![Dragon: Tovino Thomas in NTR Jr and Prashanth Neel big budget film](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/10/Tovino-Thomas.jpg.webp?itok=GvjJjZs8)
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనున్నారు. అలాగే ఈ సినిమాలోని ఇతర కీలకపాత్రల్లో మలయాళ నటులు టొవినో థామస్, జోజూ జార్జ్ నటించనున్నట్లు తెలిసింది. ఆల్రెడీ రుక్మిణీ వసంత్, టొవినో థామస్‌ల లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
ఈ సినిమా చిత్రీకరణ సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుందని తెలిసింది. తొలి షెడ్యూల్‌ను కర్ణాటకలో ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ‘డ్రాగన్’ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక... కెరీర్‌లో యాభైకిపైగా సినిమాల్లో నటించిన టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. 2023లో వచ్చిన ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో, 2024లో వచ్చిన ‘ఏఆర్‌ఎమ్’ చిత్రాల్లో టొవినో థామస్ హీరోగా నటించగా, ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై హిట్ మూవీస్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment