పట్టణంలో వినోదం | Cable Reddy Movie Opening | Sakshi
Sakshi News home page

పట్టణంలో వినోదం

Published Sat, Aug 19 2023 4:02 AM | Last Updated on Sat, Aug 19 2023 4:02 AM

Cable Reddy Movie Opening - Sakshi

సుహాస్, షాలిని కొండేపూడి జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘కేబుల్‌ రెడ్డి’. శ్రీధర్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు శ్రీధర్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు శైలేష్‌ కొలను క్లాప్‌ కొట్టి, స్క్రిప్ట్‌ని మేకర్స్‌కు అందించారు. అనంతరం  సుహాస్‌ మాట్లాడుతూ– ‘‘రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఒక టౌన్‌లో జరిగే క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అన్నారు శ్రీధర్‌ రెడ్డి. ‘‘బౌండెడ్‌ స్క్రిప్ట్‌తో షూట్‌కి వెళ్తున్నాం. మొదటి షెడ్యూల్‌ను 20 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు బాలు వల్లు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్‌ సాయి, కెమెరా: మహి రెడ్డి పండుగల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement