రైటర్‌ నాని? | Nani In Hit 3 As Brutal Police Officer Arujun Sarkar | Sakshi
Sakshi News home page

రైటర్‌ నాని?

Published Sat, Jul 27 2024 2:59 AM | Last Updated on Sat, Jul 27 2024 2:59 AM

Nani In Hit 3 As Brutal Police Officer Arujun Sarkar

హీరో నాని రైటర్‌గా మారనున్నారా? అంటే అవుననే మాట ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తన నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై దర్శకుడు శైలేష్‌ కొలనుతో ‘హిట్, హిట్‌ 2’ సినిమాలను నిర్మించారు నాని. ఈ రెండు చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ‘హిట్‌ 2’ సినిమా చివర్లో ‘హిట్‌ 3’లో నాని హీరోగా పోలీసాఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌పాత్రలో నటించనున్నట్లుగా మేకర్స్‌ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాదిలోనే ‘హిట్‌ 3’ చిత్రీకరణప్రారంభం కానుందట.

‘హిట్, హిట్‌ 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలనే ‘హిట్‌ 3’ని తెరకెక్కించనున్నారు. కానీ ఈ సినిమాకు నాని కథ–స్క్రీన్‌ప్లే అందించనున్నారని భోగట్టా. మరి.. ఈ సినిమాతో నాని రైటర్‌గా మారతారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. మరోవైపు నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్టు 29న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకా ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలతో నాని మరో సినిమా కమిటైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement