మా అమ్మ కల నెరవేరింది : ఎన్టీఆర్‌ | Jr NTR fulfils mother forever dream of bringing him to her hometown | Sakshi
Sakshi News home page

మా అమ్మ కల నెరవేరింది : ఎన్టీఆర్‌

Published Sun, Sep 1 2024 1:02 AM | Last Updated on Sun, Sep 1 2024 1:02 AM

Jr NTR fulfils mother forever dream of bringing him to her hometown

‘‘మా అమ్మ (శాలినీ) స్వగ్రామం కుందాపురానికి నన్ను తీసుకొచ్చి ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనం చేసుకోవాలనేది ఆమె చిరకాల కల.. అది ఎట్టకేలకు నెరవేరింది’’ అన్నారు హీరో ఎన్టీఆర్‌. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని ఎన్టీఆర్‌ శ్రావణ శనివారం సందర్భంగా దర్శించుకున్నారు. ఆయన వెంట తల్లి శాలినీ, భార్య లక్ష్మీ ప్రణతి, కన్నడ హీరో రిషబ్‌ శెట్టి, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కూడా ఉన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు భక్త కనకదాసు దర్శించుకున్న కనక కిటికీ ద్వారా అందరూ నల్లనయ్య (శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని దర్శించారు.

దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి... ‘‘ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో అమ్మ (శాలినీ) కల ఎట్టకేలకు నెరవేరింది. అమ్మ పుట్టినరోజు సెప్టెంబర్‌ 2. ఆమె బర్త్‌డేకి రెండు రోజుల ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆమెకు నేనిచ్చిన అత్యుత్తమ బహుమతి.

విజయ్‌ కిరగందూర్‌ సార్‌కి (హోంబలే ఫిలింస్‌ అధినేత) థ్యాంక్స్‌. నా ప్రియ మిత్రుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే నా ప్రియ మిత్రుడు రిషబ్‌ శెట్టి కూడా నాతో వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్‌. కాగా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’ మొదటి భాగం ఈ నెల 27న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement