Chal chal gurram
-
ఏ బంధమూ లేదు!
‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుని పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’. దీక్షాపంత్, అంగనారాయ్ కథానాయికలు. మోహన ప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.రాఘవయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలోని పాత్రల మధ్య ఎటువంటి బంధమూ ఉండదు. ఏ బంధం లేని 36 పాత్రల మధ్య నడిచే చిత్రమిది. ఈ తరహా మూవీ ఇప్పటి వరకూ తెలుగులో రాలేదు. సరికొత్త కథను యంగ్ టీమ్‌తో కలిసి చేశాం’’ అన్నారు. ‘‘ముకుంద చిత్రం తర్వాత దర్శక-నిర్మాతలు ఈ చిత్రకథ నాకు చెప్పారు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నా’’ అని శైలేష్ అన్నారు. దీక్షాపంత్, అంగనారాయ్, సంగీత దర్శకుడు వెంగీ, కెమెరామ్యాన్ వి.శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చల్ చల్ గుఱ్ఱం..చలాకీ గుఱ్ఱం!
‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుడి పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’. దీక్షా పంథ్, అంగనా రాణి కథానాయికలు. మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య ఈ చిత్రం నిర్మించారు. వెంగీ స్వరాలందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదలచేశారు. హీరో శ్రీకాంత్ బిగ్ సీడీ ఆవిష్కరించగా, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పాటల సీడీ విడుదల చే శారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అందరికీ నచ్చే కథతో తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. హీరో తరుణ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, చిత్ర బృందం పాల్గొన్నారు.