతా దర్శన వేళలను కుదించడానికి ఒప్పుకోవడంతో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉన్న దర్శన వేళలను సాయంత్రం 7 గంటలకు కుదించారు. క్యూ లైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లడ్డు పోటులో, నిత్య అన్నదానం వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు లేని భక్తులను దర్శనానికి అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు సేకరిస్తే సమాచారమివ్వండి కాణిపాక ఆలయాభివృద్ధికి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు విరాళాలను అడిగితే వెంటనే సమాచారం అందించాలని ఈవో కోరారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి ఆలయ అభివృద్ధి పేరిట విరాళాలు సేకరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు విరాళాలు అడిగిన వెంటనే స్థానిక పోలీసులకు, ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇక్కడ చదవండి: ఏప్రిల్ 24 నుంచి తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు హన్మంతుని జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించిన టీటీడీ -
తిరుమల సందర్శకులకు తీపికబురు!
తిరుమల తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం పంచదేవాలయం టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ కింద తిరుమలలోని శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత నుంచి ప్యాకేజీ మొదలవుతుంది. తిరుపతికి చేరుకునే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించడం కోసం ఈ ప్యాకేజీని రూపొందించారు. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ. పంచదేవాలయం టూర్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ(ముగ్గరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.5,270 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ(ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.7,010, సింగిల్ ఆక్యుపెన్సీ (ఒకరు మాత్రమే) ధర రూ.11,750. ప్యాకేజీలో తిరుపతిలో ఒక రోజు అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు
-
కాణిపాకంలోని హోటల్లో అగ్నిప్రమాదం
సాక్షి, చిత్తూరు: కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ఉన్న జై గణేష్ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి హోటల్లో ఉన్న నెయ్యి డబ్బాలకు అంటుకున్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటల్లోని సిలిండర్లను బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కాణిపాకంలో వినాయక బ్రహ్మోత్సవాలు
-
తిరుమల, కాణిపాకంలో రెడ్ అలర్ట్
తిరుపతి క్రైం: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం అప్రమత్తమైంది. శ్రీలంక నుంచి కొందరు తీవ్రవాదులు సముద్ర మార్గాన ఏపీకి చేరే అవకాశం ఉందని సమాచారం రావడంతో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ వెంకట అప్పల నాయుడు ఆదేశాల మేరకు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై నిఘా పెంచారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇండస్ట్రీలు, హాస్పిటల్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేశారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులను గమనిస్తే స్థానిక పోలీసులకు, 100, 8099999977 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లోకి వచ్చే వ్యక్తుల పాస్‌పోర్టులు తనిఖీ చేయడంతోపాటు భద్రతను పెంచినట్లు తెలిపారు. నగర ప్రవేశ ప్రాంతాల వద్ద వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ, అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్బన్ ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. తిరుమల, తిరుపతితో పాటు తిరుచానూరు, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు ప్రాంతాలు, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
కాణిపాకంలో అధికారుల లీలలు
కాణిపాకం: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన స్వామివారి చెంత (నిత్య సేవలు నిర్వహిస్తే) మొక్కులు తీర్చుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కాగా ప్రధాన సేవల్లో ప్రత్యేక అభిషేకం, సత్యప్రమాణం, నిజరూప దర్శనం, పాలాభిషేకం, గణపతి హోమం, కల్యాణోత్సవ సేవలు ఉన్నాయి. ఈసేవల్లో పాల్గొనే వారికి దేవస్థానం ప్రత్యేక ప్రసాదాలను, చిత్రపటాలను, వస్త్రాలను సంప్రదాయ బద్ధంగా తరతరాలుగా అందజేస్తోంది. అయితే ఈక్రమంలో ప్రస్తుతం ఆలయంలో నిత్య సేవల్లో పాల్గొనే భక్తులకు ఇచ్చే ప్రసాదాల్లో అధికారులు అనధికార కోతలు విధిస్తున్నారు. తాజాగా అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు అందించే స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను రద్దు చేశారు. వాటి స్థానంలో దేవస్థానం క్యాలెండర్లను అందజేస్తున్నారు. దీంతో భక్తులు ఐదు నెలల తరువాత క్యాలండర్లు ఇస్తే తామేం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రసాదాల్లో కోత వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నిత్యసేవలో పాల్గొని ప్రత్యేక అభిషేకం చేసే భక్తులకు దేవస్థానం నుంచి మొదటగా రూ.550 చెల్లించి టికెట్ కొనుగోలు చేయాలి. ఒక్కో టికెట్‌పై ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. అభిషేకసేవకు కావాల్సిన సామాగ్రిని దేవస్థానమే సమకూరుస్తుంది. ఈసేవలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం నుంచి కండువ, జాకెట్టు, స్వామివారి చిత్రపటం, రెండు రకాలతో కూడిన నైవేద్య ప్రసాదాన్ని అందజేసే వారు. అయితే ప్రస్తుతం ఒక క్యాలెండర్, జాకెట్టు, కండువ, రెండు రకాల ప్రసాదాలు (కొద్దిమేరకు ) పంపిణీ చేస్తున్నారు. అభిషేకం పేరు చెప్పి అడ్డంగా దోపిడీ కాణిపాక ఆలయంలో ఉదయం 6, 9, 11 గంటలకు మూడు పర్యాయాలుగా ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఒక్కో అభిషేకానికి సగటున (రద్దీ సమయాల్లో ) 30 నుంచి 40 అభిషేకాలు నిర్వహిస్తారు. ఈక్రమంలో మూడు అభిషేకాలకు 100 వరకు టికెట్లను ఒక్కొక్కటి రూ. 550 చొప్పున విక్రయిస్తారు. ఈ లెక్కన దేవస్థానానికి రోజుకు రూ. 55,000 వరకు ఆదాయంగా వస్తుంది. అయితే ఈ సామూహిక సేవకు ఉపయోగించే సామాగ్రి పరిశీలిస్తే మూడు టెంకాయలు, పసుపు, కుంకుమ, గంధం, తేనె, నెయ్యి, పన్నీరు, పాలు (ప్యాకెట్ పాలు), అరటి పండ్లు, ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్, చెక్కెరను వినియోగిస్తారు. వీటి మొత్తానికి కలిపి ఒక్క విడతకు కేవలం రూ.2 నుంచి రూ.4 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ లెక్కన మూడు అభిషేకాలకూ రూ. 10వేలలోపే వెచ్చిస్తున్నారు. ఈక్రమంలో చివరికి స్వామివారి పటం కూడా తొలగించడం వివాదా నికి కారణమవుతోంది. గతంలో వెండి కాయిన్, లడ్డూ కూడా ఇచ్చేవారని అయితే ప్రస్తుతం పులిహోరా వంటి వాటిలోనూ కనీస నాణ్యత లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకే .. అభిషేక సేవలో పాల్గొనే భక్తులకు మొదట్లో స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందించే వాళ్లం. అయితే తాజాగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు.. వాటి స్థానంలో క్యాలెండరు, కొద్దిపాటి ప్రసాదాలను అందజేస్తున్నాం. ఇందులో మా ప్రమేయం లేదు. భక్తులు సహకరించాలని కోరుతున్నాం. – స్వాములు,ఆలయ సూపరింటెండెంట్ -
బస్సు టైరు ఢాం..!
కాణిపాకం: తిరుపతి నుంచి 60 మంది ప్రయాణికులతో కాణిపాకం వస్తున్న ఆర్టీసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. ఏపీ 10 జడ్ 0119 నంబరు గల బస్సు తిరుపతి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 60 మందితో కాణిపాకానికి వస్తూ ప్రమాదానికి గురైంది. ఈ బస్సు కాణిపాకానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా వెనుక చక్రం ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. సమీపంలో రోడ్డు పక్కగా విద్యుత్ స్తంభం ఉంది. విద్యుత్ వైర్లు తగిలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు చెప్పారు. ఎండ వేడి మూలాన టైరు పేలి ఉంటుందని ఆర్టీసి సిబ్బంది పేర్కొన్నారు. మండుటెండలో టైరు పేలి బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొంతసేపటికి వెనుక వచ్చిన మరో బస్సులో ప్రయాణికులను కాణిపాకానికి చేర్చారు. కాలం చెల్లిన బస్సులే ఎక్స్‌ప్రెస్ సర్వీసులు! తిరుపతి–కాణిపాకం మధ్య ఎక్కువ శాతం ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను ఎక్స్‌ప్రెస్ పేరుతో నడుపుతోందని భక్తులు మండిపడుతున్నారు. రోజుకు 10 సర్వీసులతో వంద ట్రిప్పుల వరకు నిత్యం ఐదు వేల మందిని గమ్యానికి చేరుస్తున్నాయి. అయితే 70 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా పల్లె వెలుగు బస్సులను నడుపుతున్నారని, వీటిని నుంచి వచ్చే శబ్దాలతో రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందుల నడుమ ప్రయాణం చేస్తున్నట్టు ప్రయాణికులు ఆగ్రహించారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు మంచి కండిషన్లో ఉన్న బస్సులనే ఈ మార్గంలో నడపాలని కోరారు. -
పుష్కరిణిలోకి దూకి వివాహిత..
కాణిపాకం: పుష్కరిణిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం కాణిపాకంలో కలకలం సృష్టించింది. ఉదయం 11 గంటల వేళ నిజరూప దర్శన సేవ సమయంలో ఇది చోటుచేసుకోవడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను కాపాడారు. అదృష్టవశాత్తు పుష్కరిణిలో ఎక్కువగా నీళ్లు లేకపోవడం, మూడు అడుగుల లోతు వరకే నీళ్లు ఉండడంతో కాపాడటం సులువైంది. ఆపై, ప్రథమ చికిత్స చేసి వివాహితను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాక్షాత్తు ఆమె భర్త కూడా ఆలయంలో పనిచేసే ఇంజినీరింగ్ శాఖ ఉద్యోగి కావడంతో తొలుత అతడిని పిలిపించారు. ఆ తర్వాత దంపతుల కుటుంబ సభ్యులనూ సైతం పిలిపించారు. దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులకు తలబొప్పి కట్టించారు. వారిద్దరికీ కౌన్సెలింగ్‌తో ఎస్ఐ కృష్ణమోహన్ ఎట్టకేలకు హితబోధ చేసి దంపతుల కలహాలకు తాత్కాలికంగా తెరదించారు. ఇంటికి సాగనంపారు. ఎస్ఐ కథనం..యాదమరి మండలానికి చెందిన లావణ్యకు కాణిపాకం ఆలయంలోని ఇంజినీరింగ్ శాఖలో పనిచేస్తున్న బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వాసి బద్రికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్త రెండు నెలలుగా ఇంటికి రాలేదంటూ లావణ్య కాణిపాకం ఈఓ కార్యాలయానికి వచ్చి తన భర్తను నిలదీసింది. అతను ఆమెను తీవ్రంగా మందలించి చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఆలయ పుష్కరిణిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. -
ఉభయదారులకు అన్యాయం
కాణిపాకం: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామకానికి సంబంధించిన వివాదాన్ని మరిచిపోకముందే.. కాణిపాకం ట్రస్టుబోర్డు ఏర్పాటులో తెలుగుదేశం ప్రభుత్వం తప్పటడుగు వేసింది. ఆలయ చరిత్రను పరిశీలిస్తే.. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కాణిపాకం దేవస్థానంలో ఉభయదారుల వ్యవస్థ కీలకమైంది. వంద సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధిలోనూ, వరసిద్ధుని వార్షిక బ్రహ్మోత్సవాల్లోనూ.. వీరు నిర్వహించే వాహన సేవలు కీలకం. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఈక్రమంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ట్రస్టు బోర్డు ఏర్పాటులో ఉభయదారులకు కీలక బాధ్యతలు ఇచ్చేవారు. అయితే ఇటీవల టీడీపీ ప్రభుత్వం విడుదల అయిన ట్రస్టు బోర్టు నియామక జీఓ ప్రకారం మొత్తం 14 మంది బోర్డు సభ్యుల్లో 11 మంది బయటి ప్రాంతాల వారికి పదవులను కట్ట బెట్టింది. అందులోనూ ఒక కీలక సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరికి కూడా పదవి ఇవ్వక పోవడం సర్వత్రా విమర్శలకు తీవ్ర తావిస్తోంది. దేవస్థానం అభివృద్ధిలో ముఖ్యపాత్ర వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అభివృద్ధి, ఆలయ జీర్ణోద్ధరణ సమయంలో భూములు విరాళంగా అందజేసి, స్వామివారికి రోజూ పూజాదికాలు సంప్రదాయబద్ధంగా జరిపించడంలో 14 గ్రామాల ప్రజలు కీలకపాత్ర వహించారు. అప్పటి నుంచి ఉభయదారులుగా ఏర్పడి ఆలయ అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దాదాపు పది వేలకు పైగా కుటుంబాలు ఉన్న ఈ ఉభయదారుల్లో వంశపారంపర్యంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో పాలక మండలి ఏర్పాటు చేసేటప్పుడు సగానికి పైగా ఉభయదారులనే బోర్డు సభ్యులు నియమించేవారు. అయితే తాజాగా విడుదల చేసిన పాలక మండలి సభ్యుల్లో కేవలం ముగ్గురు ఉభయదారులనే సభ్యులుగా నియమించడం.. ఆలయ అభివృద్ధితో ఎలాంటి సంబంధం లేని 11 మంది వ్యక్తులకు బోర్డు సభ్యులుగా పదవులను కేటాయిం చడం చర్చనీయాంశమైంది. టీడీపీ వర్గ పోరుతోవెయ్యి కుటుంబాలు అన్యాయం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వర్గ పోరుతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఒక సామాజిక వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది. వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్న తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈవ్యవహారంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి లలిత కుమారి చక్రం తిప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న మరో వర్గానికి అధిష్టానం వద్ద చుక్కెదురు అయ్యినట్లు సమాచారం. దీంతో ఆ వర్గం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఉభయదారులకు అన్యాయం కాణిపాకం దేవస్థాన బోర్డు నియామకంలో స్థానిక ఉభయదారులకు తీరని అన్యాయం జరిగింది. ఉభయదారులకు సగానికి పైగా బోర్డులో కేటాయింపులు జరగాలని గతంలో న్యాయస్థానం సైతం ఆదేశించింది. అయితే ప్రస్తుత అధికార పార్టీ వాటిని పూర్తిగా విస్మరించి నిబంధనలకు విరుద్ధంగా నియామకం చేపట్టింది. 14 మందిలో బయటి ప్రాంతాల్లో ఉన్న 11 మందికి కేటాయింపులు చేశారు. ఇది పెద్దమోసం. – చిన్నారెడ్డి, స్థానిక ఉభయదారులు, చినకాంపల్లె ఓ సామాజిక వర్గానికి పూర్తిగా స్థానం కల్పించ లేదు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ట్రస్టు బోర్డు నియామకంలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క స్థానం కూడా దక్కక పోవడం దారుణం. వెయ్యికి పైగా కుటుంబాలు ఉన్న మా సామాజిక వర్గం ప్రతినిధులు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నెమలి వాహన సేవను నిర్వహించడం ఆనవాయితీ. ప్రభుత్వం నిబంధనలు పూర్తిగా విస్మరించింది. – జగన్నాథ రెడ్డి,ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్, కాణిపాకం -
కాణిపాకంలో బ్రెజిల్ కంపెనీకి నిధుల తరలింపు
-
రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ సీపీ నేత దుర్మరణం
తవణంపల్లి : చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందగా అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయవేలూరు సీఎమ్సీ ఆసుపత్రికి తరలించారు. కాణిపాకంకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ రెడ్డి , ఆయన తల్లి ధనమ్మ, భార్య, ఇద్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ్మ అక్కడికక్కడే మరణించగా, మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయవేలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కాణిపాకం దేవస్థానంలో అపశ్రుతి
-
ఫోన్ లిఫ్ట్ చేస్తే ఖాతాలో నగదు మాయం
మోసగాళ్ల కొత్త పంథా.. అకౌంట్ మూసేస్తున్నారంటూ కుచ్చుటోపీ కాణిపాకం: కాణిపాకం వాసులకు గత పది రోజులుగా కంటి మీద కునుకు లేదు! ఆలయ ఉద్యోగులే టార్గెట్‌గా అనామక వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే వారి బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైపోతోంది. ఇలా వారం రోజుల్లో దాదాపు పదిమంది నగదు కోల్పోయారు. దేవస్థానం వద్ద పోలీసు స్టేషన్లో పనిచేసే ఒక అధికారికి ఇటీవల ఓ నంబరు నుంచి ఫోను వచ్చింది. ‘మేం ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాం.. మీ అకౌంట్ నంబరు నిలిపివేయబడింది. పునరుద్ధరించుకోండి’ అంటూ అవతలి వ్యక్తి చెప్పారు. అకౌంట్ నంబర్.. ఏటీఎం నంబర్ చెప్పాల్సిందిగా కోరాడు. వివరాలు చెప్పినా కొద్ది సేపటికే ఆయన అకౌంట్ నుంచి డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అదేవిధంగా దేవస్థానంలోని శివాలయంలో పనిచేసే ఓ ప్రధాన అర్చకుడికి ఫోన్ వచ్చింది. పై వివరాలన్నీ చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే రూ.30 వేలు అకౌంట్ నుంచి వెళ్లిపోయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయనకు గుండె ఆగినంత పనైంది. బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి విషయం తెలియజేశారు. పరిశీలిస్తామని మేనేజర్ సమాధానం చెప్పారు. చదువురాని వారే టార్గెట్.. మోసగాళ్లు ప్రధానంగా చదువురాని వారిని టార్గెట్‌గా చేసుకున్నారు. వారి మాటల ఆధారంగా అంచనా వేస్తారు. అటు పిమ్మట పూర్తి వివరాలను రాబడతారు. అక్కడినుంచి గుట్టుచప్పుడు కాకుండా తమపని కానిచ్చేస్తున్నారు. వీరు ప్రధానంగా డ్వాక్రా మహిళలు, ఉపాధి సిబ్బంది, గ్రామీణ మహిళలు, దుకాణాలు నిర్వహిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఫోన్ చేశారు...నగదు పోయింది సోమవారం ఉదయం 7 గంటలకు ఎస్బీహెచ్ మేనేజర్ రామచంద్రారెడ్డిని అంటూ 97090 6564 నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ ఖాతా నిలిపివేయబడింది. మీ ఖాతా నంబర్, ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పమని’ అడిగారు. తెలియజేశాను. 10 నిమిషాల్లోనే ఖాతాలోని నగదు పూర్తిగా మాయమైంది. ఖాతాలో ఉన్న రూ.30 వేలు చోరీ చేశారు. -శేఖర్, కాణిపాకం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అడ్రస్ లేని నంబర్లతో ఫోన్ చేసి నగదు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు, ఫైనాన్స్, లక్కీ డ్రా, లాటరీ సెంటర్ల నుంచి ఫోను చేస్తున్నట్లుగా చెబితే వివరాలు చెప్పొద్దు. జాగ్రత వహించాలి. - ఎత్తిరాజులు, కాణిపాకం ఏఎస్ఐ -
కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీల తయారీ
పోలీసుల అదుపులో నిందితులు...? సెల్, కంప్యూటర్ దుకాణదారులే సూత్రదారులు వివరాలు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు కాణిపాకం(ఐరాల): కాణిపాకం కేంద్రంగా పైరసీ సీడీలను తయారు చేస్తున్నట్టు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిందితులను కాణిపాకం, స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి సీడీలను చిత్తూరు, తిరుపతికి సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు నుంచి సీడీల దిగుమతి కాణిపాకం అటు తమిళనాడుకు ఇరవై కిలోమీటర్లు, కర్ణాటకకు యాభై కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడున్న సెల్, కంప్యూటర్ దుకాణదారులు సీడీలను చెన్నై, బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. చిత్తూరుతోపాటు, కాణిపాకానికి కొత్త సినిమా వచ్చిన గంటల వ్యవధిలోనే వాటి ప్రింట్లు సెల్ షాపు, కేఫ్ల్లోకి చేరిపోతున్నాయి. ఇక్కడి నుంచి మెయిల్, వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా జిల్లా, రాష్ట్రం నలుమూలలకు క్షణాల్లో చేరిపోతున్నాయి. అలాగే సీడీలు, డీవీడీలుగా మార్చి చిత్తూరు, తిరుపతి, పలమనేరు పట్టణాలకు చేరవేస్తున్నారు. థియేటర్ సిబ్బందితో సత్సంబందాలు కాణిపాకం, చిత్తూరుకు చెందిన థియేటర్ సిబ్బందితో సంబందాలు కలిగిన కొందరు వ్యక్తులు కొత్త సినిమా వచ్చిన వెంటనే పైరసీ తయారీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అలా తీసిన ప్రింట్‌ను నాణ్యతను బట్టి రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు పైరసీ తయారీదారులకు విక్రయిస్తున్నారు. ఫ్యాన్స్ చేతికి చిక్కిన సందర్బాలు ఉన్నాయి కాణిపాకం సినిమా థియేటర్లో ఇటీవల కొందరు వ్యక్తులు సెల్ కెమెరాల్లో కొత్త సినిమా రికార్డు చేస్తుండగా ఫ్యాన్స్ పట్టుకున్నారు. వారిని థియేటర్ యజమానులు అదుపులోకి తీసుకొని వారించి పంపేశారు. అలాగే మొబైల్స్‌ను తీసుకొని సినిమా విజువల్స్‌ను తొలగించిన సందర్భాలూ ఉన్నాయి. వీటిపై ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు పైరసీ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. సినిమా చట్టం ప్రకారం పైరసీ సీడీలు, డీవీడీలను తయారు చేసిన వా రు, కొనుగోలు చేసిన వారు కూడా శిక్షార్హులే. వారిని ఉపేక్షించేది లేదు. అభిమానులు ఎవరైనా పోలీసులకు సమాచారం ఇవ్వచ్చు. సెల్ షాపులు, కంప్యూటర్ కేంద్రాలపై నిఘా పెంచుతాం. – ఆదినారాయణ, చిత్తూరు వెస్ట్ సీఐ -
నేడు వరసిద్ధుడి తెప్పోత్సవం
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఆదివారం తెప్పోత్సవం జరగనున్నది. ఇందులో భాగంగా రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలపై (పల్లకిపై) ఆలయ పుష్కరణిలో విహరించనున్నారు. ఉత్సవ ఉభయదారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి లడ్డూ వేలం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజైన తెప్పోత్సవం అనంతరం స్వామి వారికి ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేవారు. 21 కిలోల బరువుగల లడ్డూ ప్రసాదాన్ని మూల విగ్రహం వద్ద 21 రోజుల పాటూ ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి ఉత్సవాల అనంతరం ఆలయ ఆస్థాన మండపంలో వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పీ పూర్ణచంద్రరావు తెలిపారు. తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు వినాయకస్వామి వారి ఆలయంలో ఆదివారం నిర్వహించే ప్రత్యేకోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున జరుగుతున్న తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రరావు శనివారం తెలిపారు. ఆలయ కార్యాలయ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకోత్సవాల్లో ఆఖరి రోజున ఆదివారం రాత్రి స్వామివారికి వైభవంగా వాహన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ పుష్కరిణిలో నిర్వహించనున్న ఈ ఉత్సవం కోసం పుష్కరిణిని శుద్ధి చేసి నీటిని నింపినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తూరు సీఐ ఆదినారాయణ, కాణిపాకం ఎస్ఐ నరేష్‌బాబు మాట్లాడుతూ ఉత్సవ కార్యక్రమాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
విఘ్ననాథుడికి విరి సేవ
కాణిపాకం(ఐరాల): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాల సందర్భంగా బుధవారం రాత్రి పూలంగి సేవ నేత్రపర్వంగా జరిగింది. సిద్ధి,బుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పరిమళాలు వెదజల్లే దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం స్వామివారి మూల విగ్రహనికి విశేష అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలోని అర్ధ, మూషిక, ఆన్వేటి, సుపథ మండపాలను పరిమళభరిత పుష్పమాలికలతో అలంకరించారు. రాత్రి 9గంటలకు సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను పల్లకిపై అలంకార మండపానికి వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలు, దేశ, విదేశీ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆన్వేటీ మండపానికి వేంచేపు చేసి ఊయలలో కొలువుదీర్చి ఊంజల్ సేవ నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల నడుమ ఉభయ దేవేరులతో సేదతీరుతున్న వినాయక స్వామిని దర్శించి భక్తులు పులకించారు. అనంతరం ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈఓ పి.పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు చిట్టి బాబు, మల్లి కార్జున పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన వాహనసేవలకు విస్తృత ఏర్పాట్లు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రత్యేకోత్సవాలలో భాగంగా రేపటినుంచి జరిగే ప్రధాన వాహన సేవలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కల్పవృక్ష వాహనం, శుక్రవారం విమానోత్సవం, శనివారం పుష్పపల్లకి, ఆదివారం తెప్పోత్సవం జరుగునుంది. ఈఓ పి.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పుష్పాలంకరణలు జరుగుతున్నాయి. పుష్కరిణిని శుభ్రం చేసి కొత్త నీటిని నింపడం, విద్యుత్ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. -
విఘ్నేశ్వరునికి క్షీరాభిషేకం
ముఖ్యఅతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు కాణిపాకం (ఐరాల) : స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ప్రత్యేకోత్సవాలలో సోమవారం రాత్రి నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవ సందర్భంగా ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం చేశారు. ఉభయదారులు మణికంఠేశ్వర ఆలయం నుంచి పాలబిందెలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. తొలుత స్థానిక మరగదాంబికా సమేత మనికంఠేశ్వరస్వామి ఆలయంలో క్షీర కలశాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ ఆర్సీపీకి చెందిన నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆర్కే.రోజా, డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆలయంలోని అలంకార మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ చంద్రప్రభ వాహనసేవకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ అగరంపల్లెకు చెందిన జీ.కేశవులు సోమవారం ఉదయం తమ గ్రామం నుంచి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ అధికారులకు అందజేశారు.వీటిని స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లిఖార్జున పాల్గొన్నారు. -
కుళ్లిన క్యాబేజీలాంటి ప్యాకేజీ- ఎమ్మెల్యే రోజా
- వెంకయ్య, చంద్రబాబే హోదాకు అడ్డంకి - కాణిపాకంలో విలేకరుల సమావేశంలో నగిరి ఎమ్మెల్యే రోజా కాణిపాకం (చిత్తూరు జిల్లా): నెల్లూరుకు చెందిన కేంద్రమంతి వెంకయ్య నాయుడు, చిత్తూరుకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాకు అడ్డుగా ఉన్నారని నగిరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు ఆ ఊసే ఎత్తుడంలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటున్నారన్నారు. ప్యాకేజీలకు ఆశపడి ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వారిద్దరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని కాణిపాకం వినాయక స్వామివారిని కోరుకున్నట్లు రోజా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు సమకూరుతాయన్నారు. కుళ్లిన క్యాబేజీలాంటి ప్యాకేజీని రాష్ట్రానికి కేటాయించి రాష్ట్రానికి మనుగడ లేకుండా చేస్తున్నారన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నవారు ఇప్పుడు అవసరంలేనట్టు ప్రవర్తించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యేక హోదా కేటాయించాలని తెలిపారు. -
యాళి వాహనం పై వరసిద్ధుడి వైభవం
– వేడుకగా ప్రత్యేకోత్సవాలు కాణిపాకం(ఐరాల): స్వయంభువు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు యాళి వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో స్వామివారి మూలవిగ్రహనికి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని చందనాలంకృతులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేతులైన స్వామివారి ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోకి వేంచేపు చేసి, విశేషాలంకరణ చేశారు. తరువాత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చి యాళి వాహనంపై అధిష్టింపజేశారు. మంగళవాయిద్యాలు, మేళతాలాల నడుమ కాణిపాకం పురవీధులు, మాడవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం వారు, అగరంపల్లికి చెందిన నరశింహరెడ్డి కుమారులు, చినకాంపల్లికి చెందిన సుబ్బారెడ్డి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పి.పూర్ణచంద్రారావు, ఏసీ వెంకటేష్, ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, స్వాములు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున, ఉత్సవ కమిటీ సభ్యులు, ఉభయదారులు పాల్గొన్నారు. -
రేపు వరసిద్ధుడి రథోత్సవం
ఐరాల: కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం జరగనున్న రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆలయ మూషిక మండపంలో రథ కలశాలు, గొడుగులు,బ్రహ్మను ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం,ప్రత్యేక పూజలు చేశారు.ఆ తరువాత గొడుగులు, రథసారథి ,బ్రహ్మకు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించి రథంపై ప్రతిష్టించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు. -
శేష వాహనంపై గౌరీపుత్రుడు
–పులకించిన భక్తజనం కాణిపాకం(ఐరాల): స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్ద శేషవాహనంపై ఆలయ మాడవీధులు, కాణిపాకం పురవీధుల్లో విహరించారు. శేష వాహన ఉత్సవానికి కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాంపల్లె, మిట్టిండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మెజీపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లెలకు చెందిన కమ్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారి మూల విగ్రహనికి సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. నివేదన చేసి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు.రాత్రి స్వామివారికి పెద్దశేషవాహన సేవ నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలో ఉంచారు. ఊరేగింపుగా వచ్చిన ఉభయదారుల ఉభయంతో ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకి పై తీసుకు వచ్చి పెద్దశేషవాహనంపై అధిష్టింప చేశారు.ప్రత్యేక పూజల అనంతరం కాణిపాకం పురవీధుల్లో మేళతాళాలు,మంగళవాయిద్యాలనడుమ ఊరేగించారు. ఈకార్యక్రమంలో ఉభయదారులు,ఉత్సవకమిటీ సభ్యులు,అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. -
కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- తొలిరోజు రాత్రి హంసవాహనంపై విహరించిన గణనాథుడు - ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి ఐరాల (చిత్తూరు జిల్లా) : కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ఏకదంతుడి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం గ్రామోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు అంకురార్పణ చేశారు. అన్వేటి మండపంలో ఉన్న స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ సంధి, పుణ్యాహవచనంలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ఉదయం స్వాతి నక్షత్రం, కన్యాలగ్నంలో 7 గంటల నుంచి 8 గంటల మధ్య ధ్వజస్తంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై ఊరేగారు. కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన శీరికరుణీక వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. -
కాణిపాకంలో అల్లరి నరేష్
కాణిపాకం: ప్రముఖ హీరో అల్లరి నరేష్ కుటుంబ సమేతంగా గురువారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
కాణిపాకం హుండీలో తలనీలాలు చోరీ
-
కాణిపాకం ఆలయంలో తలనీలాల చోరీ
కాణిపాకం: ఇప్పటివరకు విలువైన వస్తువులను దొంగలు చోరీ చేయడాన్ని చూసాం. కానీ... వినడానికి కొంచెం వింతగానే ఉన్నా తలనీలాలను సైతం దొంగలు వదలడం లేదు. చిత్తూరు జిల్లాలో సుప్రసిద్ధ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో తలనీలాల చోరీ జరిగింది. మహిళా భక్తులు స్వామి వారికి సమర్పించిన తలనీలాలను హుండీలో ఉంచగా చోరులు తస్కరించుకు పోయారు. మహిళా భక్తుల తలనీలాలను కల్యాణకట్ట వద్ద ఉన్న ఓ ప్రత్యేక హుండీలో వేస్తుంటారు. శుక్రవారం రాత్రి హుండీలో తలనీలాలను కొక్కెం సాయంతో ఆగంతకులు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. చోరీకి గురైన తలనీలాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు అంటున్నారు. -
కాణిపాకం ఆలయంలో దొంగతనం
-
అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్
కాణిపాకం: తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ఆదివారం కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. భన్వర్‌లాల్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని భన్వర్‌లాల్ దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో అధికారులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
కాణిపాకంలో అపచారం
-
కాణిపాకంలో అపచారం
చిత్తూరు: కాణిపాకంలో అపచారం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కాణిపాకంలో జరగాల్సిన వేదఘోషకు వేదపండితులు రాలేదు. పండితులు రానిదే అభిషేకం వద్దని ఉభయదారులు అంటున్నారు. దీంతో దేవుడి దర్శనాలు ఆగిపోయాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కాణిపాకంలో టీడీపీ నేతల అత్యుత్సాహం
చిత్తూరు: కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గణేశుడికి మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో బోర్డు సభ్యులను కూడా దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఛైర్మన్, పాలకవర్గం, అధికారులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. -
కాణిపాకంలో 21రోజులపాటు బ్రహ్మోత్సవాలు
-
కాణిపాకంలో టవరెక్కిన ఆలయ మాజీ సిబ్బంది
కాణిపాకం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన సిబ్బంది గడువు ముగియడంతో సోమవారం వారిని విధుల నుంచి తొలగించారు. దాంతో మనస్థాపానికి గురైన వసంత్, అరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆలయంలో పనిచేసేందుకు 126 మంది సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నారు. వారి కాంట్రాక్టు గడువు మూడేళ్లు నిన్నటితో ముగియడంతో ఆలయ ఈవో పాత ఏజెన్సీని రద్దు చేసి కొత్త ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే తొలగించిన 126 మందిలో ఇద్దరు మంగళవారం ఉద్యోగాలు పోవడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కారు. ఆందోళనకారులు ఆలయ ఈవోను ఘెరావ్ చేశారు. దీంతో ఆలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కొత్త ఏజెన్సీకి ఆలయ ఉభయదార్లు మద్దతు ప్రకటిస్తుండగా, కొత్త ఏజెన్సీవారికి బోర్డు సభ్యుల మద్దతు ఉంది. దాంతో సమస్య జటిలంగా మారింది. కాణిపాకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరి సెల్ టవర్ ఎక్కినవారిని దిగమని విన్నవిస్తున్నారు. ఆందోళనకారులు దిగకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
కాణిపాకం మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం
-
కాణిపాకం ప్రసాదాల్లో నాణ్యత ఏదీ
ఐరాల :కాణిపాకంలోని సత్యప్రమాణాలస్వామి సన్నిధిలో విక్రయించే లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గుతోంది. వడలు కూడా అందరికీ అందడం లేదు. నాణ ్యమైన సరుకులు వాడకపోవడం, తయారీలో సూచనలు పాటించని కారణంగా ఈ పరిస్థితి ఏర ్పడింది. 70 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని గతంలో రూ.5 విక్రయిం చేవారు. ఆ తరువాత 100 గ్రాములు రూ. 10 విక్రయించేవారు. ఒక్కొక్క లడ్డూపై రోజుకు రూ.2.70 దేవస్థానానికి నష్టం వస్తుందనే నెపంతో 100 గ్రాముల లడ్డూ 80 గ్రాములు చేసి భక్తులకు అందిస్తున్నా రు. ఇలా రోజురోజుకూ లడ్డూ సైజు తగ్గిపోతుండడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సగటున ఒక్క రోజుకు 10 వేల నుంచి 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఆశించిన మేరకు లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదనే వ్యాఖ్యలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. రుచి కూడా తగ్గినట్లు చెబుతున్నారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం, ఎండుద్రాక్ష, జీడీపప్పు, యాలకులు కనిపించకపోవడం, కలకండ ఎక్కువగా వాడటం తదితర కారణాలతో నాణ్యత కొరవడినట్లు భావిస్తున్నారు. అధికారుల సూచనలుగాలికి గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ పోటు సిబ్బందికి ఇచ్చిన సూచనలు, సలహాలను గాలికి వదిలేశారు. బూందీ ముద్దగా తయారుచేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటారు. నెయ్యితోనే చేతులు తడుపుకుని లడ్డుముద్దను తయారు చేస్తే నాణ్యత రెట్టింపుగా ఉం టుందని సూచించారు. పోటులో పని చేసే సిబ్బంది తలకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదు. వడల తయారీలోనూ అంతే.. లడ్డూతో పాటు వడలకూ విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అవి ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదు. రోజుకు 500 నుంచి 600 వడలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తారు. ఇవి కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. దీనికి తోడు వడలు తయారైన వెంటనే పైరవీలతో పోటు వద్దనే సగానికి పైగా అదృశ్యమవుతాయి. మిగిలినవి కనీసం గంట సమయం కూడా కౌంటర్లో లభించవు. చర్యలు తీసుకుంటున్నాం లడ్డూ, వడలు నాణ్యతగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు సూచించిన విధంగా ప్రసాదాల తయారీకి శ్రద్ధ తీసుకుంటాం. వడలు తక్కువ సంఖ్యలో తయారవుతున్న మాట వాస్తవమే. స్టోరులో అందిస్తున్న నెయ్యి, పిండి, ఇతర వస్తువుల్లోని నాణ్యతతో మాకు సంబంధం లేదు. - చిట్టెమ్మ, పోటు ఇన్చార్జ్, జేఈవో, కాణిపాకం -
తెప్పలపై వినాయకుని విహారం
పూతలపట్టు : కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారి బ్ర హ్మోత్సవాల్లో చివరిదైన తెప్పోత్సవం గురువారం రా త్రి అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు కొలువుదీరి విహరిస్తూ భక్తులకు దర్శన మిచ్చారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున వేద పండితులు మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం చందనాలంకరణచేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణచేసి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. మంగళవాయిద్యాల మధ్య స్వామివారిని సర్వంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. జై వినాయక జైజై వినాయక నామస్మరణతో కాణిపాక క్షేత్రం మార్మోగింది. తెప్పోత్సవ కార్యక్రమానికి పుండరీక నాయుడు, శేషాద్రి నాయుడు ఆయన సోదరులు, దామోదరనాయుడు, హనుమంత నాయుడు, రామకృష్ణారెడ్డి కుమారులు, కొత్తపల్లె దామోదరనాయుడు, రామచంద్రనాయుడు, లంకిపల్లె మోహన్‌బాబు ఆయన సోదరులు ఉభయదార్లుగా వ్యవహరించారు. ఈ వేడుకలో ఈవో పూర్ణచంద్రరావుతోపాటు ఆలయ సిబ్బంది ఈఈ వెంకట్‌నారాయణ, ఏసీ వెంకటేష్, ఏఈవోలు ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఎస్వీ. కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వినాయకుని మహాప్రసాదం వేలం వినాయకుని బ్రహ్మోత్సవాల సందర్భంగా 21 కిలోల లడ్డూ ప్రసాదాన్ని గురువారం రాత్రి బహిరంగ వేలం వేశారు. 21రోజుల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి మూలవిరాట్ వద్ద నైవేద్యంగా ఉంచిన లడ్డూ ప్రసాదానికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో బహిరంగ వేలం వేశారు. ముగిసిన బ్రహ్మోత్సవాలు వినాయకస్వామివారి ఆలయంలో ఆగస్టు 29న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి తెప్పోత్సవంతో విజయవంతంగా ముగిశాయి. 9 రోజుల పాటు దేవస్థానంవారు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. తరువాత 11 రోజులు ఉభయదార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. ప్రతిరోజు ఉదయం, రాత్రి స్వామివారి వాహనసేవలు నిర్వహించారు. -
కాణిపాకం వరసిద్ధి వినాయకుని ప్రత్యేక ఉత్సవాలు
-
గణనాథుని రథోత్సవ వైభవం
కాణిపాకం : కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. మూల విగ్రహన్ని సుగంధ పరి మళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్వాలంకార భూషితులైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉం చి విశేష సమర్పణ చేశారు. ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య ఆలయం నుంచి ఉరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేశారు. కాకర్లవారిపల్లికి చెందిన ఎతిరాజులునాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకానికి చెందిన పూర్ణచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కుమారులు హరిప్రసాద్ రెడ్డి ఉభయదారులుగా వ్యవహరిం చారు. ఉభయదారుల ఉభయం వచ్చిన అనంత రం స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవా న్ని ప్రారంభించారు. అశ్వాలు, వృషభాలు సర్వసైన్యాధిపతులు ముందు వెళుతుండగా స్వామివారు రథంపై కాణిపాకం వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు, చిల్లరనాణేలు చల్లి మొక్కు లు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకొంది. ఈఓ పూర్ణచంద్రరావు ఆలయ ఏఈఓలు ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఉభయదారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు, కీలు గుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. -
దర్జాగా వచ్చాడు...వెళ్లాడు....
-
ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన చరణ్ రాజ్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని ప్రముఖ నటుడు చరణ్ రాజ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వద్ద తుపాకీ ఉన్నట్లు ఆలయ సిబ్బంది తనిఖీలలో భాగంగా గుర్తించారు. ఆ తుపాకీని ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలోకి తుపాకీతో వెళ్లకూడదన్న విషయం తనకు తెలియదని చరణ్ రాజు ఆలయ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో తనను భక్తులు, ఆలయ అధికారులు క్షమించాలని చరణ్ రాజు కోరారు. దాంతో ఆలయ అధికారులు చరణ్ రాజ్‌కు తుపాకీ ఇచ్చేశారు. -
కాణిపాకంలో గణేష్ ఉత్సవాలు
-
108కూ నిర్లక్ష్యం జబ్బు
చిత్తూరు(సిటీ): రోగులు, క్షతగాత్రుకు ప్రాణంపోసే 108 సిబ్బందిలోనూ నిర్లక్ష్యం జబ్బు పట్టుకుంటోంది. వింతవ్యాధితో బాధపడుతున్న ఓరోగిని అత్యవసరంగా తిరుపతి రుయా వైద్యశాలకు తీసుకెళ్లాలని, లేని పక్షంలో ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్యులు చెప్పినా కాణిపాకం 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనం...వివరాలలోకి వెళ్లితే... నగర పరిధిలోని శ్రీలంక కాలనీకి చెందిన సోమనాథం, ఒరిస్సాకు చెందిన కీర్తన ప్రేమ వివాహం చేసుకున్నారు. కీర్తన నాలుగు నెలల క్రితం ఒరిస్సాలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు పుట్టినప్పటి నుంచి కీర్తన వింత వ్యాధితో బాధపడుతోంది. దీంతో కీర్తనను చికిత్స నిమిత్తం మంగళవారం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చేర్పించారు. అయితే ఆమె పరిశీలించిన వైద్యులు, రోగి స్థితి సీరియస్‌గా ఉందని, మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకుపోవాలని సిఫార్సు చేశారు. రోగిని తిరుపతికి తరలించడానికి డబ్బు లేక అల్లాడుతున్న నిరుపేద ముత్తు పరిస్థితిని చూసి చలించిన డాక్టర్ 108కు ఫోన్ చేశారు. అప్పటికే వైద్యశాలలో ఉన్న కాణిపాకం రూట్ వాహనంలో రోగిని తీసుకెళ్లేందుకు ఉపక్రమించారు. అయితే తమ వాహనంలో రోగిని తిరుపతికి తీసుకెళ్లేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ, అ వాహ నం సిబ్బంది అక్కడ నుంచి జారుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి చూసి స్పందించారు. డాక్టర్లతో చర్చించడంతో పాటు, కొంత ఆర్థిక సహాయం చేసి, చిత్తూరు వైద్యశాల అంబులెన్స్‌లో తిరుపతికి తరలింపజేశారు. -
సుమో బీభత్సం: ఏడుగురికి గాయాలు
హైదరాబాద్ : శ్రీవరసిద్ధి వినాయకుడు కొలువైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం సుమో వాహనం బీభత్సం సృష్టించింది. ఆ వాహనం డ్రైవర్ తప్ప తాగి రోడ్డుపై అతివేగంతో కారు నడిపాడు. దాంతో ఏడుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక భక్తులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సుమోను సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాణిపాకంలోని ఆసుపత్రికి తరలించారు. -
ఇదేమిటి వినాయకా!
కాణిపాకం లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు 20 నుంచి 30 గ్రాముల బరువు తగ్గిన వైనం నెయ్యి నాణ్యతా అంతంతమాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్ సూచనలు గాలికి కాణిపాకం: కాణిపాకం వినాయకుని లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. గతంలో 70 గ్రాముల బరువుతో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రూ.5కు విక్రయించేవారు. రెండేళ్ల క్రితం లడ్డూ బరువును వంద గ్రాములకు పెంచుతూ ధర రూ.10 చేశారు. ఇందుకు తగినట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. తయారు చేసిన గంటల వ్యవధిలోనే గట్టిగా మారుతోంది. రుచిలోనూ చాలా మార్పులు ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. పైగా లడ్డూ బరువు 75 నుంచి 85 గ్రాములకు మించడం లేదు. లడ్డూ తయారీకి వాడే వస్తువుల నాణ్యత లోపం, కల్తీ నెయ్యి వాడకం, ఎండు ద్రాక్షా, జీడిపప్పు, యాలకులు కనిపించకపోవడం, కల కండ ఎక్కువగా వాడడం తదితర కారణాలతో ప్రసాదంపై భక్తులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సూచనలు గాలికి.. గతంలో పోటు సిబ్బందికి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన సూచనలు, సలహాలను గాలికి వదిలేశారు. బూందిని ముద్దగా తయారు చేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటుంటారు. నెయ్యితోనే చేతులు తడుపుకుని లడ్డు ముద్దను తయారు చేస్తే ప్రసాదం గట్టిగా మారదని వారు సూచించారు. పోటులో పని చేసే సిబ్బంది తలకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదు. లడ్డూ తయారీలో నైపుణ్యం కలి గిన వారికి ప్రాముఖ్యత ఇవ్వడం లేద ని, అందువల్లే ప్రసాదం రంగులో మార్పులు కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు. వడల తయారీలోనూ నిర్లక్ష్యమే ఆలయంలో లడ్డూలతోపాటు వడలకూ విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అవి ఎప్పుడూ అందుబాటులో ఉండ డం లేదు. రోజుకు 500 వడలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తారు. ఒక్కొక్క వడను రూ.5కు విక్రయిస్తారు. ఇవి కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. దీనికితోడు వడలు తయారైన వెంటనే పైరవీలతో పోటు వద్దనే సగానికి పైగా అదృశ్యమవుతాయి. మిగిలి నవి కనీసం గంట సమయం కూడా కౌంటర్లో లభించవు. ఆలయ అధికారులు స్పందించి ప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించడమేగాక వడలు భక్తులకు కావాల్సినన్ని అందివ్వాల్సి ఉంది. -
కాణిపాకం పాలకమండలి ఖరారు !
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలకమండలిని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం జారీ చేసినట్లు సమాచారం. కాణిపాకం పాలకమండలి ఖరారు! కాణిపాకం, న్యూస్‌లైన్: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలకమండలిని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు మంగళవారం జారీ చేసినట్లు సమాచారం. ఆలయానికి ఐదేళ్లుగా పాలక మండలి లేదు. ప్రభుత్వం రెండు సార్లు నియమించినా ఆలయ ఉభయదారులు కోర్టును ఆశ్రయించడంతో సమస్య ఏర్పడింది. దీంతో ఐదేళ్లుగా పాలక మండలి లేకుండానే ఆలయ పాలన సాగింది. ఎట్టకేలకు పాలక మండలిని ప్రభుత్వం మంగళవారం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సభ్యులుగా సుబ్రమణ్యంరెడ్డి (మైనగుండ్లపల్లె), చక్రవర్తి (కాణిపాకం), వేణుగోపాల్ (ఉప్పోళ్లూరు), ప్రభాకర్ (దివిటివారిపల్లె), లత (కాణిపాకం), కె.టి.రామరాజ్ (బెంగళూరు), ఈశ్వరయ్య (కడప), పుష్పాహఫ్ (రాయచోటి), సత్యనారాయణ శెట్టి (కలికిరి), సోమశేఖర్ గురుకుల్ (శివాలయం ప్రధాన అర్చకులు) ఎన్నికైనట్లు సమాచారం. వీరు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. తర్వాత సుబ్రమణ్యంరెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే తమకు అవకాశం కల్పించలేదని ఆలయ ఉభయదారులు పాలకమండలి నియామకం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జగన్
కాణిపాకం : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ....జగన్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, పట్టువస్త్రంతో సత్కరించారు. కాగా జగన్‌తో పాటు స్వామిని దర్శించున్నవారిలో పార్టీ నేతలు మిధున్‌రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు జగన్‌తో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపారు. కాగా సమైక్య శంఖారావం యాత్రను ఆయన ఈరోజు ఉదయం కాణిపాకం నుంచి ప్రారంభించారు. -
ఘనంగా గణనాథుని రథోత్సవం
కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభువు కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి రథో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సర్వాలంకార భూషితుడైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో విశేష సమర్పణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య ఆలయం నుంచి ఉరేగింపుగా తీసుకువచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేశారు. ఉభయదారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవాన్ని ప్రారంభించారు. ముందు భాగంలో అశ్వాలు, ఒంటెలు, వృషభాలు, సర్వసైన్యాధిపతులు నడవగా స్వామివారు రథంపై ఊరేగుతూ కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథంపై బొరుగు లు, మిరియాలు, చిల్లరనాణేలు చల్లి మొక్కులు తీ ర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. రథోత్సవానికి దేవస్థానం వారు, కాకర్లవారిపల్లెకు చెందిన ఎతిరాజులునాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకంకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు హరిప్రసాద్ రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. రథోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పలు విచిత్ర వేషధారణలు, కీలు గుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పూతలపట్టు ఎమ్మెల్యే రవి, ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఘనంగా ప్రారంభమైన కాణిపాకం బ్రహ్మోత్సవాలు
కాణిపాకం, న్యూస్‌లైన్: స్వయంభు వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఆలయంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషిక పటాన్ని ఉంచి గణపతి పూజ, స్వస్తివాచనం, నవగ్రహ సంధి, పుణ్యాహవచనంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వాతి నక్షత్రం, కన్యాలగ్నంలో 7 నుంచి 8గంటల మధ్య ధ్వజస్తంభంపై మూషికపటాన్ని ఎగురవేశారు. అనంతరం ధ్వజ స్తంభానికి క్షీర, చందనద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి ప్రత్యేక పూజలు జరిపి ధ్వజ స్తంభాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. అలంకార మండపంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం కాణిపాకం పురవీధులలో మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి గ్రామోత్సవం జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అన్వేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 108 కలశాలను ఉంచారు. అందులో పుట్టమన్ను, నవధాన్యాలు వేసి ప్రత్యేక పూజలతో అంకురార్పణ నిర్వహిం చారు. బ్రహ్మోత్సవాల బాధ్యతలు నిర్వహించే ఈవో పూర్ణచంద్రరావుకు ఆలయ ప్రధాన అర్చకులు రక్షా బంధన కంకణాన్ని తొడిగారు. హంస వాహనంపై గణనాథుడు బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి గణనాథుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవానికి కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లెకు చెందిన శీర్కరుణీకర్ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. మందుగా స్వామివారి మూలవిరాట్‌కు ఉభయదారులతో ప్రత్యేక అభిషేకం నిర్వహిం చారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు. ఆలయ అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలతో ముందు గా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల మధ్య పురవీధులలో ఊరేగించారు. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆదికేశవపిళ్లై, ఏసీ గురుప్రసాద్, ఆలయ ఏఈవోలు ఎన్ఆర్.కృష్ణారెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, సూపరింటెం డెంట్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
కాణిపాకంలో స్వామి వారికి ధ్వజారోహణం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలోని వరసిద్ది వినాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి ధ్వజారోహాణం కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్బంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్రమూర్తి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ రోజు సాయంత్రం స్వామివారు హంస వాహనంపై గ్రామ పుర వీధుల్లో ఉరేగనున్నారు. కాణిపాకం వరసిద్ధ వినాయకుని బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాణిపాకం చేరుకున్నారు. భక్తుల కోసం కాణిపాకం ఆలయ ఉన్నతాధికారులు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
కాణిపాకంలో వినాయక చవితి ఉత్సవ శోభ
-
కాణిపాకంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
చిత్తూరు: కాణిపాకంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి బ్రహ్మాత్సవాలు ప్రారంభమవుతాయి. 21రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వయంభు వినాయకుడి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి రోజు ప్రారంభం కావడం ఇక్కడ ఆనవాయితి. ఆదిదేవుణ్ణి మొదట పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు వినాయకుడికి చాలా భక్తి శ్రద్దలతో నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుతారు. అయితే రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు 21రోజుల పాటు నిర్వహిస్తారు. కాణిపాకం చుట్టూ ఉన్న 14 గ్రామాల ప్రజలు బ్రహ్మత్సవాల్లో పాల్గొంటారు. ఆలయం తరఫున 11 రోజులు మరో 9 రోజులు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ పూజాకార్యక్రమాల్లో అందరికి ప్రాధాన్యతనిస్తారు. వినాయక చవితితో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాలంకరణ, భక్తుల బారులుతీరేందుకు ఏర్పాట్లు, స్నానాల కోసం కోనేరు, వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.