సోషల్ మీడియా పవర్ | social media power | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా పవర్

Published Mon, Jun 30 2014 12:48 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

సోషల్ మీడియా పవర్ - Sakshi

సోషల్ మీడియా పవర్

బిజినెస్‌మెన్‌కు వరం

నగరంలోని ఒక డిజైనర్ షోరూం సోషల్ మీడియాని ఉపయోగించుకుని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తమ బిజినెస్‌ను రెట్టింపు చేసుకుంది. కొందరు యూ ట్యూబ్‌లో ప్రచారం ద్వారా బ్రాండ్ అవేర్‌నె స్ పెంచుతున్నారు. ప్రొడక్ట్ యాడ్స్‌తో పాటు సందేశాత్మక వీడియోలు అప్‌లోడ్ చేస్తూ వ్యూయర్స్ మనసు గెలుచుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో తమ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజూ చర్చలు జరిగేలా జాగ్రత్త పడుతూ తేలికగా కొనుగోలుదార్లకు చేరువ చేస్తున్నారు. ఒక ఉత్పత్తిని ఒకరు లైక్ చేసినా, ఇద్దరు షేర్ చేసినా.. అది అలా అలా మార్కెట్ అయిపోతోంది మరి. మరోవైపు  కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడానికి కూడా ఈ మీడియాపైనే ఆధారపడుతున్నాయి. ఏదైనా కంపెనీలో అనుకోని సంఘటన జరిగితే దానికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి  ట్విట్టర్ వినియోగిస్తున్నారు.
 
ఇక్కడ దేశాల సరిహద్దుల మధ్య ఉన్నట్టు కంచెలుండవు. ఇది ఖండాంతరాలు పరుచుకున్న క్లాస్ అండ్ మాస్ హబ్. ఈ ప్రపంచంలో ఆకాశమే హద్దు.. అల్లంత దూరాలను అరచేతిలో చూపే మంత్రనేత్రం ఇది. అనంత విశ్వాన్ని తనలో ఇముడ్చుకుని మానవాళి తప్పించుకోని విధంగా ‘వల’పన్నిన ఇంటర్నెట్‌లో ఆవిష్కృతమైన మరో అద్భుత మాధ్యమం ‘సోషల్ మీడియా’. అది ఇది ఏదని అన్ని రంగాలు ఇప్పుడీ సోషల్ మీడియాకు సలామ్ కొడుతున్నారు. మొబైల్‌లో ఫేస్‌బుక్,  వాట్సప్, లింక్డిన్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి వచ్చేయడంతో.. సగటు మనిషి సాంఘిక జీవితం సోషల్ మీడియాతో పెనవేసుకునిపోయింది. మనుషులేనా.. వ్యాపార సంస్థలు, సినిమాలు, పొలిటికల్ పార్టీలు... అన్నీ సోషల్ మీడియాతో బాగా కనెక్టయ్యాయి.
 
మార్కెటింగ్ సంస్థలు షురూ

అత్యంత ప్రభావవంతమైన మాధ్యమంగా అవతరించిన సోషల్ మీడియా ద్వారా అందివస్తున్న ఉపాధి అవకాశాలను యువతకు చేరువ చేసేందుకు పలు శిక్షణా సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి.. ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ ఇన్, యూ ట్యూబ్, బ్లాగ్స్... వంటి  వాటి ని ఆధారం చేసుకుని మార్కెటింగ్ నిపుణులుగా రాణించేందుకు అవసరమైన శిక్షణను ఇవి అందిస్తున్నాయి. ‘‘యువతకు ఈ రంగంలో విస్త్రుతమైన అవకాశాలున్నాయి. కేవలం వారాంతాల్లో సెలవు రోజుల్ని ఉపయోగించుకుని స్వల్పకాలిక కోర్సులతో దీనిలో నిష్ణాతులు కావచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కావల్సిన అవగాహన, నేర్పులను మేం అందిస్తాం’’ అని అమీర్‌పేట కేంద్రంగా సోషల్ మీడియా మార్కెటింగ్ ట్రైనింగ్ సేవలు అందిస్తున్న సంస్థ నిర్వాహకులు చెప్పారు.
 
ఉపాధిపరంగానూ...

తమ ఎదుగుదలకు సోషల్ మీడియాను వినియోగించుకోవచ్చనే స్పృహ వ్యాపారస్తులకు, రాజకీయనాయకులకు నగరంలో బాగా పెరుగుతోంది. ఇదే పెద్దసంఖ్యలో యువతకు ఉపాధి కల్పిస్తోంది.  ‘గత ఏడాదే మా సేవల్ని  హైదరాబాద్‌లో ప్రారంభించాం. ఇప్పుడు మాకు డజనుకుపైగా క్లయింట్లున్నారు’ అని  సోషల్ మీడియా అనుబంధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సోషల్ కిచిడీ నిర్వాహకుడు శైలేష్ అంటున్నారు. ఇప్పుడిప్పుడే విప్లవం మొదలైందనీ.. భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని అంటున్నారాయన.  నగరంలో ఇప్పటికే 30పైనే సోషల్ కిచిడి లాంటి కంపెనీలున్నాయి. సో... యువతకు ఉపాధి పరంగానూ ఇది అవకాశాలను విస్తృతం చేస్తుంది.
 
 నెట్‌లో స్టోరుంటే.. అదే ‘పదివేలు’!
 ఇదీ యువ నెటిజన్ల ఆలోచనా ధోరణి. కబుర్లకు, కాలక్షేపానికి మాత్రమే కాకుండా ఆదాయానికి కూడా సోషల్ మీడియా బాటలు వేస్తోంది. గతంలో ఒక వెబ్‌సైట్‌ను రూపొందించుకుని దాన్ని ఫేస్‌బుక్ అకౌంట్‌కి అనుసంధానించుకునేవారు. అయితే ఇప్పుడా అవసరం లేకుండా తమ అకౌంట్లను ఫేస్‌బుక్‌లోనే స్టోర్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో కేవలం రూ.10 వేల కనీస మొత్తం పెట్టుబడిగా పెడితే చాలు.. ఎవరైనా సరే తాము తయారు చేసిన ఉత్పత్తులు గాని, సేవలుగాని.. మార్కెట్ చేసుకునే అవకాశం లభించింది. ఇది మార్కెట్ గురించి పెద్దగా అవగాహన, పెట్టుబడి అవకాశాలు లేనివారికి వరంగా మారింది. దీంతో ప్రస్తుతం నగరానికి చెందిన వందలమంది ఔత్పాహిక వ్యాపారులు ఎఫ్‌బి వేదికగా స్టోర్లు నెలకొల్పుతున్నారు. అందుకో ఉదాహరణ  ఫేస్‌బుక్‌లో అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న కప్‌కేక్ డిజైనర్ రీమా. సరదాగా తయారు చేసిన తన కప్‌కేక్స్‌కు మంచి ఆదరణ లభించడంతో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి.. పూర్తిస్థాయిలో నెట్‌స్టోర్‌ను స్టార్ట్ చేసి  పింక్ కప్‌కేక్స్ పేరుతో ఓ బ్రాండ్‌నే స్టార్ట్ చేసింది.
 
 
పొలిటీషియన్లకు వరం
ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తే గానీ బండీ కదలని పొలిటీషియన్స్‌కు సోషల్‌మీడియా ఓ వరమైంది.  ప్రజలకు, పరిపాలనకు అనుసంధానం.. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లే అని భావిస్తున్నారు మన రాజకీయనాయకులు. మొన్నటికి మొన్న  దేశవ్యాప్తంగా వీచిన మోడీ వేవ్ వెనుక సోషల్ మీడియా పాత్ర ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంప్రదాయ పద్ధతుల్లో వెళ్లి సార్వత్రిక సమరంలో చతికిలపడ్డ వారు కూడా తప్పు తెలుసుకుని సోషల్ మీడియాకు జై కొడుతున్నారు. గెలిచిన నేతలు కూడా.. తాము చేయాలనుకున్న, చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అదే రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారు. ప్రజల నోటిఫికేషన్స్ యాక్సెప్ట్ చేస్తూ సాగిపోతున్నారు. కార్పొరేటర్ నుంచి పీఎం వరకు సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే రాజకీయంగా ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందో తెలుస్తుంది.
 
సోషల్ మీడియా ప్రస్తుతం జీవితంలో  అంతర్గతభాగమైపోయింది. ఎలైట్ కస్టమర్స్‌ని చేరుకోవడానికి ఆన్‌లైన్ మంచి అవకాశం. దీని ద్వారా స్టోర్‌ని ఏర్పాటు చేయడం, నిర్వహించడం వంటి ఖర్చులన్నీ ఆదా అవుతాయి’’ అంటోన్న  కుష్నీత్ కురేజా. ఆమె ‘ఔరా’  ఫ్యాషన్ బ్రాండ్‌ని ఆన్‌లైన్ మీదే ప్రారంభించింది. బయో టెక్నాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న ఈ హిమాయత్‌నగర్ అమ్మాయి.. జంక్ జ్యుయలరీ, యాక్సెసరీస్ తయారీలో ఉన్న నైపుణ్యాన్ని వినియోగించుకుని  నెక్లెస్‌లు, లాంగ్‌చైన్‌లు, పెండెంట్స్, చెవి దిద్దులు, ఉంగరాలు రూపొందిస్తుంది.  ప్రారంభించిన ఆర్నెల్లలోనే..  ఫేస్‌బుక్‌లో వచ్చి పడిన వందలాది లైక్స్‌ను కస్టమర్స్‌గా మార్చుకుని సక్సెస్ పల్స్ పట్టేసింది.
 
 సోషల్ గైడ్...
 
 సైబర్ జోన్‌గా పేరున్న హైదరాబాద్‌లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ. కానీ, నగరంలో కొంత వుంది వూత్రమే సోషల్ మీడియూను సరిగా ఉపయోగించుకుంటున్నారు. చాలా వుంది ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు, ట్విట్టర్‌లో అకౌంట్‌లు, వాట్సప్‌లో మెసేజ్‌లతో టైంపాస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని వూర్చేందుకు హైదరాబాద్‌లో ఓ సంస్థ పుట్టుకొచ్చింది. సోషల్ మీడియూతో అవకాశాలకు ఎలా అందిపుచ్చుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. నాలుగేళ్ల కిందట ఏర్పాటైన ‘ఐ డన్ ఎస్‌ఈవో’ సంస్థ డిజిటల్ మీడియూను యూజ్‌ఫుల్‌గా ఉపయోగించుకోవడంలో అన్‌లైన్‌లో సహకారాన్ని అందిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థలో వుూడువేల వుందికిపైగా సభ్యులున్నారు. జూన్ 30(సోమవారం)న సోషల్ మీడియూ డే పురస్కరించుకుని పంజాగుట్టలోని ఈథేమ్స్ కాలేజ్ వేదికగా ఆదివారం ఈ గ్రూప్‌లోని సభ్యులంతా ఒక్క చోటకు చేరారు. సోషల్ మీడియూను వురింత సవుర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో అక్కడికి వచ్చిన సభ్యులకు వివరించారు. పోస్టింగ్‌ల విషయుంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిరు వ్యాపారులు తవు ఉత్పత్తులను ఎలా ప్రచారం చేసుకోవాలి, విద్యార్థులు ఉద్యోగవకాశాలను ఎలా మెరుగుపరుచుకోవాలి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
 
 తస్మాత్ జాగ్రత్త..
 వునం సోషల్ నెట్‌వర్క్‌లో పోస్టు చేసే ప్రతి విషయూనికీ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. కొందరు స్పోర్టివ్‌గా తీసుకుంటే.. కొందరు ప్రతికూలంగా భావించవచ్చు. పోస్టుల విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన పోస్టులలో కంటెంట్ ఉంటేనే మనల్ని సరిగా మార్కెట్ చేసుకోగలం.
 - సి.టి. శంకర్
 
నెటిజన్లకు అవగాహన కల్పించేందుకే..
సోషల్ మీడియూను ప్రజలు సవుర్థంగా వినియోగించుకోవాలనే ఆశయుంతో ‘ఐ డన్ ఎస్‌ఈవో’ ను స్థాపించాం.  గత నాలుగేళ్లుగా ఆన్‌లైన్‌లో ఎంతో వుందికి చేరువయ్యూం. మొదటిసారిగా వూ గ్రూప్‌లోని సభ్యులవుంతా ఒక్కచోట ఇలా కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో వురింత వుందికి సేవలందిస్తాం.
 - చక్రపాణి ‘ఐ డన్ ఎస్‌ఈవో’ సంస్థ నిర్వాహకుడు
 
జీవితంలో భాగమైంది..

సోషల్ మీడియూ అనేది వున జీవితంలో ఒక భాగంగా వూరింది. దీన్ని సరిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియూకు దూరంగా ఉండడం, దానికి వ్యసనంగా వూరడం రెండూ వుంచిది కాదు. వునకు లాభం చేకూర్చే విధంగా సోషల్ మీడియూను వూర్చుకోవాలి. అంతేకాని దానికి బానిసగా మారొద్దు.
 - కె.రవి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement