హీరో వెంకటేశ్ సినీ అభిమానులకు, ప్రేక్షకులకు క్రిస్మస్ కానుక ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
కాగా ‘సైంధవ్’ ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబరు 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, వెంకటేశ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘ఇటీవల మొదలైన ఈ లాంగ్ షెడ్యూల్‌లో వెంకటేశ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. నవాజుద్దీన్ సిద్ధిఖి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, కెమెరా:ఎస్. మణికందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం.
Comments
Please login to add a commentAdd a comment