హీరో రక్షిత్‌ బర్త్‌డే.. స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ | Rakshith Atluri Birthday Special Operation Ravan Poster Released | Sakshi
Sakshi News home page

Rakshith Atluri: హీరో బర్త్‌డే స్పెషల్‌.. ఆపరేషన్‌ రావణ్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Published Sun, Jun 18 2023 8:49 PM | Last Updated on Sun, Jun 18 2023 8:49 PM

Rakshith Atluri Birthday Special Operation Ravan Poster Released - Sakshi

"పలాస 1978" చిత్రంతో ప్రతిభ గల యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రక్షిత్ అట్లూరి. మరో వైవిధ్యమైన కథాంశంతో ఆయన చేస్తున్న కొత్త చిత్రం ''ఆపరేషన్‌ రావణ్‌''. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాస్‌ మీడియా బ్యానర్‌ మీద ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. ఈ న్యూ ఏజ్‌ యాక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు.

సోమవారం హీరో రక్షిత్ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్షిత్ పరుగెత్తుతున్న డిజైన్ తో ఉన్న ఈ పోస్టర్ పై 'మీ ఆలోచనలే మీ శత్రువులు' అనే క్యాప్షన్ రాశారు. యాక్షన్, థ్రిల్లర్ ట్రెండ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ''ఆపరేషన్‌ రావణ్‌'' ఆసక్తిని కలిగిస్తోంది. తుది హంగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.

చదవండి: అనాధాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్‌ మాస్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement