సినీ ప్రముఖుల వారసులు ఎక్కువగా సినీ రంగంపైనే మక్కువ చూపుతుంటారు. ఆ విధంగా పలువురు హీరోల వారసులు హీరోలుగా పరిచయం కావడం చూస్తున్నాం. తాజాగా ప్రముఖ నటుడు చరణ్‌రాజ్ తన వారసుడిని కథానాయకుడిగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు చరణ్‌రాజ్. ఈయనకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దేవ్‌ని కథానాయకుడిగా పరిచయం చేయాలని చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అది ఇప్పటికి కార్యరూపం దాల్చుతోంది. దేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలో సుస్మిత, ప్రియదర్శిని హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. చరణ్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయన ఒక కీలకపాత్రను పోషిస్తున్నారు. మత్స్యకార యువకుడికి మార్వాడి యువతికి మధ్య జరిగే ప్రేమ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుందని సమాచారం.
కాగా చరణ్‌రాజ్ 1999లో దర్శకుడిగా అవతారమెత్తి అన్నన్ తంగచ్చి అనే చిత్రాన్ని రూపొందించారు. 2012లో యదార్థ ప్రేమకథ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇన్నాళ్లకు మెగాఫోన్ పట్టడం విశేషం. తన వారసుడ్ని కథానాయకుడిగా నిలబెట్టే ప్రయత్నమే ఈ చిత్రం అని భావించవచ్చు. దీనికి కుప్పన్ అని టైటిల్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
చదవండి: బయటేమో అన్నం పడేశావ్.. హౌస్‌లో ఎంగిలి మెతుకులు తిన్నావ్.. వాటే ఓవర్ యాక్టింగ్
Comments
Please login to add a commentAdd a comment