ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన చరణ్ రాజ్ | Actor Charan Raj enter into temple with revolver | Sakshi
Sakshi News home page

ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన చరణ్ రాజ్

Published Fri, Aug 29 2014 9:47 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన చరణ్ రాజ్ - Sakshi

ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన చరణ్ రాజ్

చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని ప్రముఖ నటుడు చరణ్ రాజ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వద్ద తుపాకీ ఉన్నట్లు ఆలయ సిబ్బంది తనిఖీలలో భాగంగా గుర్తించారు. ఆ తుపాకీని ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలోకి తుపాకీతో వెళ్లకూడదన్న విషయం తనకు తెలియదని చరణ్ రాజు ఆలయ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో తనను భక్తులు, ఆలయ అధికారులు క్షమించాలని చరణ్ రాజు కోరారు. దాంతో  ఆలయ అధికారులు చరణ్ రాజ్కు తుపాకీ ఇచ్చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement