కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా 'నరకాసుర' సాంగ్ రిలీజ్ | Narakasura Movie Greevamu Yandhuna Song Kiran Abbavaram | Sakshi

కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా 'నరకాసుర' సాంగ్ రిలీజ్

Oct 21 2023 8:57 PM | Updated on Oct 21 2023 9:16 PM

Narakasura Movie Greevamu Yandhuna Song Kiran Abbavaram - Sakshi

'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా 'నరకాసుర'. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్‌లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

(ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి)

తాజాగా 'నరకాసుర' నుంచి 'గ్రీవము యందున' అనే లిరికల్ పాటని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశాడు. పాట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. పరమ శివుడిని ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. శివభక్తుల గెటప్స్‌లో ఆధ్యాత్మిక భావన కలిగించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాట, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ భావిస్తున్నారు.

(ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement