
సత్యనారాయణ, టీజీ వెంకటేష్
శైలేష్, ఏఇషా ఆదరహ జంటగా శైలేష్ సాగర్ దర్శక త్వంలో రామసత్యనారాయణ నిర్మించిన 98వ చిత్రం ‘శివ 143’. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్న సందర్బంగా ప్రముఖ ఎంపీ టీజీ వెంకటేష్ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ సెంచురీకి చేరువలో ఉన్నారు. వంద సినిమాలతో ఆపకుండా ఆయన మరెన్నో సినిమాలు నిర్మించాలి. ‘శివ 143’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకున్నాం. కానీ సెన్సార్ బోర్డ్‌వారు సినిమాని చూడకపోవడంతో కుదరలేదు. అందుకే ఫిబ్రవరికి వాయిదా వేశాం. ఈ చిత్రానికి ముందు మేం నిర్మించిన ‘పోలీస్ పటాస్’ ట్రైలర్‌ని వెంకటేష్‌గారి చేతుల మీదగా విడుదల చేయించాం. ఆ సినిమాను విజయవంతంగా విడుదల చేశాం. అలానే ఈ సినిమాని కూడా ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ.