
‘ఆర్‌ఆర్‌ఆర్, దేవర’ వంటి వరుస విజయాల తర్వాత హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్, సలార్’ వంటి విజయాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లోప్రారంభమైంది.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించి, లొకేషన్‌లోని ఓ ఫొటోని షేర్ చేసింది. ‘‘మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్ నీల్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మూడువేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ ఆరంభించాం.
తర్వాతి షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇప్పటివరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు ప్రశాంత్ నీల్. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనున్నాం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జనవరి 9న మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: భువన్ గౌడ, సంగీతం: రవి బస్రూర్.
Comments
Please login to add a commentAdd a comment