అందుకే తెలుగులో గ్యాప్‌ వచ్చింది: చరణ్‌ రాజ్‌ | Actor Charan Raj Interesting Comments At Narakasura Movie Trailer Launch Event, Deets Inside - Sakshi
Sakshi News home page

అలాంటి క్యారెక్టర్‌ ఉంటే డబ్బులు ఇవ్వకున్నా నటిస్తా: చరణ్‌ రాజ్‌

Published Wed, Oct 25 2023 3:59 PM | Last Updated on Wed, Oct 25 2023 5:34 PM

Actor Charan Raj Talk About Narakasura Movie - Sakshi

‘నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ ఉంటే డబ్బు ఇవ్వకున్నా నటిస్తా. ఆ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా మళ్లీ గతంలో జెంటిల్ మేన్ తరహా పోలీస్ క్యారెక్టర్స్ ఇస్తామంటే వద్దని చెప్పాను. అందుకే నాకు తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది’ అని సీనియర్‌ నటుడు చరణ్‌ రాజ్‌ అన్నారు. చాలా గ్యాప్‌ తర్వాత ఆయన టాలీవుడ్‌లో నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’.  ‘పలాస" ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్‌ రాజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

ప్రతిఘటన, జెంటిల్ మేన్ సినిమాలు నన్ను నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. వివిధ భాషల్లో దాదాపు 600 చిత్రాల్లో నటించాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉండేది. 8 ఏళ్లు అర్థాకలితో కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితంగా 40 ఏళ్ల కెరీర్ దక్కింది. ఈ సుదీర్ఘమైన కెరీర్ లో అనేక రకాల క్యారెక్టర్స్ చేశాను. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ తో విలన్ గా నటించాను. ఇప్పుడు మళ్లీ అలాంటివే నా దగ్గరకు తీసుకొస్తే వద్దని చెబుతున్నాను. నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నాను.

‘నరకాసుర’ కథను డైరెక్టర్ సెబాస్టియన్ చెప్పినప్పుడు ఈ కథ, కథనాల్లోని కొత్తదనం బాగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమాలు వదిలేసే నేను వెంటపడి మరీ ఈ సినిమా చేస్తానని చెప్పాను. డైరెక్టర్ గా ఈ సినిమాను ఒక న్యూ అప్రోచ్ తో తెరకెక్కించారు. ఆడియెన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ అవుతుంది. రేపు థియేటర్స్ లో సినిమా చూస్తే ఇది నిజమని అర్థమవుతుంది. ఈ కథ డీటెయిల్స్ చెబితే థియేటర్ లో చూసే ఇంట్రెస్ట్ పోతుంది.

‘నరకాసుర’ సినిమాలో నేను ఒక పాము లాంటి స్వభావమున్న క్యారెక్టర్ చేశాను. అంటే మంచి వాళ్లతో మంచిగా ఉంటాడు. చెడ్డ వాళ్లతో చెడుగా ఉంటాడు. నా కెరీర్ లో నేను చేసిన ఒక యూనిక్ క్యారెక్టర్ ఇది. నాతో పాటు మా అబ్బాయి కూడా ఈ సినిమాలో నటించాడు. అతనికి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ సెబాస్టియన్.

► గతంలో నేను, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కోట గారు..ఇలా చాలా లిమిటెడ్ విలన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఇవాళ హీరో, విలన్ అనేది లేదు. సంజయ్ దత్, జగపతి బాబు, అర్జున్ లాంటి వాళ్లంతా విలన్స్ గా నటిస్తున్నారు. మంచి క్యారెక్టర్ చేయాలి, ప్రేక్షకుల అభిమానం పొందాలి అనేది ఒక్కటే ఇవాళ ప్రతి నటుడికి ఉన్న లక్ష్యం

► తెలుగు సినిమా ఇండస్ట్రీ ది బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అంటే బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు సినిమా త్వరగా అడాప్ట్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. హీరోలకు వంద, నూటా యాభై కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. గతంలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, టి కృష్ణ గారు వంటి దర్శకులు వేసినా బాటలో టాలీవుడ్ యంగ్ జెనరేషన్ పయణిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement