"ఒక టీజర్ ఇంపాక్ట్ ఏంటో 'పలాస' సినిమా టైమ్‌లో చూశాను. ఆ మూవీ తర్వాత నాకు గ్యాప్ రావడంతో అందరూ హేళనగా మాట్లాడారు. అలాంటివారికి సమాధానమే నరకాసుర అని హీరో రక్షిత్ అట్లూరి అన్నారు. సెబాస్టియన్ దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి హీరోగా.. అపర్ణ జనార్జన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం నరకాసుర. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిల్మ్ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
ముఖ్య అతిథిగా హాజరైన దర్శక-నిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ రక్షిత్‌ను కలిసినప్పుడు యంగ్ డేస్‌లో జగపతి బాబు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడనిపించింది. 'నరకాసుర' అతన్ని మంచి స్థాయికి తీసుకువెళుతుంది" అన్నారు. "నరకాసుర టీజర్ చూస్తే 'కాంతారా రేంజ్‌లో ఉందనిస్తోంది" అన్నారు కెమెరామేన్ సెంథిల్ కుమార్. "తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో మా చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నాం" అన్నారు అజ్జా శ్రీనివాస్. "ఈ చిత్రంతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాం అన్నారు సెబాస్టియన్, ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర ప్రసాద్, అవర్ణ జనార్ధన్, సంకీర్తన విపిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం ఏఐఎస్ నాఫాల్ రాజా.
Comments
Please login to add a commentAdd a comment