
టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫారిన్‌లో చిల్ అవుతున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
జీవితంతం సంతోషంగా..
'కీర్తి- నితేశ్ జంటగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని క్యాప్షన్ జోడించింది. ఈ ఫోటోల్లో ఉపాసన, ఎన్టీఆర్ (Jr NTR)- లక్ష్మీ ప్రణతి తదితరులు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర అనిరుధ్ రవిచంద్రన్‌తో కలిసి మహేశ్ కూతురు సితార, సుకుమార్ కూతురు సుకృతి సెల్ఫీ కూడా దిగారు.
నాటు నాటు పాటకు స్టెప్పేసిన అఖిల్
ఈ పెళ్లిలో అఖిల్ సహా మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నాటునాటు పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో చరణ్, తారక్ డ్యాన్స్ చేసినట్లుగానే ఇక్కడ కూడా అఖిల్ వేరొకరితో కలిసి స్టెప్పులేశాడు. ఈ సెలబ్రిటీల హంగామా చూసిన ఫ్యాన్స్ మిగతా హీరోలు కూడా ఈ పార్టీలో ఉంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు.
Akhil Akkineni Dance For "NattuNattu" Song 🔥
Happy to witness His Dance 🥹@AkhilAkkineni8 Anna Akhil6 lo Dance kummeyandi #AkhilAkkineni #RRR pic.twitter.com/xxg7OKuz3r— Vinay Vk18 (@Vinay_Akhil999) February 23, 2025
చదవండి: హీరోయిన్ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్ హీరో
Comments
Please login to add a commentAdd a comment