
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ (#NTRNEEL) నుంచి కీలకమైన అప్డేట్ వచ్చేసింది. వేట ప్రారంభమైంది అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తారక్ ఫోటోలను విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ (NTR) సెట్లోకి రానున్న సంగతిని ప్రకటించిన మేకర్స్ తాజాగా ఆయన ఫోటోలను విడుదల చేశారు. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్.. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఇలా ఇద్దరూ తెలుగులో కలిసి చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొలైంది. ఎన్టీఆర్ లేకుండా, ఇతర తారాగణంపై ప్రశాంత్ నీల్ కొన్ని సీన్స్ తెరకెక్కించారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ జనవరి 9న విడుదల కానుంది.
(ఇదీ చదవండి: బాలకృష్ణ కారుకు ఫ్యాన్సీ నంబర్.. ఎన్ని లక్షలో తెలుసా..?)
ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. తారక్ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్‌లో భాగంగా కొద్దిరోజుల క్రితమే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసి అక్కడ కొన్ని సీన్స్ చిత్రీకరించారు. అయితే, ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే సీన్లు మాత్రం శ్రీలంకలోని కొలంబోలో ప్లాన్ చేశారు. ఆల్రెడీ యూనిట్‌లోని కీలక సాంకేతిక నిపుణులు కొలంబో వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను ఫైనల్ చేశారని తెలిసింది. అందుకోసం తారక్ ఇప్పటికే కొలంబో చేరుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్(Jr NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ స్టోరీతో నిర్మిస్తున్నారు . ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

‘సలార్’ సినిమా ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా విషయంలోనూ ఫాలో అవుతాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు(NTR Birthday) సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్టు టాక్. ఇందులో మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు సమాచారం. దీనికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
THE HUNT BEGINS…🔥🔥
Man of Masses @tarak9999 sets off to join the shoot from April 22nd 💥💥
ABSOLUTE MAYHEM 🌋 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @Tseries pic.twitter.com/DJ6cT47FC8— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2025