Shailesh
-
రైటర్ నాని?
హీరో నాని రైటర్‌గా మారనున్నారా? అంటే అవుననే మాట ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై దర్శకుడు శైలేష్ కొలనుతో ‘హిట్, హిట్ 2’ సినిమాలను నిర్మించారు నాని. ఈ రెండు చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ‘హిట్ 2’ సినిమా చివర్లో ‘హిట్ 3’లో నాని హీరోగా పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాదిలోనే ‘హిట్ 3’ చిత్రీకరణప్రారంభం కానుందట.‘హిట్, హిట్ 2’ సినిమాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలనే ‘హిట్ 3’ని తెరకెక్కించనున్నారు. కానీ ఈ సినిమాకు నాని కథ–స్క్రీన్‌ప్లే అందించనున్నారని భోగట్టా. మరి.. ఈ సినిమాతో నాని రైటర్‌గా మారతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఆగస్టు 29న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకా ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. -
జీవితం అనేది యుద్ధం
సూర్య అయ్యల సోమయాజుల హీరోగా, మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ర్యాపిడ్ యాక్షన్ మిషన్’. ఇందులో ధన్యా బాలకృష్ణ హీరోయిన్. దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ శైలేష్ కొలను విడుదల చేశారు. ‘జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ‘ఈ 60 ఏళ్ల స్వాతంత్య్రం ప్రజలది కాదు... అధికారులది కాదు... రాజకీయ నాయకులది మాత్రమే... మీరు అప్పుడూ బానిసలే... ఇప్పుడూ బానిసలే... ఎప్పుడూ బానిసలే’ అంటూ ‘శుభలేఖ’ సుధాకర్ చెప్పిన డైలాగ్ కూడా ఉంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
పట్టణంలో వినోదం
సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘కేబుల్ రెడ్డి’. శ్రీధర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీధర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి, స్క్రిప్ట్‌ని మేకర్స్‌కు అందించారు. అనంతరం సుహాస్ మాట్లాడుతూ– ‘‘రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక టౌన్లో జరిగే క్లీన్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. ‘‘బౌండెడ్ స్క్రిప్ట్‌తో షూట్‌కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్‌ను 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగల. -
రిమ్జిమ్ గిరే సావన్.. ఒక జంట.. ఒక వాన.. ఒక పాట..
వానొస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? కిటికీలో నుంచి చూస్తారు. బయటకెళ్లకండి అని భార్య అంటుంది. టీ పెట్టమని భర్త అంటాడు. కాని ముంబైకి చెందిన శైలేష్, వందన అనే భార్యాభర్తలు మాత్రం ముంబై రోడ్ల మీద తడవడానికి బయలుదేరారు. ఒకప్పటి‘మంజిల్’ సినిమాలో ‘రిమ్జిమ్ గిరే సావన్’ హిట్ పాటలో ఎలాగైతే అమితాబ్, మౌసమీ చటర్జీ తడుస్తూ తిరిగారో అచ్చు అలాగే తిరిగారు. పాటను షూట్ చేసి వదిలితే వైరలే వైరలు. ఒక జంట. ఒక వాన. ఒక పాట. గతం మళ్లీ వర్తమానం అయ్యింది. నిజ పాత్రలు నటీనటులు అయ్యారు. ముంబై నగర వీధుల్లో ఒక సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. చూసిన ప్రేక్షకులు మురిసిపోయారు. ఆనంద్ మహీంద్ర అంతటి వాడు ట్వీట్ చేసి మెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ లక్షల మంది వీక్షించారు. ఇంతకూ ఏమిటది? రిమ్జిమ్ గిరె సావన్ పాట. రీమేక్ పాట. మంజిల్ సినిమా నుంచి అమితాబ్, మౌసమీ చటర్జీ నటించిన ‘మంజిల్’ (1979) సినిమాకు దర్శకుడు బాసూ చటర్జీ. సినిమా ఓ మోస్తరుగా ఆడినా ‘రిమ్జిమ్ గిరె సావన్’ పాట పెద్ద హిట్. కిశోర్ కుమార్ వెర్షన్, లతా వెర్షన్ ఉంటాయి. లతా వెర్షన్‌ను బాసూ చటర్జీ నిజమైన వర్షంలో తీయాలనుకున్నాడు. ముంబైలో వాన కురుస్తున్న రోజు ఒక చిన్న యూనిట్‌ను పెట్టుకుని సూట్లో ఉన్న అమితాబ్‌ను, చీరలో ఉన్న మౌసమీ చటర్జీని రోడ్ల మీద నడిపిస్తూ పిక్చరైజ్ చేశాడు. ఈ పాట పెద్ద హిట్. సేమ్ ఇదే పాటను ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ అభినయించింది. వారి పేర్లు శైలేష్, వందన ముంబైలోని థానేలో నివసించే శైలేష్, వందనలకు పెళ్లయ్యి 26 ఏళ్లు. ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ, ఇష్టం. ఈ ఇష్టం ఒక వానరోజున రికార్డు చేద్దామని, అదీ రిమ్జిమ్ గిరే సావన్ పాటలా ఉండాలని శైలేష్ కోరిక. భార్య దగ్గర ఎప్పుడు ప్రస్తావన తెచ్చినా ఆమె సిగ్గుతో ‘నేను చేయనండీ’ అనేది. శైలేష్ పట్టు వీడక ఈ సంగతి తన స్నేహితుడు అనుప్ రింగాన్గవాకర్కు చెప్పాడు. అనుప్ భార్య అంకిత ఇది విని ఉత్సాహపడింది. వాళ్లిద్దరినీ మనిద్దరం వానలో షూట్ చేద్దాం అని చెప్పింది. ఇంకేముంది శైలేష్ అచ్చు మంజిల్ సినిమాలోని సూట్ లాంటిది కుట్టించుకున్నాడు. వందన అలాంటి చీరలోనే నిరాడంబరంగా తయారైంది. మొన్న మొదలైన వానల్లో ఒకరోజు మొత్తం పాటను సేమ్ అవే లొకేషన్లలో తీశారు. పెద్ద హిట్ పాత పాట ఎంత హిట్టో ఈ పాట అంతే హిట్ అయ్యింది. ‘మేము ఇంత రెస్పాన్స్ ఊహించలేదు’ అని శైలేష్ అన్నాడు. ‘మా లొకాలిటీలో మేము సెలబ్రిటీలం అయిపోయాం’ అని చెప్పాడు. దేశవిదేశాల్లో ఈ వీడియోకు ఆదరణ లభించింది. ‘మనసుండాలి గాని ప్రతి సందర్భాన్ని ఆనందమయం చేసుకోవచ్చు’ అని చాలా మంది మెచ్చుకున్నారు. ఈ జంటను చాలామంది డిన్నర్‌కు పిలుస్తున్నారు. అన్నట్టు ‘మంజిల్’ కోసం ఈ పాటను నిజమైన వానలో తీసేప్పుడు అమితాబ్ నడకను అందుకోవడానికి మౌసమీ చటర్జీ పరుగులు తీయాల్సి వచ్చేది. అమితాబ్ కాళ్లు పొడవు కదా. ‘చాలాసార్లు ఆయన మెల్లగా నడిచి బేలెన్స్ చేసేవాడు. షూటింగ్ కోసం చాలాసేపు చీర నానడం వల్ల ఇంటికొచ్చాక దాని రంగు నా ఒంటి మీద అంటుకుపోయింది. వానలో పాట మాకు ఏమీ వినిపించేది కాదు. దూరం నుంచి డైరెక్టర్ కర్చీఫ్ ఆడిస్తే యాక్షన్ అని, మళ్లీ ఆడిస్తే కట్ అని భావించే నటించాం’ అని మౌసమీ చటర్జీ గుర్తు చేసుకుంది. వానలు మనకు అంతగా పడట్లేదు. పడినప్పుడు ఈ పాట చూడండి. -
కార్ల అమ్మకాల వృద్ధి 7 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ: డిమాండ్ మందగించిన కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగం విక్రయాల వృద్ధి 5–7 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికల్స్) శైలేష్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీపరంగా సీఎన్జీ, ఎలక్ట్రిక్ మోడల్స్‌తో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న వాహనాలను సరికొత్తగా తీర్చిదిద్దడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. కోవిడ్‌పరమైన పరిణామాలతో డిమాండ్ భారీగా పేరుకుపోవడంతో గత ఆర్థిక సంవత్సరంలో పీవీల అమ్మకాలు 27 శాతం వృద్ధి నమోదు చేశాయి. కానీ ప్రస్తుతం కొన్ని స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు తప్ప మిగతావాటికి డిమాండ్ తగ్గిందని చంద్ర పేర్కొన్నారు. కొత్త ఉద్గార ప్రమాణాలకు మారే క్రమంలో వాహనాల రేట్ల పెరుగుదల కూడా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన చెప్పారు. అయితే, రాబోయే రోజుల్లో వృద్ధి తిరిగి రెండంకెల స్థాయికి చేరగలదని ఆయన వివరించారు. తమ సంస్థ విషయానికొస్తే పంచ్‌లో సీఎన్జీ వేరియంట్‌ను తేబోతున్నామని .. కర్వ్, సియెరా వంటి వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చంద్ర చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరగబోతున్నాయని పేర్కొన్నారు. టాటా మోటర్స్ ఈ మధ్యే తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో సీఎన్జీ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో డీలర్లకు రికార్డు స్థాయిలో 5.4 లక్షల వాహనాలను సరఫరా చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే హోల్‌సేల్ అమ్మకాలు 45 శాతం పెరిగాయి. -
యాక్షన్ ఎంటర్టైనర్గా 'సైంధవ్'.. తొలి షెడ్యూల్ పూర్తి
వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సైంధవ్’. ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఈ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు వెంకటేశ్ పాల్గొనగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ మంగళవారం వెల్లడించింది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ను కూడా వేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగుకి పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్. మణికందన్, సహనిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
క్రిస్మస్ కానుక
హీరో వెంకటేశ్ సినీ అభిమానులకు, ప్రేక్షకులకు క్రిస్మస్ కానుక ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘సైంధవ్’ ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, వెంకటేశ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇటీవల మొదలైన ఈ లాంగ్ షెడ్యూల్లో వెంకటేశ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. నవాజుద్దీన్ సిద్ధిఖి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, కెమెరా:ఎస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం. -
Shailesh Modak: సాఫ్ట్వేర్ జాబ్ వదిలి లక్షల్లో సంపాదిస్తున్నాడు.. ఇలా!
జీవితంలో ఎదగాలంటే ఏదో ఒక పని చేయాలి, చేస్తూనే ఉండాలి. అయితే కొంతమంది కొన్ని సందర్భాల్లో తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలి స్వయం ఉపాధి (వ్యవసాయ రంగంలో) ప్రారంభిస్తున్నారు. అలా ప్రారంభించి విజయం పొందినవారి జాబితాలో 'శైలేష్ మోదక్' ఒకరు. ఇంతకీ ఇతడు ఏ ఉద్యోగం చేసాడు, ఎందుకు వదిలేసాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. పూణేకి చెందిన శైలేష్ మోదక్ ఒక కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదించేవాడు. అయితే ఉద్యోగం వదిలి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాడు. హైడ్రోపోనిక్స్, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమతో కొత్త ప్రయోగాలను చేయడం మొదలుపెట్టాడు. ప్రారంభంలో ఉద్యోగం చేస్తూనే తన కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే పరాగసంపర్కం కోసం తేనెటీగలు అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టినప్పటికీ తన ఆలోచన ఫలించలేదు. తరువాత వ్యవసాయం గురించి బాగా తెలుసుకుని 2016లో ఉద్యోగం వదిలి పూర్తి సమయం వ్యాపారానికే కేటాయించాడు. (ఇదీ చదవండి: Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!) తరువాత అతి కాలంలోనే ఖరీదైన 'కుంకుమ పువ్వు' సాగుచేయాలని దానికి కావలసిన సన్నాహాలు సిద్ధం చేసుకున్నాడు. క్రమంగా ఈ రోజు షిప్పింగ్ కంటైనర్లలో కుంకుమ పువ్వు పండించి లక్షలు సంపాదించగలిగాడు. కంటైనర్‌లో పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేయడానికి అతను వివిధ హైటెక్ పరికరాలను ఉపయోగించడమే కాకుండా, కాశ్మీర్‌లోని పాంపోర్ నుంచి సేకరించిన ప్రీమియం క్రోకస్ కార్మ్స్/బల్బుల సహాయంతో కుంకుమపువ్వు పండిస్తూ మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. -
'హిట్' సిరీస్‌లో వెంకటేశ్? త్వరలోనే సెట్స్‌పైకి మూవీ
హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ హిట్ సిరీస్ థర్డ్ పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేసు’ చిత్రంలో నాని హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తారు నాని. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. అయితే హిట్ ఫ్రాంచైజీలో ఓ హీరోగా వెంకటేశ్ నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. వెంకటేశ్‌కు శైలేష్ కొలను ఇటీవల ఓ కథ వినిపించారనే వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కథ ‘హిట్’ సిరీస్‌లోనిదే అని సమాచారం. ‘హిట్ 2’ ఎండింగ్లో నాని వచ్చి, ‘హిట్ 3’లో హీరోగా నటిస్తున్నారు. అలా ‘హిట్ 3’ ఎండింగ్లో వచ్చి, ‘హిట్ 4’లో హీరోగా నటిస్తారట వెంకటేశ్. -
ఈవీ రంగంలో దూకుడు పెంచిన టాటా మోటార్స్.. ఇక వచ్చే ఐదు ఏళ్లలో!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ రానున్న 5 ఏళ్లలో ఈవీ రంగంలో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నెక్సాన్ వంటి ఎలక్ట్రిక్ కార్లతో ఈవీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ మరో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. "భవిష్యత్తు మార్కెట్ డిమాండ్'కు అనుగుణంగా రాబోయే ఐదు సంవత్సరాలలో మేము ఈవీ రంగంలో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం. బాడీ స్టైల్స్, ధర, డ్రైవింగ్ రేంజ్ వంటి వివిధ రకాల 10 ఈవీలను అభివృద్ది చేస్తున్నాం" అని చంద్ర తెలిపారు. ప్రైవేట్ ఈక్విటీ మేజర్ టీపీజీ నుంచి టాటా మోటార్స్ 1 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. దీంతో, టాటా ఈవీ వ్యాపారం వీలువ 9.1 బిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఔరంగాబాద్ మిషన్ ఫర్ గ్రీన్ మొబిలిటీ(ఏఎంజీఎమ్)లో భాగంగా నగర వాసులకు 101 ఎలక్ట్రిక్ కార్లను శైలేష్ చంద్ర అందించారు. ఇక మహారాష్ట్రలో టాటా మోటార్స్ దాదాపు 400 ఛార్జింగ్ స్టేషన్ల నెట్ వర్క్ కలిగి ఉంది. వీటిలో 15-20 ఔరంగాబాద్ నగరంలో ఉన్నాయి, వాటిని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టాటా మోటార్స్ ఇప్పటి వరకు 22,000 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిందని అని అన్నారు. (చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా పడిపోతున్న ధరలు..!) -
వందతో ఆగకూడదు
శైలేష్, ఏఇషా ఆదరహ జంటగా శైలేష్ సాగర్ దర్శక త్వంలో రామసత్యనారాయణ నిర్మించిన 98వ చిత్రం ‘శివ 143’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ టీజీ వెంకటేష్ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ సెంచురీకి చేరువలో ఉన్నారు. వంద సినిమాలతో ఆపకుండా ఆయన మరెన్నో సినిమాలు నిర్మించాలి. ‘శివ 143’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ బోర్డ్‌వారు సినిమాని చూడకపోవడంతో కుదరలేదు. అందుకే ఫిబ్రవరికి వాయిదా వేశాం. ఈ చిత్రానికి ముందు మేం నిర్మించిన ‘పోలీస్ పటాస్’ ట్రైలర్‌ని వెంకటేష్‌గారి చేతుల మీదగా విడుదల చేయించాం. ఆ సినిమాను విజయవంతంగా విడుదల చేశాం. అలానే ఈ సినిమాని కూడా ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ. -
రెండు హృదయాల ప్రయాణం
శైలేష్, ఏయిషా అదరహా జంటగా నటించిన చిత్రం ‘శివ 143’. ది జర్నీ ఆఫ్ టు హార్ట్స్ ట్యాగ్‌లైన్. రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో హీరోగా నటించి, దర్శకత్వం వహించారు శైలేష్. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలు నిర్మించటంలో రామ సత్యనారాయణది అందె వేసిన చేయి. సినిమాను ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు’’ అన్నారు. ‘‘వినాయక్‌గారు విడుదల చేసిన మా ‘రహస్యం’ చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు ఆయన ట్రైలర్ విడుదల చేసిన మా ‘శివ 143’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు రామసత్యనారాయణ . ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు రామసత్యనారాయణ గారికి థ్యాంక్స్. జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు హీరో, దర్శకుడు శైలేష్. -
పోలీసులపైకి ‘రివర్స్’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాది శైలేష్ సక్సేనా పోలీసులపై తప్పుడు రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వారికి తలనొప్పిగా మారారు. హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం పోలీసులు, దర్యాప్తు అధికారి ఏసీపీ విజయ్‌కుమార్‌తో పాటు డీసీపీ అవినాష్ మహంతి తదితరులపై వరుసపెట్టి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో శైలేష్ దాఖలు చేసిన మూడింటితో కలిపి మొత్తం 60 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం సీసీఎస్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీపక్‌రెడ్డితో పాటు న్యాయవాదులు శైలేష్ సక్సేనా, సంజయ్ సక్సేనా తదితరులు భోజగుట్టతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉన్న 4 ఖరీదైన స్థలాలపై కన్నేశారు. బోగస్ డాక్యుమెంట్లు, నకిలీ యజమానులను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ రూ.వందల కోట్ల విలువైన స్థలాలను కొట్టేసేందుకు భారీ కుట్రలే పన్నారు. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో పరిచయం చేస్తూ పలు స్థలాలపై జీపీఏలు, సేల్డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారంపై నమోదైన ఆరు కేసులను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేశారు. దీపక్‌రెడ్డితో పాటు శైలేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ పథకమే.. అప్పట్లో బాధితులుగా ఉండి, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిపై శైలేష్ ప్రైవేట్ కేసులు నమోదు చేశారు. వారంతా ఉద్దేశపూర్వకంగా తనపై ఫిర్యాదులు చేశారని, రాజకీయ కారణాలతోనే సీసీఎస్ అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. సివిల్ వివాదాల్లో సీసీఎస్ పోలీసులు తలదూర్చి తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. శైలేష్ సక్సేనా దాఖలు చేసే రిట్ పిటిషన్లలో అధికంగా అధికారుల పేర్లతోనే వేస్తున్నారు. దీంతో అధికారులే సొంతంగా లాయర్లను ఏర్పాటు చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. -
క్యాసినో పెట్టుబడులే కొంపముంచాయి!
సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ప్రధాన నిందితుడు శైలేశ్ గుజ్జర్ విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాలో కేసినోల ఏర్పాటులో తొందరపాటు నిర్ణయం భారీ నష్టాలను మిగిల్చింది. రిషబ్ కేసులో నిందితులుగా ఉన్న శైలేశ్ కుమార్ గుజ్జర్, అతడి భార్య నందిని గుజ్జర్లను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత చంచల్గూడలోని జైలుకు తరలించారు. క్యాసినోలకు రూ.30 కోట్లు.. శైలేశ్ స్నేహితుడైన సురేశ్ కుమార్ గోవాలో క్యాసినో లు నిర్వహిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు. తాను కూడా ఆ వ్యాపారంలోకి దిగాలని శైలేశ్ భావించాడు. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం రిషబ్ సంస్థలో ఉన్న చిట్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము వాడేశాడు. క్యాసినోల అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగిస్తూ.. అక్కడి నోవాటెల్ హోటల్, ఓ బీచ్ రిసార్ట్‌లో క్యాసినోల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశాడు. అద్దెలు, లీజుల కోసం భారీ మొత్తంలో చెల్లించడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి వాటికి ఆధునీకరణ చేయించాడు. అయితే హఠాత్తుగా గోవా ప్రభుత్వం క్యాసినోల లైసెన్స్ ఫీజును రూ.6 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచేసింది. అయితే శైలేశ్ అప్పటికే క్యాసినోలు సిద్ధం చేయడానికి రూ.30 కోట్లు వెచ్చించడంతో ఇంత భారీ మొత్తం మళ్లీ సమీకరించలేకపోయాడు. నోట్ల రద్దు వేళ భారీ పెట్టుబడులు.. అదే సమయంలో హైదరాబాద్‌లోని రెండు పబ్బుల్లో రూ.10 కోట్లు పెట్టి శైలేశ్ భాగస్వామిగా చేరాడు. ఇవీ ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వకపోవడంతో అన్ని దారులూ మూసుకుపోయాయి. అలావాడిన సొమ్ము డిపాజిట్దారులదే కావడంతో రికవరీలకు ప్రయత్నాలు చేయాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసుల లెక్కల ప్రకారం ఈ స్కాం విలువ రూ.70 కోట్లకు మించట్లేదు. 2016 నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు అమల్లోకి వచ్చాక డిపాజిట్లు భారీగా పెరిగినట్లు గుర్తించారు. అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను నగదు రూపంలో పెట్టుబడులుగా పెట్టినట్లు తేల్చారు. వీరికి శైలేశ్ ప్రామిసరీ నోట్లు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. నగదు లావాదేవీలే అత్యధికం.. శైలేశ్ నిర్వహించిన రిషబ్ చిట్‌ఫండ్స్ సంస్థ రూ.కోట్లలో లావాదేవీలు చేసింది. వారి బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించిన పోలీసులు.. వాటిలో ఆ స్థాయిలో లావాదేవీలు లేనట్లు గుర్తించారు. గడిచిన కొన్నాళ్లుగా శైలేశ్ నగదు లావాదేవీలే చేశాడని, ఆన్లైన్ లేదా చెక్కుల ద్వారా సాగించలేదని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయాన్నీ ఐటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిషబ్ సంస్థలో చిట్టీలు పాడుకున్న వారికి రూ.2 వడ్డీ ఇస్తానంటూ శైలేశ్ ఆ మొత్తాలను డిపాజిట్లుగా పెట్టుకున్నాడు. అయితే ఓ దశలో ఇతగాడు ఫైనాన్షియర్ల నుంచి రూ.6 వడ్డీకి నగదు తీసుకువచ్చి రోటేషన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇలా భారీ మొత్తం వడ్డీ రూపంలో తీసుకున్న వ్యాపారులనూ పోలీసులు విచారించనున్నారు. రిషబ్ సంస్థలో పని చేస్తున్న పాత ఉద్యోగుల పేర్లతోనూ శైలేశ్ నిధుల మళ్లింపులకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
కంటెంట్ ఉంటేనే ఆదరణ
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘రహస్యం’. శైలేష్, శ్రీ రితిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ శైలేష్ దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ హైదారాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య పాల్గొన్నారు. సినీ ప్రముఖులు సి.కళ్యాణ్, శివశక్తి దత్తా, రాజ్ కందుకూరి, మానస్, శివశంకర్ మాస్టార్ తదితరులు పాల్గొన్నారు. రోశయ్య మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ వంద చిత్రాలకు చేరువయ్యాడు. సినిమా తీయటంతో పాటు వైవిధ్యంగా ప్రమోట్ చేస్తాడు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. చిన్న చిత్రాల ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలి’’ అన్నారు. ‘‘రామానాయుడు తర్వాత వంద చిత్రాలను నిర్మించిన వ్యక్తి రామసత్యనారాయణ. ‘రహస్యం’ చిత్రంతో తను లాభాలు చూడాలి’’ అన్నారు సి. కల్యాణ్. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘కంటెంట్ బావుంటేనే ఈ రోజు ఎంతటి స్టార్ సినిమా అయినా ఆడుతోంది. లేకుంటే తిరస్కరిస్తున్నారు. మాది కంటెంట్ ఉన్న సినిమా’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు శైలేష్. -
హైకోర్టు న్యాయవాది శైలేష్ సక్సేనా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని విలువైన భూములపై కన్నేసి, తప్పుడు పత్రాలతో కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి భాగస్వామి, న్యాయవాది శైలేష్ సక్సేనా మరోసారి అరెస్టు అయ్యారు. కొన్ని నెలలుగా పరారీలో ఉన్న ఈయనను నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు పట్టుకున్నారు. హైకోర్టులో రిట్ పిటిషన్లకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడంపై రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఇతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఇప్పటికే భూ కబ్జా కేసుల్లో దీపక్‌రెడ్డితో పాటు శైలే‹ష్‌ను గతేడాది సీసీఎస్ పోలీసులే అరెస్టు చేసిన విషయం విదితమే. గుడిమల్కాపూర్, భోజగుట్ట ల్లో ఉన్న భూమిని అయోధ్య నగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం 2008లో జీవో 455 జారీ చేసింది. అయితే ఈ భూమిని కాజేసేందుకు దీపక్‌రెడ్డి, సక్సేనాలు భారీ కుట్ర చేశారు. భూమి అసలు యజమాని జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ వారసులంటూ కొందరు బోగస్ వ్యక్తుల్ని తెరపైకి తీసుకువచ్చారు. శివభూషణం అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్‌గా మార్చి భోజగుట్ట భూమికి చెందిన భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. తర్వాత బషీర్ అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ వారసుడంటూ షకీల్ ఇస్లాం ఖాన్ పేరుతో తెరపైకి తెచ్చారు. ఇతడితో భోజగుట్ట భూమి తనదే అంటూ 2008, 2009, 2012ల్లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు చేయించారు. ఆపై షకీల్ తమకు భూమిని విక్రయిం చాడని, అందువల్ల అయోధ్య సొసైటీకి ప్రభుత్వ కేటాయింపు చెల్లదని, దాన్ని రద్దు చేయాలంటూ సక్సేనా తండ్రికి చెందిన జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థ, దీపక్‌రెడ్డి, శైలజ అనే మహిళ 2014లో పిటిషన్లు దాఖలు చేశారు. ఇటీవల వరకు కొన్ని పిటిషన్లపై విచారణ కొనసాగింది. అయితే దీపక్‌రెడ్డి, శైలే‹ష్, శైలజ వేసిన పిటిషన విచారణ జరగలేదు. దీంతో సిబ్బందిఫైళ్ల కోసం వెతికినా లభించలేదు. దీనికి తోడు సీసీఎస్ పోలీసులు గతేడాది జూన్ 6న దీపక్‌రెడ్డి, శైలేష్ తదితరుల్ని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అయోధ్యనగర్ సొసైటీ ప్రతినిధులు వివరాలు హైకోర్టు ముందుంచారు. పరిశీలించిన అనంతరం దీపక్‌రెడ్డి, శైలేష్ కుట్రలను గుర్తించిన న్యాయమూర్తి బోగస్ వ్యక్తుల పేర్లతో దాఖలు చేసిన 14 పిటిషన్లనూ కొట్టేశారు. శైలేష్ తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదైంది. ఇది దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయింది. ఈ కేసులో శైలేష్ నాంపల్లి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని రద్దు చేయించారు. శైలేష్ కోసం గాలించి పట్టుకున్నారు. అతడి నుంచి 11 బోగస్ గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
ఏ బంధమూ లేదు!
‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుని పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’. దీక్షాపంత్, అంగనారాయ్ కథానాయికలు. మోహన ప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.రాఘవయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలోని పాత్రల మధ్య ఎటువంటి బంధమూ ఉండదు. ఏ బంధం లేని 36 పాత్రల మధ్య నడిచే చిత్రమిది. ఈ తరహా మూవీ ఇప్పటి వరకూ తెలుగులో రాలేదు. సరికొత్త కథను యంగ్ టీమ్‌తో కలిసి చేశాం’’ అన్నారు. ‘‘ముకుంద చిత్రం తర్వాత దర్శక-నిర్మాతలు ఈ చిత్రకథ నాకు చెప్పారు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నా’’ అని శైలేష్ అన్నారు. దీక్షాపంత్, అంగనారాయ్, సంగీత దర్శకుడు వెంగీ, కెమెరామ్యాన్ వి.శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చల్ చల్ గుఱ్ఱం..చలాకీ గుఱ్ఱం!
‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుడి పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’. దీక్షా పంథ్, అంగనా రాణి కథానాయికలు. మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య ఈ చిత్రం నిర్మించారు. వెంగీ స్వరాలందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదలచేశారు. హీరో శ్రీకాంత్ బిగ్ సీడీ ఆవిష్కరించగా, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పాటల సీడీ విడుదల చే శారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అందరికీ నచ్చే కథతో తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. హీరో తరుణ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, చిత్ర బృందం పాల్గొన్నారు. -
రా‘బంధువు’!
గుప్తనిధుల పేరుతో పెదనాన్న కుమారుడికి ఎర రూ.15 లక్షల లాభమంటూ రూ.1.5 లక్షలు స్వాహా డబ్బు కోసం నిలదీయడంతో దారుణ హత్య ప్రధాన నిందితుడి అరెస్టు, పరారీలో ఇద్దరు నాగపూర్ వాసులు సనత్‌నగర్: గుప్తనిధులపై అతడికున్న బలహీనతను క్యాష్ చేసుకున్న బంధువే రాబందువయ్యాడు... ‘పెట్టుబడిగా’ పెట్టిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమన్నందుకు కర్కశంగా హతమార్చాడు... ఎస్సార్‌నగర్ ఠాణాలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ మర్డర్‌ను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ఇద్దరు నాగ్‌పూర్ వాసుల కోసం గాలిస్తున్నారు. పశ్చిమ మండల డీసీపీ ఎం.వెంకటేశ్వరరావు బుధవారం పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి ఎస్సార్‌నగర్ ఠాణాలో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... నాగ్‌పూర్ వాసులతో ‘గుప్త’ పరిచయం... మెదక్ జిల్లా మునిపల్లి మండలం మున్సానిపల్లెకు చెందిన చిన్నోళ్ల చంద్రారెడ్డి కుమారుడు చిన్నోళ్ల మాణిక్యరెడ్డి జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మియాపూర్‌లో ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితం మహారాష్ట్రకు వెళ్లినప్పుడు నాగ్‌పూర్ కాచునానికి చెందిన శైలేష్, పదమ్లతో ఇతడికి పరిచయమైంది. వీరు కొన్నాళ్ల క్రితం మాణిక్యరెడ్డికి 1818 ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన కాయిన్ (నాణెం) చూపించి తమ వద్ద గుప్తనిధులు ఉన్నాయని, వాటిని వెలికితీయడానికి కొంతపెట్టుబడి అవసరమని చెప్పారు. దీంతో అతడు తన వద్ద ఉన్న రూ.2 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు శైలేష్, పదమ్లను గుప్తనిధుల విషయం అడగ్గా... వెలికి తీసేందుకు ఇంకా పెట్టుబడి అవసరమని మరో రూ.2.5 లక్షలు ఇస్తే పని పూర్తవుతుందన్నారు. ఆ నిధులు అమ్మగా వచ్చిన డబ్బులో రూ.15 లక్షలు ఇస్తామని నమ్మబలికారు. గుప్తనిధుల పేరుతో డబ్బు కాజేసి... దీంతో మాణిక్యరెడ్డి తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఎర్రగడ్డలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న చిన్నాన్న కుమారుడు చిన్నోళ్ల సంతోష్‌రెడ్డి (28)కి ఫోన్ చేశాడు. మహారాష్ట్రలో గుప్తనిధులు ఉన్నాయని, నీవు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే 15 రోజుల్లో నీకు రూ.15 లక్షలు లాభంగా వస్తుందని చెప్పాడు. మాణిక్యరెడ్డి మాటలు నమ్మిన సంతోష్ రూ.1.5 లక్షలు ఇచ్చాడు. 15 రోజులు గడిచినా తన వాటా డబ్బు రాకపోవడంతో సంతోష్ మాణిక్యరెడ్డిని నిలదీశాడు. దీంతో జనవరి 28న గుప్తనిధులు చూపిస్తానంటూ సంతోష్‌ని నాగ్‌పూర్ తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లాక... ఆ నిధులు అమ్మేవారిని తానే హైదరాబాద్‌కు తీసుకొస్తానని చెప్పి మరుసటి రోజు బస్సులో వెనక్కి పంపించాడు. చందానగర్ లాడ్జిలో హత్యకు కుట్ర... డబ్బు కోసం సంతోష్ ఒత్తిడి పెంచడంతో జనవరి 30న మాణిక్యరెడ్డి, నాగ్‌పూర్‌కు చెందిన శైలేష్, పదమ్లు చం దానగర్లోని ఓ లాడ్డిలో సమావేశమయ్యారు. రూ.15 లక్షలు సంతోష్‌కు ఎందుకివ్వాలి? అతన్ని చంపిస్తే మనమే వాటిని పంచుకుందామంటూ కుట్ర పన్నారు. దీన్ని అమలు చేయడంలో భాగంగా 31న సంతోష్‌కు ఫోన్ చేసిన మాణిక్యరెడ్డి మియాపూర్‌కు పిలిపించి తన ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని నర్సాపూర్ రహదారిలో బయలుదేరాడు. గాగిల్లాపూర్ వద్ద స్వప్న వైన్‌షాపులో మద్యం ఖరీదు చేశాడు. గుప్త నిధుల గురించి మాట్లాడుకుందామని నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని మేడాలమ్మ గుడి వద్దకు తీసుకెళ్లాడు. చంపి, కాల్చేశారు... ఆ ఆలయం వద్ద బైక్ పార్క్ చేసిన మాణిక్యరెడ్డి... సంతోష్‌ను అడవి లోపలికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శైలేష్, పదమ్లతో కలిసి నలుగురూ మద్యం తాగారు. సంతోష్ మద్యం మత్తులోకి జారుకోగానే... అందరూ నిద్రించినట్లుగా నటించారు. సంతోష్ పూర్తిగా నిద్రలోకి జారుకున్న తర్వాత మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో పక్కనే ఉన్న బండరాళ్లతో తలపై మోది అతడిని హత్య చేశారు. శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహంపై ఉన్న దుస్తులు విప్పి, బైక్ నుంచి తీసిన పెట్రోల్ పోసి కాల్చేశారు. ఫిబ్రవరి 5న సంతోష్ ఫోన్ నుంచి ‘నేను పనిపై బయటకు వచ్చా.. త్వరలోనే తిరిగి వస్తా’నంటూ కుటుంబీకులకు ఎస్సెమ్మెస్ పంపారు. ఆపై సంతోష్‌కు చెందిన రెండు సెల్ఫోన్లు మియాపూర్ నాలాలో పడేశారు. మిస్సింగ్ మిస్టరీ వీడిందిలా... సంతోష్ ఆచూకీ లభించకపోవడంతో తండ్రి నర్సింహ్మారెడ్డి పలుచోట్ల గాలించాడు. ఫలితం లేకపోవడంతో ఫిబ్రవరి 10న ఎస్సార్‌నగర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సంతోష్ ఫోన్ల కాల్ డేటాను అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అతడికి వచ్చిన కాల్స్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఓ నెంబర్‌ను గుర్తించారు. ఆ నెంబర్ సోదరుడు మాణిక్యరెడ్డిదిగా తేలడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సతీష్, ఎస్సైలు శ్రీనివాస్, నగేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మరోపక్క సంతోష్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ అతడి బంధువులు బుధవారం ఠాణా వద్ద కొద్దిసేపు ఆందోళన చేశారు. -
శభాష్...శైలేష్
అమెరికాలో తెనాలి సాఫ్ట్వేర్ యువకుడి మేథస్సు వెబ్ ఆపరేటింగ్ సిస్టం టీవీకి రూపకల్పన ఎలక్ట్రానిక్ రంగంలో దూసుకుపోతున్న వినూత్న ఉత్పత్తి తెనాలి: వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ టీవీ...ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో సరికొత్త సంచలనం. దీని ధర లక్షల్లో ఉన్నా మార్కెట్లో అద్భుతమైన క్రేజ్ దక్కించుకుంది.ఎలక్ట్రానిక్ విపణిలో ప్రస్తుతం ఇదే ఆకర్షణీయమైన పరికరకంగా నీరాజనాలు అందుకుంటుది. అయితే దీని రూపకల్పన వెనుక ప్రవాస భారతీయుడైన తెనాలి యువకుడైన శైలేష్ మేధస్సు ఉండడం విశేషం.ప్రస్తుతం ఈయన ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రఖ్యాతి చెందిన అంతర్జాతీయ ఎల్జి కంపెనీలో డెరైక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. ఈయన అక్కడ పనిచేస్తూనే ఇటీవల వెబ్ ఓఎస్ టీవీ రూపకల్పనలో హ్యాండ్స్-ఆన్-లీడర్‌గా పనిచేశారు.ఇప్పుడు ఇది ఎలక్ట్రానిక్ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. తొలిసారిగా 2014 జనవరిలో లాస్ వెగాస్‌లో జరిగిన ఎలక్ట్రానిక్ షోలో శైలేష్ దీన్ని ప్రదర్శించారు.ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ ప్రదర్శించారు. దీనికి మంచి పేరు రావడం, ముఖ్యంగా అమెరికాతో సహా పలు దేశాల్లో దీన్ని విడుదల చేశారు. ఇప్పుడిది తాజాగా ఇండియన్ మార్కెట్లో హల్చల్ చేస్తోంది. నూతన ఆవిష్కరణలే ప్రత్యేకతగా... శైలేష్ స్వస్థలం తెనాలి. తలిదండ్రులు రాచాబత్తుని విద్యుల్లత, శ్రీనివాసరావు. ఏలూరులో బీటెక్ పూర్తిచేశాక ఏడాదిపాటు హైదరాబాద్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం 1997లో అమెరికా వెళ్లారు. ఎక్కడ పనిచేసినా తనకంటూ భిన్నమైన ఉత్పత్తులు డిజైన్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న శైలేష్ 2000 సంవత్సరంలో మోటరోలా ఆన్కార్పొరేటెడ్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేసిన కాలంలో ‘పియానో’ అనే నూతన ప్రొటోకాల్ డిజైన్‌లో కీలకపాత్ర వహించారు. పియానో ఆధారిత వాణిజ్య ప్రొటోటైపును తొలిగా రూపొందించిన జట్టుకు ఈయన నాయకత్వం వహించారు. తర్వాత ఫిలిప్స్ కన్య్జూమర్స్ కమ్యూనికేషన్ సంస్థలో బ్లూటూత్ టెక్నాలజీ సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌గా చేరారు. బ్లూ టూత్, వైర్లెస్ ప్యాకెట్ నెట్వర్క్ ఆధారంగా పరిశోధనాత్మకమైన లోకేషన్ బేస్డ్ సర్వీసెస్‌కు ఆర్కిటెక్టర్ను రూపొందించారు. సంస్థకు రెండు పేటెంట్లను నమోదుచేశారు.2003లో పామ్ వన్ ఇన్ కంపెనీకి మారారు. 2005-06లో మొదటి స్మార్ట్‌ఫోన్ చేసిన ఖ్యాతి ఆ కంపెనీది. ఆ ఘనతలో సీనియర్ ఇంజినీరుగా శైలేష్ పాత్ర ఉంది. 2007 తర్వాత అమెజాన్‌కు వెళ్లారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ పుస్తకాల‘కిండిల్’ (2008) ఉత్పత్తిలో శైలేష్ తనదైన ముద్రవేశారు. అక్కడ్నుంచి ఎల్జి కంపెనీలో డెరైక్టర్ హోదాకు వెళ్లినా, పర్యవేక్షణతోనే సరిపెట్టకుండా పనిచేయటం శైలేష్‌కు ఇష్టం. దాంట్లో భాగంగానే హ్యాండ్స్-ఆన్-టెక్నికల్ లీడర్‌గా వెబ్ ఓఎస్ టీవీ తయారీలో కీలకపాత్ర వహించారు. స్మార్ట్ఫోను తరహాలో ఎన్నో ప్రత్యేకతలు... వెబ్ ఓఎస్ టీవీని పెద్ద స్మార్ట్ ఫోనుగా చెప్పవచ్చు. నెట్లిక్స్లో సినిమా చూస్తూ హోల్డ్‌లో పెట్టి, ఇంకో వీడియో చూసుకోవచ్చు. లైవ్ టీవీ వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోను తరహాలో అన్ని యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు మరో ప్రత్యేకత. వెబ్ ఓఎస్ ఫోన్లు, టాబ్లెట్లను చేసే సాఫ్ట్‌వేర్‌తోనే టీవీ తయారుచేసినట్టు శైలేష్ వివరించారు. ప్రస్తుతం విజయవాడ,గుంటూరు,తెనాలిలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ధర స్క్రీన్ సైజు ప్రకారం రూ.2.50 లక్షల పైగా పలుకుతోంది. -
సోషల్ మీడియా పవర్
బిజినెస్‌మెన్‌కు వరం నగరంలోని ఒక డిజైనర్ షోరూం సోషల్ మీడియాని ఉపయోగించుకుని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తమ బిజినెస్‌ను రెట్టింపు చేసుకుంది. కొందరు యూ ట్యూబ్‌లో ప్రచారం ద్వారా బ్రాండ్ అవేర్‌నె స్ పెంచుతున్నారు. ప్రొడక్ట్ యాడ్స్‌తో పాటు సందేశాత్మక వీడియోలు అప్లోడ్ చేస్తూ వ్యూయర్స్ మనసు గెలుచుకుంటున్నారు. ఫేస్బుక్లో తమ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజూ చర్చలు జరిగేలా జాగ్రత్త పడుతూ తేలికగా కొనుగోలుదార్లకు చేరువ చేస్తున్నారు. ఒక ఉత్పత్తిని ఒకరు లైక్ చేసినా, ఇద్దరు షేర్ చేసినా.. అది అలా అలా మార్కెట్ అయిపోతోంది మరి. మరోవైపు కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికి కూడా ఈ మీడియాపైనే ఆధారపడుతున్నాయి. ఏదైనా కంపెనీలో అనుకోని సంఘటన జరిగితే దానికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి ట్విట్టర్ వినియోగిస్తున్నారు. ఇక్కడ దేశాల సరిహద్దుల మధ్య ఉన్నట్టు కంచెలుండవు. ఇది ఖండాంతరాలు పరుచుకున్న క్లాస్ అండ్ మాస్ హబ్. ఈ ప్రపంచంలో ఆకాశమే హద్దు.. అల్లంత దూరాలను అరచేతిలో చూపే మంత్రనేత్రం ఇది. అనంత విశ్వాన్ని తనలో ఇముడ్చుకుని మానవాళి తప్పించుకోని విధంగా ‘వల’పన్నిన ఇంటర్నెట్లో ఆవిష్కృతమైన మరో అద్భుత మాధ్యమం ‘సోషల్ మీడియా’. అది ఇది ఏదని అన్ని రంగాలు ఇప్పుడీ సోషల్ మీడియాకు సలామ్ కొడుతున్నారు. మొబైల్లో ఫేస్బుక్, వాట్సప్, లింక్డిన్, ఇన్స్టాగ్రామ్ వంటివి వచ్చేయడంతో.. సగటు మనిషి సాంఘిక జీవితం సోషల్ మీడియాతో పెనవేసుకునిపోయింది. మనుషులేనా.. వ్యాపార సంస్థలు, సినిమాలు, పొలిటికల్ పార్టీలు... అన్నీ సోషల్ మీడియాతో బాగా కనెక్టయ్యాయి. మార్కెటింగ్ సంస్థలు షురూ అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంగా అవతరించిన సోషల్ మీడియా ద్వారా అందివస్తున్న ఉపాధి అవకాశాలను యువతకు చేరువ చేసేందుకు పలు శిక్షణా సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి.. ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, యూ ట్యూబ్, బ్లాగ్స్... వంటి వాటి ని ఆధారం చేసుకుని మార్కెటింగ్ నిపుణులుగా రాణించేందుకు అవసరమైన శిక్షణను ఇవి అందిస్తున్నాయి. ‘‘యువతకు ఈ రంగంలో విస్త్రుతమైన అవకాశాలున్నాయి. కేవలం వారాంతాల్లో సెలవు రోజుల్ని ఉపయోగించుకుని స్వల్పకాలిక కోర్సులతో దీనిలో నిష్ణాతులు కావచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కావల్సిన అవగాహన, నేర్పులను మేం అందిస్తాం’’ అని అమీర్‌పేట కేంద్రంగా సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రైనింగ్ సేవలు అందిస్తున్న సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఉపాధిపరంగానూ... తమ ఎదుగుదలకు సోషల్ మీడియాను వినియోగించుకోవచ్చనే స్పృహ వ్యాపారస్తులకు, రాజకీయనాయకులకు నగరంలో బాగా పెరుగుతోంది. ఇదే పెద్దసంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ‘గత ఏడాదే మా సేవల్ని హైదరాబాద్‌లో ప్రారంభించాం. ఇప్పుడు మాకు డజనుకుపైగా క్లయింట్లున్నారు’ అని సోషల్ మీడియా అనుబంధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సోషల్ కిచిడీ నిర్వాహకుడు శైలేష్ అంటున్నారు. ఇప్పుడిప్పుడే విప్లవం మొదలైందనీ.. భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని అంటున్నారాయన. నగరంలో ఇప్పటికే 30పైనే సోషల్ కిచిడి లాంటి కంపెనీలున్నాయి. సో... యువతకు ఉపాధి పరంగానూ ఇది అవకాశాలను విస్తృతం చేస్తుంది. నెట్లో స్టోరుంటే.. అదే ‘పదివేలు’! ఇదీ యువ నెటిజన్ల ఆలోచనా ధోరణి. కబుర్లకు, కాలక్షేపానికి మాత్రమే కాకుండా ఆదాయానికి కూడా సోషల్ మీడియా బాటలు వేస్తోంది. గతంలో ఒక వెబ్‌సైట్‌ను రూపొందించుకుని దాన్ని ఫేస్బుక్ అకౌంట్‌కి అనుసంధానించుకునేవారు. అయితే ఇప్పుడా అవసరం లేకుండా తమ అకౌంట్లను ఫేస్‌బుక్‌లోనే స్టోర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో కేవలం రూ.10 వేల కనీస మొత్తం పెట్టుబడిగా పెడితే చాలు.. ఎవరైనా సరే తాము తయారు చేసిన ఉత్పత్తులు గాని, సేవలుగాని.. మార్కెట్ చేసుకునే అవకాశం లభించింది. ఇది మార్కెట్ గురించి పెద్దగా అవగాహన, పెట్టుబడి అవకాశాలు లేనివారికి వరంగా మారింది. దీంతో ప్రస్తుతం నగరానికి చెందిన వందలమంది ఔత్పాహిక వ్యాపారులు ఎఫ్బి వేదికగా స్టోర్లు నెలకొల్పుతున్నారు. అందుకో ఉదాహరణ ఫేస్బుక్లో అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న కప్‌కేక్ డిజైనర్ రీమా. సరదాగా తయారు చేసిన తన కప్కేక్స్కు మంచి ఆదరణ లభించడంతో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి.. పూర్తిస్థాయిలో నెట్స్టోర్ను స్టార్ట్ చేసి పింక్ కప్‌కేక్స్ పేరుతో ఓ బ్రాండ్‌నే స్టార్ట్ చేసింది. పొలిటీషియన్లకు వరం ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తే గానీ బండీ కదలని పొలిటీషియన్స్‌కు సోషల్‌మీడియా ఓ వరమైంది. ప్రజలకు, పరిపాలనకు అనుసంధానం.. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లే అని భావిస్తున్నారు మన రాజకీయనాయకులు. మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా వీచిన మోడీ వేవ్ వెనుక సోషల్ మీడియా పాత్ర ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంప్రదాయ పద్ధతుల్లో వెళ్లి సార్వత్రిక సమరంలో చతికిలపడ్డ వారు కూడా తప్పు తెలుసుకుని సోషల్ మీడియాకు జై కొడుతున్నారు. గెలిచిన నేతలు కూడా.. తాము చేయాలనుకున్న, చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అదే రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారు. ప్రజల నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తూ సాగిపోతున్నారు. కార్పొరేటర్ నుంచి పీఎం వరకు సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే రాజకీయంగా ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందో తెలుస్తుంది. సోషల్ మీడియా ప్రస్తుతం జీవితంలో అంతర్గతభాగమైపోయింది. ఎలైట్ కస్టమర్స్‌ని చేరుకోవడానికి ఆన్లైన్ మంచి అవకాశం. దీని ద్వారా స్టోర్‌ని ఏర్పాటు చేయడం, నిర్వహించడం వంటి ఖర్చులన్నీ ఆదా అవుతాయి’’ అంటోన్న కుష్నీత్ కురేజా. ఆమె ‘ఔరా’ ఫ్యాషన్ బ్రాండ్‌ని ఆన్లైన్ మీదే ప్రారంభించింది. బయో టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న ఈ హిమాయత్‌నగర్ అమ్మాయి.. జంక్ జ్యుయలరీ, యాక్సెసరీస్ తయారీలో ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకుని నెక్లెస్‌లు, లాంగ్‌చైన్‌లు, పెండెంట్స్, చెవి దిద్దులు, ఉంగరాలు రూపొందిస్తుంది. ప్రారంభించిన ఆర్నెల్లలోనే.. ఫేస్బుక్లో వచ్చి పడిన వందలాది లైక్స్‌ను కస్టమర్స్‌గా మార్చుకుని సక్సెస్ పల్స్ పట్టేసింది. సోషల్ గైడ్... సైబర్ జోన్‌గా పేరున్న హైదరాబాద్‌లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ. కానీ, నగరంలో కొంత వుంది వూత్రమే సోషల్ మీడియూను సరిగా ఉపయోగించుకుంటున్నారు. చాలా వుంది ఫేస్బుక్లో పోస్టింగ్‌లు, ట్విట్టర్లో అకౌంట్లు, వాట్సప్‌లో మెసేజ్‌లతో టైంపాస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని వూర్చేందుకు హైదరాబాద్‌లో ఓ సంస్థ పుట్టుకొచ్చింది. సోషల్ మీడియూతో అవకాశాలకు ఎలా అందిపుచ్చుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. నాలుగేళ్ల కిందట ఏర్పాటైన ‘ఐ డన్ ఎస్ఈవో’ సంస్థ డిజిటల్ మీడియూను యూజ్‌ఫుల్‌గా ఉపయోగించుకోవడంలో అన్లైన్లో సహకారాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థలో వుూడువేల వుందికిపైగా సభ్యులున్నారు. జూన్ 30(సోమవారం)న సోషల్ మీడియూ డే పురస్కరించుకుని పంజాగుట్టలోని ఈథేమ్స్ కాలేజ్ వేదికగా ఆదివారం ఈ గ్రూప్‌లోని సభ్యులంతా ఒక్క చోటకు చేరారు. సోషల్ మీడియూను వురింత సవుర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో అక్కడికి వచ్చిన సభ్యులకు వివరించారు. పోస్టింగ్‌ల విషయుంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిరు వ్యాపారులు తవు ఉత్పత్తులను ఎలా ప్రచారం చేసుకోవాలి, విద్యార్థులు ఉద్యోగవకాశాలను ఎలా మెరుగుపరుచుకోవాలి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. తస్మాత్ జాగ్రత్త.. వునం సోషల్ నెట్‌వర్క్‌లో పోస్టు చేసే ప్రతి విషయూనికీ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. కొందరు స్పోర్టివ్‌గా తీసుకుంటే.. కొందరు ప్రతికూలంగా భావించవచ్చు. పోస్టుల విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన పోస్టులలో కంటెంట్ ఉంటేనే మనల్ని సరిగా మార్కెట్ చేసుకోగలం. - సి.టి. శంకర్ నెటిజన్లకు అవగాహన కల్పించేందుకే.. సోషల్ మీడియూను ప్రజలు సవుర్థంగా వినియోగించుకోవాలనే ఆశయుంతో ‘ఐ డన్ ఎస్ఈవో’ ను స్థాపించాం. గత నాలుగేళ్లుగా ఆన్లైన్లో ఎంతో వుందికి చేరువయ్యూం. మొదటిసారిగా వూ గ్రూప్‌లోని సభ్యులవుంతా ఒక్కచోట ఇలా కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో వురింత వుందికి సేవలందిస్తాం. - చక్రపాణి ‘ఐ డన్ ఎస్ఈవో’ సంస్థ నిర్వాహకుడు జీవితంలో భాగమైంది.. సోషల్ మీడియూ అనేది వున జీవితంలో ఒక భాగంగా వూరింది. దీన్ని సరిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియూకు దూరంగా ఉండడం, దానికి వ్యసనంగా వూరడం రెండూ వుంచిది కాదు. వునకు లాభం చేకూర్చే విధంగా సోషల్ మీడియూను వూర్చుకోవాలి. అంతేకాని దానికి బానిసగా మారొద్దు. - కె.రవి