చల్ చల్ గుఱ్ఱం..చలాకీ గుఱ్ఱం! | Chal Chal Gurram audio released | Sakshi
Sakshi News home page

చల్ చల్ గుఱ్ఱం..చలాకీ గుఱ్ఱం!

Apr 22 2016 10:27 PM | Updated on Sep 3 2017 10:31 PM

చల్ చల్ గుఱ్ఱం..చలాకీ గుఱ్ఱం!

చల్ చల్ గుఱ్ఱం..చలాకీ గుఱ్ఱం!

‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుడి పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’.

‘ముకుంద’ చిత్రంలో వరుణ్‌తేజ్ స్నేహితుడి పాత్రలో కనిపించిన శైలేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం’. దీక్షా పంథ్, అంగనా రాణి కథానాయికలు. మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య ఈ చిత్రం నిర్మించారు. వెంగీ స్వరాలందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదలచేశారు. హీరో శ్రీకాంత్ బిగ్ సీడీ ఆవిష్కరించగా, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పాటల సీడీ విడుదల చే శారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అందరికీ నచ్చే కథతో తెరకెక్కించాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. హీరో తరుణ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, చిత్ర బృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement