పురాతన ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో వైరల్! | Tollywood Hero Jr Ntr Special Pooja At Karnataka Temple With His Wife | Sakshi
Sakshi News home page

Jr Ntr: ప్రముఖ ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో షేర్ చేసిన కాంతారా హీరో!

Sep 2 2024 11:04 AM | Updated on Sep 2 2024 12:07 PM

Tollywood Hero Jr Ntr Special Pooja At Karnataka Temple With His Wife

యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల అమ్మతో కలిసి ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం తన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పర్యటనలో తన తల్లి షాలిని, భార్య లక్ష్మిప్రణతీ కూడా వెంట ఉన్నారు. ఈ ఆలయం దర్శనంతో తన తల్లి కల నెరవేరిందని జూనియర్‌ వెల్లడించారు.

తాజాగా తన కుటుంబంతో కలిసి మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్ దంపతులతో కలిసి ఎన్టీఆర్‌, ప్రణతీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అడవుల్లోని ఉన్న గుహల్లో ఉన్న మూడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయాన్ని సందర్శించటారు. అక్కడే ఉన్న ఆలయ గుహల్లో ఎన్టీఆర్‌ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను రిషబ్ శెట్టి తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తండ్రి జయంతిని స్మరించుకుంటూ..

ఇవాళ నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ తన తండ్రిని స్మరించుకున్నారు. ఆయన ఫోటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement