Charan Raj
-
అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది: చరణ్ రాజ్
‘నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ ఉంటే డబ్బు ఇవ్వకున్నా నటిస్తా. ఆ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా మళ్లీ గతంలో జెంటిల్ మేన్ తరహా పోలీస్ క్యారెక్టర్స్ ఇస్తామంటే వద్దని చెప్పాను. అందుకే నాకు తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది’ అని సీనియర్ నటుడు చరణ్ రాజ్ అన్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన టాలీవుడ్లో నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. ‘పలాస" ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ప్రతిఘటన, జెంటిల్ మేన్ సినిమాలు నన్ను నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. వివిధ భాషల్లో దాదాపు 600 చిత్రాల్లో నటించాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉండేది. 8 ఏళ్లు అర్థాకలితో కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితంగా 40 ఏళ్ల కెరీర్ దక్కింది. ఈ సుదీర్ఘమైన కెరీర్ లో అనేక రకాల క్యారెక్టర్స్ చేశాను. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ తో విలన్ గా నటించాను. ఇప్పుడు మళ్లీ అలాంటివే నా దగ్గరకు తీసుకొస్తే వద్దని చెబుతున్నాను. నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నాను. ►‘నరకాసుర’ కథను డైరెక్టర్ సెబాస్టియన్ చెప్పినప్పుడు ఈ కథ, కథనాల్లోని కొత్తదనం బాగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమాలు వదిలేసే నేను వెంటపడి మరీ ఈ సినిమా చేస్తానని చెప్పాను. డైరెక్టర్ గా ఈ సినిమాను ఒక న్యూ అప్రోచ్ తో తెరకెక్కించారు. ఆడియెన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ అవుతుంది. రేపు థియేటర్స్ లో సినిమా చూస్తే ఇది నిజమని అర్థమవుతుంది. ఈ కథ డీటెయిల్స్ చెబితే థియేటర్ లో చూసే ఇంట్రెస్ట్ పోతుంది. ►‘నరకాసుర’ సినిమాలో నేను ఒక పాము లాంటి స్వభావమున్న క్యారెక్టర్ చేశాను. అంటే మంచి వాళ్లతో మంచిగా ఉంటాడు. చెడ్డ వాళ్లతో చెడుగా ఉంటాడు. నా కెరీర్ లో నేను చేసిన ఒక యూనిక్ క్యారెక్టర్ ఇది. నాతో పాటు మా అబ్బాయి కూడా ఈ సినిమాలో నటించాడు. అతనికి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ సెబాస్టియన్. ► గతంలో నేను, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కోట గారు..ఇలా చాలా లిమిటెడ్ విలన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఇవాళ హీరో, విలన్ అనేది లేదు. సంజయ్ దత్, జగపతి బాబు, అర్జున్ లాంటి వాళ్లంతా విలన్స్ గా నటిస్తున్నారు. మంచి క్యారెక్టర్ చేయాలి, ప్రేక్షకుల అభిమానం పొందాలి అనేది ఒక్కటే ఇవాళ ప్రతి నటుడికి ఉన్న లక్ష్యం ► తెలుగు సినిమా ఇండస్ట్రీ ది బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అంటే బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు సినిమా త్వరగా అడాప్ట్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. హీరోలకు వంద, నూటా యాభై కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. గతంలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, టి కృష్ణ గారు వంటి దర్శకులు వేసినా బాటలో టాలీవుడ్ యంగ్ జెనరేషన్ పయణిస్తోంది. -
11 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన 'అతడు' నటుడు
సినీ ప్రముఖుల వారసులు ఎక్కువగా సినీ రంగంపైనే మక్కువ చూపుతుంటారు. ఆ విధంగా పలువురు హీరోల వారసులు హీరోలుగా పరిచయం కావడం చూస్తున్నాం. తాజాగా ప్రముఖ నటుడు చరణ్‌రాజ్ తన వారసుడిని కథానాయకుడిగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు చరణ్‌రాజ్. ఈయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దేవ్‌ని కథానాయకుడిగా పరిచయం చేయాలని చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. దేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలో సుస్మిత, ప్రియదర్శిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. చరణ్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఒక కీలకపాత్రను పోషిస్తున్నారు. మత్స్యకార యువకుడికి మార్వాడి యువతికి మధ్య జరిగే ప్రేమ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని సమాచారం. కాగా చరణ్‌రాజ్ 1999లో దర్శకుడిగా అవతారమెత్తి అన్నన్ తంగచ్చి అనే చిత్రాన్ని రూపొందించారు. 2012లో యదార్థ ప్రేమకథ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు మెగాఫోన్ పట్టడం విశేషం. తన వారసుడ్ని కథానాయకుడిగా నిలబెట్టే ప్రయత్నమే ఈ చిత్రం అని భావించవచ్చు. దీనికి కుప్పన్ అని టైటిల్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. చదవండి: బయటేమో అన్నం పడేశావ్.. హౌస్‌లో ఎంగిలి మెతుకులు తిన్నావ్.. వాటే ఓవర్ యాక్టింగ్ -
‘రీనాక్’ను అధిరోహించిన నల్లమల విద్యార్థి
సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాన్ని ఎక్కిన చరణ్‌రాజ్ అచ్చంపేట: నల్లమలకి చెందిన ఓ విద్యార్థి మంచు పర్వతం అధిరోహించి సత్తా చాటాడు. 20 రోజుల సాహస యాత్రలో భాగంగా సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో హిమాలయంలోని డార్జి లింగ్లో ఉన్న రీనాక్ పర్వతాన్ని ఆధిరోహించాడు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పు నుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామానికి చెందిన పెబ్బేటి విజయ నిరంజన్ దంపతుల కుమారుడు చరణ్‌రాజ్ హైదరాబాద్ బీసీ హాస్టల్లో ఉంటూ కేశవ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. చరణ్‌కు మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ మంత్రి పి.రాములు ప్రోత్సాహంతో పర్వతారోహణ చేసే అవకాశం దక్కింది. నవంబర్ 13 నుంచి ఈనెల 10 వరకు దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 35 మందితో ఈ సాహస యాత్ర సాగింది. బృందంలో తెలంగాణ నుంచి చరణ్‌రాజ్‌కు మాత్రమే అవకాశం లభించింది. అక్కడ బీసీ వెల్ఫేర్ ఫ్లెక్సీ, భారతదేశ త్రివర్ణపతాకం, అంబేడ్కర్ ఫ్లెక్సీని ఎగరవేశారు. అక్కడి పరిస్థితులను తట్టుకోలేక 20 మంది మధ్యలోనే వెనుదిరిగారని, మిగతా 15 మందితో కూడిన బృందం రీనాక్ పర్వతాన్ని అధిరోహించిందని చరణ్‌రాజ్ చెప్పాడు. ఈ సందర్భంగా చరణ్‌రాజ్‌ను సోమవారం హైదరాబాద్ చైతన్యపురిలోని తెలంగాణ బీసీ మహాసభ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. -
దర్జాగా వచ్చాడు...వెళ్లాడు....
-
ఆలయంలోకి తుపాకీతో ప్రవేశించిన చరణ్ రాజ్
చిత్తూరు : చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని ప్రముఖ నటుడు చరణ్ రాజ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వద్ద తుపాకీ ఉన్నట్లు ఆలయ సిబ్బంది తనిఖీలలో భాగంగా గుర్తించారు. ఆ తుపాకీని ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలోకి తుపాకీతో వెళ్లకూడదన్న విషయం తనకు తెలియదని చరణ్ రాజు ఆలయ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో తనను భక్తులు, ఆలయ అధికారులు క్షమించాలని చరణ్ రాజు కోరారు. దాంతో ఆలయ అధికారులు చరణ్ రాజ్‌కు తుపాకీ ఇచ్చేశారు.