Rakshit Atluri
-
ఓటీటీలో సైకో థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ఈ ఏడాది జులై 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో హీరో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు.తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం సుమారు నాలుగు నెలలకు ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించడంతో కాస్త ఆసక్తి కలిగించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 2నుంచి ‘ఆపరేషన్ రావణ్’ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా తెలుగు ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు.ఇలాంటి సమయంలో తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘ఆపరేషన్ రావణ్’ మూవీ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ రావణ్నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులునిర్మాత: ధ్యాన్ అట్లూరిరచన-దర్శకత్వం: వెంకట సత్యసంగీతం: శరవణ వాసుదేవన్సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టివిడుదల తేది: జులై 26, 2024పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి. తాజాగా ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. రక్షిత్ తండ్రి వెంకట సత్య ఈ మూవీలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఆపరేషన్ రావణ్’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. తన కూతురు కూడా కనిపించడం లేదని తమ్ముడి వర్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథనం సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నేరం జరిగిన తీరు..వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్..దాన్ని హీరో ఎంత తెలివిగా ఛేదించాడన్న అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బిగిసడలని స్క్రీన్‌ప్లే ఉండాలి. అప్పుడే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టగలుగుతాం. ఆపరేషన్ రావణ్ సినిమా విషయంలో ఆ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సఫలం అయింది. సైకో థ్రిల్లర్ చేసే హత్యలు.. దాన్ని చూపించిన తీరు ఉత్కంఠబరితంగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్ మాత్రం సాదా సీదా అనిపిస్తుంది. సైకో కిల్లర్‌ని కనిపెట్టేందుకు పోలీసులతో పాటు హీరోహీరోయిన్లు చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే సైకో కిల్లర్ ఎవరని తెలిసిన తర్వాత షాక్‌కి గురవుతాం. అలాగే అతను అలా మారడానికి గల కారణం కూడా వాస్తవికంగా ఉంటుంది. సైకో ఎవరనేది చివరివరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్తగా కథనాన్ని నడిపాడు. తొలి సినిమానే అయినా..కొన్ని సీన్లను అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ హత్య సీన్ పెట్టి కథపై ఆస్తకి కలిగించాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్‌తో లవ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలను పెట్టి కథను సాగదీశాడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఫేస్ రివీల్ చేసే సీన్, ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఆపరేషన్ రావణ్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. గత సినిమాలతో పోలిస్తే రక్షిత్ అట్లూరి నటన మరింత మెరుగు పడింది. జర్నలిస్ట్ రామ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్‌ని ఛేజింగ్ చేసే సీన్ సినిమాకే హైలెట్. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమనిగా సంగీర్తన విపిన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి కూడా క్లైమాక్స్‌లో తన నటనతో బయపెడతాడు. రాధికా శరత్ కుమార్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా ఆకట్టుకుంది. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా నాన్నే నాకు అవకాశం ఇచ్చారు: హీరో రక్షిత్ అట్లూరి
తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం చాలా మంది హీరోలకు రాదు. కానీ నాకు ఆ అదృష్టం దక్కింది. నాన్నాగారి( వెంకట సత్య) డైరెక్షన్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనే నాకు అన్నారు హీరో రక్షిత్ అంట్లూరి. వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 26న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రక్షిత్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.కోవిడ్ టైమ్ లో “ఆపరేషన్ రావణ్” మూవీ ఆలోచన మొదలైంది. "పలాస" సినిమా తర్వాత మా సుధాస్ మీడియాలో ఎలాంటి సినిమా చేయాలనే చర్చ మొదలైనప్పుడు ఇప్పుడు యంగ్ జనరేషన్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా థ్రిల్లర్ మూవీ నిర్మిస్తే బాగుంటుందని అనిపించింది.నాన్నగారికి సినిమాల మీద ఉన్న ప్యాషన్ నాకు తెలుసు. పలాస టైమ్ నుంచి ఆయన కథా చర్చల్లో పాల్గొనేవారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఈ మూవీ చేయాలనుకున్నాం. కథ అనుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు కావాల్సినంత టైమ్ దొరికింది. అప్పుడు నేను నరకాసుర, శశివదనే రెండు సినిమాలు చేస్తున్నా. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసేప్పటికి “ఆపరేషన్ రావణ్” కథను బాగా డెవలప్ చేసేంత టైమ్ దొరికింది. పర్పెక్ట్ స్క్రిప్ట్ అయ్యాక సెట్స్ మీదకు వెళ్లాం.షూటింగ్ టైమ్ లో నాన్నగారి డైరెక్షన్ పట్ల నాతో పాటు రాధిక, చరణ్ రాజ్ లాంటి వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లందరినీ సంతృప్తిపరచడం అంత సులువు కాదు. దర్శకుడిగా ప్రతిభ చూపిస్తేనే అది సాధ్యమవుతుంది. రాధిక గారు కూడా మా మూవీకి బాగా సపోర్ట్ చేశారు. సినిమా షూటింగ్ టైమ్ లో నాన్న గారే నన్ను గైడ్ చేసేవారు. నేను ఆయనకు చెప్పేంత అవకాశం ఉండదు. ఆయన అన్నీ తెలుసుకునే దర్శకత్వంలోకి వచ్చారు.ఈ సినిమా ఎక్కువ మంది ఆడియెన్స్ కు రీచ్ చేసేందుకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్ లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో నా చేతుల మీదుగా ఈ కాయిన్ ఇస్తాను. కొందరు చెప్పినట్లు ఊరికే చెప్పడం కాదు. వెయ్యి సిల్వర్ కాయిన్స్ చేయించి పెట్టాం.ఇందులో సందేశం ఏమీ ఉండదు. ఈ సినిమాలో సైకో చిన్నప్పటినుంచి అలా ఉండడు. కొన్ని పరిస్థితుల వల్ల అలా అవుతాడు. మనలో ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటిదాకా ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చేశాం. ఆ సీన్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది.ఆపరేషన్ రావణ్ లాంటి థ్రిల్లర్ సినిమాను థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది. మంచి సౌండ్ ను ఎంజాయ్ చేయగలరు. ఈ సినిమా థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసం చేసిందే. ఈ సినిమాలో నటించేందుకు బాగా కష్టపడ్డానని చెప్పలేను గానీ యాక్షన్ సీక్వెన్సులకు మాత్రం శ్రమించాల్సి వచ్చింది. “ఆపరేషన్ రావణ్” లో ఒక యూనిక్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది.రాధిక గారితో నటించడం మర్చిపోలేని ఎక్సీపిరియన్స్. ఆమె సింగిల్ షాట్ లో ఏ సీనైనా చేసేవారు. అలా చేయలేకపోయినప్పుడు తనే బాధపడేవారు. అప్పుడు ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి నటించిన డిసిప్లిన్ ఆమెలో ఇప్పటికీ ఉంది. సింగిల్ టేక్ లో చేయలేకపోతే బాధపడేవారు. ధనుష్ చాలా మంచి మూవీస్ చేస్తున్నాడని నాతో చెప్పేవారు. సలహాలు, టిప్స్ ఇవ్వడం కాదు గానీ ఆమెతో మాట్లాడటమే ఇన్స్ పైరింగ్ గా ఉండేది. చాలా తక్కువ మాట్లాడుతుంటారు రాధిక గారు.“ఆపరేషన్ రావణ్” సినిమాకు బీజీఎం చాలా ఇంపార్టెంట్. వసంత్ గారు బీజీఎం ఇచ్చారు. మంచి అట్మాస్ థియేటర్ లో మా మూవీ చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. పలాస 2 వర్క్ జరుగుతోంది. తప్పకుండా పలాస 2 ఉంటుంది. -
రిస్క్ చేశారు.. సక్సెస్ కావాలి
‘‘ఆపరేషన్ రావణ్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. వెంకట సత్యగారు వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసమే ‘పలాస 1978’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ రావణ్’తో మరోసారి రిస్క్ చేశారు... ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో అతిథి విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రక్షిత్‌కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇండస్ట్రీలో చివరి చాన్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకో చాన్స్ ఉంటుంది. మనం నమ్మకం వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. నమ్మకంతో ప్రయత్నిస్తుంటే తప్పకుండా విజయం వస్తుంది’’ అన్నారు. ‘‘మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచివాళ్లా? చెడ్డ వాళ్లా? అనేది నిర్ణయిస్తారు. మీరు ఎలా ఉండాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఆ ΄ాయింట్తోనే ‘ఆపరేషన్ రావణ్’ రూ΄÷ందించా’’ అన్నారు వెంకట సత్య. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సెట్లోకి వెళితే నేను యాక్టర్... నాన్న డైరెక్టర్ అంతే. ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులను అల రిస్తుంది. ‘పలాస 2’ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఆ హంతకుడు ఎవడు.. ఆసక్తికరంగా ‘ఆపరేషన్ రావణ్’
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మాస్కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.‘ఈ చదరంగంలో కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క సెగ్మెట్తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటుకి చేరిపోతాయి..’ అని ఓ గంభీరమైన గొంతుతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సిటీలో వరుస హత్యలు జరగడం.. ఆ సీరియల్ కిల్లర్ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం.. హీరో ఛేజింగ్.. రాధికా శరత్‌కుమార్ డిఫరెంట్ లుక్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? దారుణ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆపరేషన్ రావణ్’ మూవీ చూడాల్సిందే. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 2న తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుంది. -
'ఆపరేషన్ రావణ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’ వచ్చేస్తోంది!
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. వెంకట సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వారు వెల్లడించారు.“ఆపరేషన్ రావణ్” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై ఓ సైకో స్టోరీ అనే క్యాప్షన్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సులోని హీరో రక్షిత్ అట్లూరి స్టిల్ తో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.#OperationRaavan RELEASE DATE IS HERE 🥁Earning all your attention,IN THEATRES - AUG 2nd 🥁🔥Get ready to be captivated by 'A Psycho Story" like never before 😈@RakshitAtluri @sangeerthanaluv @lakshmilohith @SripalCholleti @GskMedia_PR @sarva_vasudevan @sudhasmedia pic.twitter.com/TST5ukBg5u— GSK Media (@GskMedia_PR) July 3, 2024 -
గోదావరి నేపథ్యంలో వస్తోన్న లవ్ స్టోరీ.. సాంగ్ రిలీజ్!
పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘శశివదనే. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'గోదారి అటు వైపో' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తూ పాడిన ఈ పాటను కిట్టు విస్సా ప్రగడ రాశారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్ సాంగ్ శశివదనే, డీజే పిల్లా అనే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్గా విడుదలైన టీజర్ ఆడియన్స్ ఊహించని స్పందన వచ్చింది. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. -
గోదావరి నేపథ్యంలో...
‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బర దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అడిగిన మేరకు 19న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం ‘శశివదనే’’ అన్నారు సాయి మోహన్ ఉబ్బర. ‘‘నా ‘పలాస 1978’ కంటే ‘శశివదనే’ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రక్షిత్ అట్లూరి. కోమలీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్ శ్రీపాల్, సినిమాటోగ్రాఫర్ శ్రీసాయి కుమార్ దారా మాట్లాడారు. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ
బాక్సాఫీస్ దగ్గర ఫలితాలెలా ఉన్నా ఓటీటీలో మాత్రం కొన్ని సినిమాలు దూసుకెళ్తున్నాయి. అందుకే థియేటర్లో బోల్తా కొట్టిన చిత్రాలు సైతం ఓటీటీనే నమ్ముకుంటున్నాయి. కనీసం ఇక్కడ క్లిక్ అయినా చాలని గంపెడాశలు పెట్టుకుంటున్నాయి. అందుకే థియేటర్లో రిలీజైన కొద్దిరోజులకే చాలా చిత్రాలు డిజిటల్ ప్లాట్ఫామ్లో దర్శనమిస్తున్నాయి. అయితే నరకాసుర అనే సినిమా మాత్రం చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వస్తోంది. ఇందులో పలాస హీరో రక్షిత్ అట్లూరి శివ అనే లారీ డ్రైవర్‌గా నటించాడు. అపర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించాడు. ట్రాన్స్జెండర్ల గురించి.. చిన్నప్పుడు డైరెక్టర్ తప్పిపోతే.. హిజ్రాలే అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారట. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని ట్రాన్స్‌జెండర్స్‌కు సంబంధించిన ఓ సమస్యను సినిమాలో ప్రస్తావించాడు అకోస్టా. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో తన చేయి కూడా విరగ్గొట్టుకున్నాడు. ఈ ప్రమాదం జరిగిన 27 రోజులకు తిరిగి సెట్స్‌లోకి వచ్చి ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాడు. సడన్‌గా ఓటీటీలోకి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో నవంబర్ 3న నరకాసుర మూవీ రిలీజైంది. ఈ చిత్రం ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే ఫ్రీగా కాకుండా రెంట్(అద్దె) పద్ధతిలో అందుబాటులో ఉంచారు. అంటే ఓటీటీలో నరకాసుర చూడాలంటే రూ.79 చెల్లించాల్సిందే! #Narakasura is now available for RENT in @PrimeVideoIN#Gaami #bhimaa #VishwakSen #SaveTheTigers2 #SSMB29 #gopichand #HanuMan #TrueLover #Kalki2898AD pic.twitter.com/GaPny8maTQ — OTT Updates (@itsott) March 10, 2024 చదవండి: చిరంజీవి కూతురికి స్పెషల్ విషెస్.. ఉపాసన, లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్! -
గ్రామీణ ప్రేమకథ
గ్రామీణ ప్రేమకథగా రూపొం దిన చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరి, కోమలి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అనే డైలాగ్ విడుదలైన పోస్టర్‌పై ఉంది. -
కొత్త స్టోరీతో వస్తోన్న పలాస హీరో.. టీజర్ రిలీజ్!
పలాస 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే అహ్లాదకరమైన ప్రేమకథలా ఉంది. అలాగే హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ సాంగ్ ‘శశివదనే’, ‘డీజే పిల్లా..’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళుతుంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం మందిస్తున్నారు. -
ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూడొచ్చు..‘నరకాసుర’బంపరాఫర్
రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరో హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి స్పందన లభించడంతో.. మరింత మందికి చేరవయ్యేందుకు చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక టికెట్‌పై ఇద్దరు సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత యథావిధిగా ఒక టికెట్‌పై ఒకరు మాత్రమే సినిమా చూడాల్సి ఉంటుంది. ఈ మేరకు తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో మేకర్స్ ఈ విషయాన్ని వెళ్లడించారు. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ.. , ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి అప్రిషియేషన్స్ తో పాటు మీడియా నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. మా సినిమాలో మెసేజ్ మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని మండే నుంచి థర్స్ డే వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నాం’ అన్నారు. ‘ట్రాన్స్ జెండర్స్ ను చిన్న చూపు చూడకూడదు మనుషులంతా ఒక్కటే అని మేము ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. ఇది మరింత మంది ప్రేక్షకులకు చేరేలా వచ్చే సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి థియేటర్ లో ఒక్కో టికెట్ పై ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూడొచ్చు’అని దర్శకుడు సెబాస్టియన్ అన్నారు. -
‘నరకాసుర’మూవీ రివ్యూ
టైటిల్: నరకాసుర నటీనటులు: రక్షిత్, అపర్ణ జనార్థన్, నాజర్, సంగీర్తన, చరణ్ రాజ్, ఎస్.ఎస్.కాంచి, శ్రీమన్, ఫిష్ వెంకట్ తదితరులు నిర్మాత: డా.అజ్జా శ్రీనివాస్ దర్శకత్వం: సెబాస్టియన్ నోవా అకోస్టా సంగీతం:నౌపాల్ రాజా సినిమాటోగ్రఫీ:నాని చామిడి శెట్టి ఎడిటింగ్ : సీ.హెచ్. వంశీ కృష్ణ విడుదల తేది: నవంబర్ 3, 2023 ‘నరకాసుర’కథేటంటే.. చిత్తూరు జిల్లాకు చెందిన శివ(రక్షిత్ అట్లూరి) ఓ కాఫీ ఎస్టెట్‌లో పని చేసే లారీ డ్రైవర్. ఎమ్మెల్యే నాగమ నాయుడు(చరణ్ రాజ్)అంటే అతనికి చాలా ఇష్టం. ఎంతలా అంటే.. నాయుడు గెలుపు కోసం ప్రత్యర్థులను హత్య చేసేంత. అలాంటి శివ ఉన్నట్టుండి కనిపించకుండా పోతాడు. అతని ఆచూకి కోసం పోలీసులు వెతకడం ప్రారంభిస్తారు. అసలు శివ ఎలా తప్పిపోయాడు? అతన్ని బంధించిందెవరు? ఎమ్మెల్యే నాయుడు కుమారుడు ఆది నాయుడు(తేజ చరణ్ రాజ్)తో శివకు ఎందుకు వైరం ఏర్పడింది? తనను ప్రేమించిన మరదలు వీరమణి(సంకీర్తన విపిన్), తను ప్రేమించి పెళ్లి చేసుకున్న మీనాక్షి(అపర్ణ జనార్దన్) కోసం శివ ఏం చేశాడు. ఊరికి మంచి చేసే వ్యక్తిగా ఉన్న శివ ‘నరకాసుర’వథ ఎందుకు చేయాల్సివచ్చింది? ఈ కథలో ట్రాన్స్ జెండర్స్ పోషించిన పాత్రేంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో నరకాసుర సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ మధ్యకాలంలో ఆడియన్స్‌లో మార్పు వచ్చింది. కథ బాగుంటే చాలు.. హీరో హీరోయిన్లు ఎవరనే విషయం పట్టించుకోకుండా థియేటర్స్‌కి వచ్చేస్తున్నారు. అందుకే నూతన దర్శకులు డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ సెబాస్టియన్ కూడా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘నరకాసుర’ను తెరకెక్కించాడు. ఓ కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ తన కథలో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. దాంతోపాటు వివక్షకు గురవుతున్న హిజ్రాలకు సంబంధించిన ఓ మంచి సందేశాన్ని సైతం ఇచ్చాడు. . డెబ్యూ దర్శకుడే అయినా... కథ... కథనం నడిపించడంలో ఎక్కడా తడబడకుండా చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి ఈ కథ కొత్తేదేమి కాదు. ఒక రోటీన్ రివేంజ్ డ్రామా స్టోరీ. ఊరికోసం ఏదైనా చేయగలిగే ఓ వ్యక్తిని నమ్మిన వాళ్లే మోసం చేస్తే.. అతను రాక్షసుడిగా మారి ఎలా రివెంజ్ తీసుకున్నాడనేది ఈ సినిమా కథ. దీనికి హిజ్రాల స్టోరీని యాడ్ చేసి కథనం నడిపించడంతో కాస్త ఢిఫరెంట్‌గా అనిపిస్తుంది. హిజ్రాలతో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. వీటికి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అలాగే పరస్త్రీ వ్యామోహం తగదని... అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పడమే ‘నరకాసుర‘ వథ అనే అంశాన్ని రివేంజ్ డ్రామాగా ఓ సందేశాత్మకంగా తెరరపై చూపించడం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. పలాస చిత్రంలో తనదైన నటనతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి.. మరోసారి తన మాస్ అప్పియరెన్స్‌తో ఆకట్టుకున్నాడు. లారీ డ్రైవర్ శివ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. అతనికి జంటగా మీనాక్షి పాత్రలో నటించిన అపర్ణ జనార్ధన్ తన హోమ్లీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. హీరో మరదలుగా నటించిన సంకీర్తన విపిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. ఆమె కూడా ఓ కీలకమైన మాస్ యాక్షన్ సీక్సెన్స్ తో ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుని పాత్రలో నటించిన చరణ్ రాజ్ పాత్ర పర్వాలేదు. చాలా కాలం తరువాత తెలుగు సినిమాలో కనిపించాడు చరణ్ రాజ్. అతని కుమారునిగా నటించిన తేజ్ చరణ్ రాజు కూడా ఆకట్టుకుంటాడు. శత్రు అండ్ అతని టీమ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టకున్నారు..కాఫీ ఎస్టెట్ సూపర్వైజర్గా నాజర్‌తో పాటు మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాంకేతికపరంగా ఈ సినిమా పర్వాలేదు. నాని చామిడి శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. అడవి లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేయగలిగారు. నౌపాల్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రతి సన్నివేషాన్ని... తనదైన బీజీఎంతో ఎలివేట్ చేయగలిగారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
చేయి పోయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాను
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా.అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సెబాస్టియన్ నోవా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు కావాలనేది నా కల. ఓ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించినా కుదర్లేదు. టెక్నాలజీపై అవగాహన కోసం 2012లో ప్రసాద్ ల్యాబ్‌లో చేరాను. అక్కడ రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కనిపించాయి. దీంతో సినిమా తీయడం కాదు.. తీసిన సినిమాను మార్కెట్ చేసుకోవడం ముఖ్యమని భావించి సాయి కొర్రపాటిగారి సహాయంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో చేరాను. ఆ తర్వాత నా దర్శకత్వంలో సినిమా కోసం కథ రెడీ చేసుకున్నాను. చిన్నతనంలో నేను తప్పిపోతే ట్రాన్స్‌జెండర్స్ నన్ను మా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కథకు ఈ సంఘటన ఓ స్ఫూర్తి. ఇక దర్శకుడిగా తొలి అవకాశమే కష్టం అనుకుంటే.. ‘నరకాసుర’ చిత్రీకరణ టైమ్‌లో ఒరిస్సాలో షూటింగ్ పూర్తి చేసుకుని జబల్పూర్ వెళ్తుంటే ప్రమాదం జరిగి, నా చేయి పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత 27వ రోజు నేను సెట్స్‌లోకి వచ్చి, ఆత్మవిశ్వాసంతో సినిమాను పూర్తి చేశాను. ఇక మాధవన్, అరుణ్ విజయ్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ వంటి స్టార్స్‌తో ట్రైబల్ నేపథ్యంలో ఓ సినిమా ΄్లానింగ్లో ఉంది. మూడు భాషల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. -
షూటింగ్‌కే రెండేళ్లు పట్టింది
‘‘నరకాసుర’ చిత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో శివ అనే లారీ డ్రైవర్ పాత్ర చేశాను. నా గత సినిమా ‘పలాస 1978’లో దళితుల సమస్యలు చూపించినట్లే ‘నరకాసుర’లో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. మా సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా, అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నరకాసుర’. డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘2020లో ‘నరకాసుర’ ్రపారంభించి, ఏడాదిలో పూర్తి చేయాలనుకున్నాం. అయితే రెండు సార్లు కరోనా లాక్డౌన్ రావడం, కథపరంగా ఛత్తీస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో షూటింగ్ చేయడం, ఆర్టిస్టుల డేట్స్, మా డైరెక్టర్ ప్రమాదంలో చేయి కోల్పోవడం... ఇలా పలు కారణాలతో షూటింగ్‌కే రెండున్నరేళ్లు పట్టింది. అయితే కథపై నమ్మకంతో నిర్మాతలు స΄ోర్ట్ చేశారు. ఇక నేను నటించిన ‘శశివదనే’, ‘ఆపరేషన్ రావణ్’ సినిమాలు ΄ోస్ట్ ్ర΄÷డక్షన్ దశలో ఉన్నాయి. మరికొన్ని కథలు వింటున్నాను’’ అన్నారు. -
‘పుష్ప’కథతో ‘నరకాసుర’కు సంబంధమే లేదు: హీరో రక్షిత్ అట్లూరి
‘నరకాసుర’ మూవీ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లోని ఓ కాఫీ ఎస్టేట్ నేపథ్యం సాగుతుంది. అంతేకానీ పుష్ప మూవీతో ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో ఇందులో స్మగ్లింగ్ లాంటివి ఉండవు. పుష్ప కంటే ముందే మా చిత్రం షూటింగ్ మొదలైంది. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యంగా జరిగి.. రెండున్నర ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ మూవీ కచ్చితంగా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’అని యంగ్ హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. ‘పలాస’లాంటి హిట్ మూవీ తర్వాత రక్షిత్ అట్లూరి నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో "నరకాసుర" మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంతో హీరో రక్షిత్ అట్లూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► పలాస సినిమా రిలీజైన తర్వాత 2020లోనే ‘నరకాసుర’ మూవీ స్టార్ట్ చేశాం. ఏడాది సినిమా పూర్తి చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. తర్వాత ఆర్టిస్టులు డేట్స్ కుదరలేదు. ఏడాది అనుకున్న సినిమా షూటింగ్ కే రెండున్నర సంవత్సరాల టైమ్ తీసుకుంది.మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయి చేయి కోల్పోవడం కూడా డిలేకు కారణం అయ్యింది. ►ఈ సినిమాలో నేను లారీ డ్రైవర్ శివ అనే క్యారెక్టర్ లో నటించాను. నాజర్ గారు కాఫీ ఎస్టేట్ సూపర్ వైజర్ క్యారెక్టర్ చేస్తున్నారు. నేను ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ కమ్ పెప్పర్ హార్వెస్టర్ గా కనిపిస్తాను. నా గత సినిమా పలాసలో దళితులకు సంబంధించిన సమస్యలు చూపించినట్లే "నరకాసుర" సినిమాలో హిజ్రాలకు సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకున్నాం. కథలో ఇదొక అంశం మాత్రమే. సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుంది. ఈ ట్రాన్స్ జెండర్స్ అంశం కథలో ఒక సంఘర్షణకు కారణంగా నిలుస్తుంది. ►గత మూడు నెలలుగా ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెల 3వ తేది మా సినిమా రిలీజ్ కు మంచి డేట్ అనుకున్నాం. ఎందుకంటే దసరా సినిమాల సందడి కాస్త తగ్గింది. అలాగే పెద్ద సినిమాలేవీ ఈ వారం రిలీజ్ కావడం లేదు. ►‘నరకాసుర’లో ఒక లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. మధ్యప్రదేశ్ లో 20 రోజుల పాటు ఆ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. అక్కడ చలి ఎక్కువ. పైగా రాత్రి పూట వర్షంలో ఆ ఫైట్ సీన్ చేయాల్సివచ్చింది. అప్పుడు కష్టం అనిపించినా...స్క్రీన్ మీద ఔట్ పుట్ చూశాక హ్యాపీగా ఫీలయ్యాం. ►మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఎందుకంటే పలాస మూవీలో నేను చేసిన యాక్షన్ సీన్స్ చూకున్నప్పుడు ఫైట్స్ బాగా చేశాను అనిపించింది. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పలాస సినిమాలో నాలుగు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా నటించాను అనే పేరొచ్చింది. ఆ పేరు కాపాడుకుంటూ సినిమాలు చేస్తా. పాటలు, పైట్స్ ఉన్న ఫార్మేట్ లో వెళ్లను. ►నరకాసుర సినిమా చేస్తున్నప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి కానీ నేను ఈ గెటప్ వల్ల చేయలేకపోయాను. పొలిమేర 1 కూడా నేనే చేయాల్సింది. అయితే ఆ ప్రాజెక్ట్స్ చేయలేకపోయినందుకు బాధ లేదు. మా సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. నేను నటించిన మరో చిత్రం శశివదనే డిసెంబర్ రిలీజ్ అనుకుంటున్నాం. ప్రస్తుతం కథలు వింటున్నాను. రెండు ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. -
నన్ను తీసేశారా అని భయపడ్డాను
‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. అపర్ణా జనార్ధన్, సంకీర్తనా విపిన్ హీరోయిన్లుగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా. అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం నవంబరు 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ కీ రోల్ చేసిన చరణ్‌రాజ్ బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. ఆకలి బాధలు అనుభవించాను. ఫలితంగా సినీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన 40 ఏళ్ల కెరీర్ లభించింది. వివిధ భాషల్లో ఐదు వందలకు పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశాను. అయితే ‘ప్రతిఘటన, జెంటిల్‌మేన్’ సినిమాలు నన్నొక నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేశాయి. ఇక దర్శకుడు సెబాస్టియన్ నాకు ‘నరకాసుర’ కథ చెప్పినప్పుడు నా పాత్రకు బాగా ఎగ్జయిట్ అయ్యాను. కానీ రెండు నెలలు గడిచినా సెబాస్టియన్గారి నుంచి ఫోన్ రాలేదు. మేం చేస్తే కనెక్ట్ కాలేదు. దీంతో ‘నరకాసుర’లోంచి నన్ను తీసేశారా అనే భయం కలిగింది. కథా రచనలో భాగంగా జబల్పూర్ వెళ్లానని, అందుకే ఫోన్ కలవలేదని, ‘నరకాసుర’లో నాకు చెప్పిన పాత్రను నేనే చేస్తున్నట్లుగా సెబాస్టియన్గారు ఆ తర్వాత చెప్పారు. అప్పుడు రిలాక్స్ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్ర మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ ప్రత్యేక పాత్రను ఈ సినిమాలో చేశాను. ప్రస్తుతం శ్రీహరిగారి అబ్బాయి మేఘాంశ్ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను’’ అని అన్నారు. -
అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది: చరణ్ రాజ్
‘నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ ఉంటే డబ్బు ఇవ్వకున్నా నటిస్తా. ఆ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా మళ్లీ గతంలో జెంటిల్ మేన్ తరహా పోలీస్ క్యారెక్టర్స్ ఇస్తామంటే వద్దని చెప్పాను. అందుకే నాకు తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది’ అని సీనియర్ నటుడు చరణ్ రాజ్ అన్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన టాలీవుడ్లో నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. ‘పలాస" ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ రాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ప్రతిఘటన, జెంటిల్ మేన్ సినిమాలు నన్ను నటుడిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. వివిధ భాషల్లో దాదాపు 600 చిత్రాల్లో నటించాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాల్లో నటించాలనే ప్యాషన్ ఉండేది. 8 ఏళ్లు అర్థాకలితో కష్టపడ్డాను. ఆ కష్టానికి ఫలితంగా 40 ఏళ్ల కెరీర్ దక్కింది. ఈ సుదీర్ఘమైన కెరీర్ లో అనేక రకాల క్యారెక్టర్స్ చేశాను. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ తో విలన్ గా నటించాను. ఇప్పుడు మళ్లీ అలాంటివే నా దగ్గరకు తీసుకొస్తే వద్దని చెబుతున్నాను. నటుడిగా డబ్బు కంటే నాకు సంతృప్తినే కోరుకుంటున్నాను. ►‘నరకాసుర’ కథను డైరెక్టర్ సెబాస్టియన్ చెప్పినప్పుడు ఈ కథ, కథనాల్లోని కొత్తదనం బాగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమాలు వదిలేసే నేను వెంటపడి మరీ ఈ సినిమా చేస్తానని చెప్పాను. డైరెక్టర్ గా ఈ సినిమాను ఒక న్యూ అప్రోచ్ తో తెరకెక్కించారు. ఆడియెన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే మూవీ అవుతుంది. రేపు థియేటర్స్ లో సినిమా చూస్తే ఇది నిజమని అర్థమవుతుంది. ఈ కథ డీటెయిల్స్ చెబితే థియేటర్ లో చూసే ఇంట్రెస్ట్ పోతుంది. ►‘నరకాసుర’ సినిమాలో నేను ఒక పాము లాంటి స్వభావమున్న క్యారెక్టర్ చేశాను. అంటే మంచి వాళ్లతో మంచిగా ఉంటాడు. చెడ్డ వాళ్లతో చెడుగా ఉంటాడు. నా కెరీర్ లో నేను చేసిన ఒక యూనిక్ క్యారెక్టర్ ఇది. నాతో పాటు మా అబ్బాయి కూడా ఈ సినిమాలో నటించాడు. అతనికి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ సెబాస్టియన్. ► గతంలో నేను, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కోట గారు..ఇలా చాలా లిమిటెడ్ విలన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. ఇవాళ హీరో, విలన్ అనేది లేదు. సంజయ్ దత్, జగపతి బాబు, అర్జున్ లాంటి వాళ్లంతా విలన్స్ గా నటిస్తున్నారు. మంచి క్యారెక్టర్ చేయాలి, ప్రేక్షకుల అభిమానం పొందాలి అనేది ఒక్కటే ఇవాళ ప్రతి నటుడికి ఉన్న లక్ష్యం ► తెలుగు సినిమా ఇండస్ట్రీ ది బెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక్కడి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అంటే బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు సినిమా త్వరగా అడాప్ట్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో సినిమాలు నిర్మాణం అవుతున్నాయి. హీరోలకు వంద, నూటా యాభై కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. గతంలో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, టి కృష్ణ గారు వంటి దర్శకులు వేసినా బాటలో టాలీవుడ్ యంగ్ జెనరేషన్ పయణిస్తోంది. -
కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా 'నరకాసుర' సాంగ్ రిలీజ్
'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా 'నరకాసుర'. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) తాజాగా 'నరకాసుర' నుంచి 'గ్రీవము యందున' అనే లిరికల్ పాటని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశాడు. పాట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. పరమ శివుడిని ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. శివభక్తుల గెటప్స్‌లో ఆధ్యాత్మిక భావన కలిగించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాట, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ భావిస్తున్నారు. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) -
సెప్టెంబర్‌లో ‘నరకాసుర’
రక్షిత్ అట్లూరి, అపర్ణా జనార్థన్, సంకీర్తన విపిన్, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్లో ఉందని’ ప్రశంసించారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారంలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.’ అని దర్శకుడు అన్నారు.సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. -
చందమామ కథలోన..
రక్షిత్ అట్లూరి, సంకీర్తన విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘చందమామ కథలోన..’ పాట లిరికల్ వీడియోను దర్శకుడు కె. రాఘవేంద్ర రావు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘చందమామ కథలోన.. అందమైన పిల్లేనా.. కళ్ల ముందు వాలిందా.. తుళ్లి తుళ్లి పడ్డాన..’ అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా హరి చరణ్, గీతా మాధురి పాడారు. శరవణ వాసుదేవన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి. -
హీరో రక్షిత్ బర్త్‌డే.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
"పలాస 1978" చిత్రంతో ప్రతిభ గల యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రక్షిత్ అట్లూరి. మరో వైవిధ్యమైన కథాంశంతో ఆయన చేస్తున్న కొత్త చిత్రం ''ఆపరేషన్ రావణ్''. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. ఈ న్యూ ఏజ్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సోమవారం హీరో రక్షిత్ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్షిత్ పరుగెత్తుతున్న డిజైన్ తో ఉన్న ఈ పోస్టర్ పై 'మీ ఆలోచనలే మీ శత్రువులు' అనే క్యాప్షన్ రాశారు. యాక్షన్, థ్రిల్లర్ ట్రెండ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ''ఆపరేషన్ రావణ్'' ఆసక్తిని కలిగిస్తోంది. తుది హంగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: అనాధాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్ మాస్టర్ -
పలాసకి మించి ఆపరేషన్ రావణ్
‘‘పలాస’ నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి’ అంటూ గతంలో చెప్పాను. ఇప్పుడు అంతకు మించిన నమ్మకంతో చెబుతున్నాను. ‘పలాస’కి మించి ‘ఆపరేషన్ రావణ్’ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. మా నాన్న వెంకట సత్య వరప్రసాద్‌గారు బాగా డైరెక్ట్ చేశారు’’ అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. వెంకట సత్య దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ జంటగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ మూవీ ఫస్ట్ థ్రిల్‌ను దర్శకులు మారుతి, కల్యాణ్ కృష్ణ విడుదల చేశారు. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ప్రసాద్‌గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. కానీ ట్రైలర్ చూశాక చాలా బాగుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా బాగా రావడానికి కారణం రాధికగారు’’ అన్నారు వెంకట్ సత్య. ‘‘ఆపరేషన్ రావణ్’ మంచి చిత్రం’’ అన్నారు నటి రాధిక. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి. -
పలాస తర్వాత గ్యాప్ రావడంతో హేళన చేశారు: యంగ్ హీరో
"ఒక టీజర్ ఇంపాక్ట్ ఏంటో 'పలాస' సినిమా టైమ్‌లో చూశాను. ఆ మూవీ తర్వాత నాకు గ్యాప్ రావడంతో అందరూ హేళనగా మాట్లాడారు. అలాంటివారికి సమాధానమే నరకాసుర అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. సెబాస్టియన్ దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా.. అపర్ణ జనార్జన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం నరకాసుర. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన దర్శక-నిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ రక్షిత్‌ను కలిసినప్పుడు యంగ్ డేస్‌లో జగపతి బాబు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడనిపించింది. 'నరకాసుర' అతన్ని మంచి స్థాయికి తీసుకువెళుతుంది" అన్నారు. "నరకాసుర టీజర్ చూస్తే 'కాంతారా రేంజ్లో ఉందనిస్తోంది" అన్నారు కెమెరామేన్ సెంథిల్ కుమార్. "తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో మా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నాం" అన్నారు అజ్జా శ్రీనివాస్. "ఈ చిత్రంతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాం అన్నారు సెబాస్టియన్, ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర ప్రసాద్, అవర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం ఏఐఎస్ నాఫాల్ రాజా. చదవండి: కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్