ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై ఆప్డేట్‌ ఇచ్చిన మేకర్స్‌ | Jr NTR And Prashanth Neel Movie Will Be Shooting Began In August | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై ఆప్డేట్‌ ఇచ్చిన మేకర్స్‌

Published Mon, May 20 2024 10:58 AM | Last Updated on Mon, May 20 2024 11:59 AM

Jr NTR And Prashanth Neel Movie Will Be Shooting Began In August

'మ్యాన్ ఆఫ్ మాసెస్‌' ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక వచ్చింది. తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది. నేడు (మే 20) ఆయన పుట్టినరోజు కానుకగా సినిమా అప్డేట్‌ను చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ 2024 ఆగష్టు నుంచి ప్రారంభం కానుందని మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. చిత్రీకరణ ప్రధానంగా విదేశాల్లో ఉంటుందనే టాక్‌ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావొచ్చనే ఊహాగానాలూ ఇటీవల తెరపైకి వచ్చాయి. 

తాజాగా ఈ సినిమాకు ‘డ్రాగన్‌’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. మరోవైపు ‘డ్రాగన్‌’ టైటిల్‌ హక్కులు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ దగ్గర ఉన్నాయని, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ అండ్‌ టీమ్‌ అడగడంతో తారక్‌పై ప్రేమతో ఈ టైటిల్‌ను కరణ్‌కు ఇచ్చేశారని బాలీవుడ్‌ సమాచారం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement