
నానీ(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. యునానిమస్ ప్రోడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. కాగా ఈ నెల 24న నానీ పుట్టినరోజు.
ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు నానీ.
‘హిట్’ సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం గ్లింప్స్, పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), లైన్‌ప్రోడ్యూసర్: అభిలాష్ మాంధదపు.
Comments
Please login to add a commentAdd a comment