
జీవితంలో ఎదగాలంటే ఏదో ఒక పని చేయాలి, చేస్తూనే ఉండాలి. అయితే కొంతమంది కొన్ని సందర్భాల్లో తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలి స్వయం ఉపాధి (వ్యవసాయ రంగంలో) ప్రారంభిస్తున్నారు. అలా ప్రారంభించి విజయం పొందినవారి జాబితాలో 'శైలేష్ మోదక్' ఒకరు. ఇంతకీ ఇతడు ఏ ఉద్యోగం చేసాడు, ఎందుకు వదిలేసాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.
పూణేకి చెందిన శైలేష్ మోదక్ ఒక కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదించేవాడు. అయితే ఉద్యోగం వదిలి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాడు. హైడ్రోపోనిక్స్, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమతో కొత్త ప్రయోగాలను చేయడం మొదలుపెట్టాడు.
ప్రారంభంలో ఉద్యోగం చేస్తూనే తన కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే పరాగసంపర్కం కోసం తేనెటీగలు అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టినప్పటికీ తన ఆలోచన ఫలించలేదు. తరువాత వ్యవసాయం గురించి బాగా తెలుసుకుని 2016లో ఉద్యోగం వదిలి పూర్తి సమయం వ్యాపారానికే కేటాయించాడు.
(ఇదీ చదవండి: Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!)
తరువాత అతి కాలంలోనే ఖరీదైన 'కుంకుమ పువ్వు' సాగుచేయాలని దానికి కావలసిన సన్నాహాలు సిద్ధం చేసుకున్నాడు. క్రమంగా ఈ రోజు షిప్పింగ్ కంటైనర్లలో కుంకుమ పువ్వు పండించి లక్షలు సంపాదించగలిగాడు. కంటైనర్‌లో పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేయడానికి అతను వివిధ హైటెక్ పరికరాలను ఉపయోగించడమే కాకుండా, కాశ్మీర్‌లోని పాంపోర్ నుంచి సేకరించిన ప్రీమియం క్రోకస్ కార్మ్స్/బల్బుల సహాయంతో కుంకుమపువ్వు పండిస్తూ మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment