ఏ బంధమూ లేదు! | Chal chal gurram all set to hit the screens | Sakshi
Sakshi News home page

ఏ బంధమూ లేదు!

Published Fri, Oct 21 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

ఏ బంధమూ లేదు!

ఏ బంధమూ లేదు!

‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుని పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’. దీక్షాపంత్, అంగనారాయ్ కథానాయికలు. మోహన ప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.రాఘవయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలోని పాత్రల మధ్య ఎటువంటి బంధమూ ఉండదు.

ఏ బంధం లేని 36 పాత్రల మధ్య నడిచే చిత్రమిది. ఈ తరహా మూవీ ఇప్పటి వరకూ తెలుగులో రాలేదు. సరికొత్త కథను యంగ్ టీమ్‌తో కలిసి చేశాం’’ అన్నారు. ‘‘ముకుంద చిత్రం తర్వాత దర్శక-నిర్మాతలు ఈ చిత్రకథ నాకు చెప్పారు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నా’’ అని శైలేష్ అన్నారు. దీక్షాపంత్, అంగనారాయ్, సంగీత దర్శకుడు వెంగీ, కెమెరామ్యాన్ వి.శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement