
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తారని తెలిసింది. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీకి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతీయ సినిమా చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు సమయం ఆసమన్నమైంది. ఎన్టీఆర్‌నీల్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ సరికొత్త యాక్షన్‌ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మొదటి జనవరిలోనే షూటింగ్ ప్రారంభిస్తారని భావించినా అలా జరగలేదు. దీంతో ఈ ఫిబ్రవరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ యాక్షన్ మొదలైంది. కాగా.. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా విదేశాల్లో జరుగుతుందని, డిఫరెంట్ గెటప్స్‌లో ఎన్టీఆర్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.
The SOIL finally welcomes its REIGN to leave a MARK in the HISTORY books of Indian Cinema! 🔥🔥#NTRNeel shoot has officially begun.
A whole new wave of ACTION & EUPHORIA is ready to grip the Masses 💥💥
MAN OF MASSES @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial… pic.twitter.com/yXZZy2AHrA— Mythri Movie Makers (@MythriOfficial) February 20, 2025
Comments
Please login to add a commentAdd a comment