యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'సైంధవ్‌'.. తొలి షెడ్యూల్ పూర్తి  | Venkatesh 75th film action entertainer Saindhav | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా 'సైంధవ్‌'.. తొలి షెడ్యూల్ పూర్తి 

Published Wed, Apr 12 2023 1:26 AM | Last Updated on Wed, Apr 12 2023 7:07 AM

Venkatesh 75th film action entertainer Saindhav - Sakshi

వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సైంధవ్‌’. ‘హిట్‌’ ఫ్రాంచైజీ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది.

ఈ షెడ్యూల్‌ విజయవంతంగా పూర్తయినట్లు, ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు వెంకటేశ్‌ పాల్గొనగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్‌ మంగళవారం వెల్లడించింది. ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్‌ను కూడా వేశారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తెలుగుకి పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, కెమెరా:  ఎస్‌. మణికందన్, సహనిర్మాత: కిషోర్‌ తాళ్లూరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement