
టాలీవుడ్ యంగ్ హీరో కిరణం అబ్బవరం మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క మూవీ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'దిల్ రూబా'. ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌కు విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమాకు వెళ్లినట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు చూసి తను అసౌకర్యంగా ఫీలవడంతో బయటికి వచ్చేసినట్లు తెలిపారు. సినిమా మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయామని కిరణ్ పేర్కొన్నారు. తన భార్య గర్భంతో ఉండడంతో వయోలెన్స్ మూవీ చూడలేక వెనక్కి వచ్చేశామని కిరణ్ వివరించారు.
ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..'నా భార్యతో నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్లా. ఫుల్ వయోలెన్స్‌గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీలైంది. అందువల్లే మూవీ మధ్యలోనే బయటికి వచ్చేశాం. క్లైమాక్స్ సీన్ వరకు ఉండలేదు. ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వందలో పదిశాతం ప్రభావం ఉండొచ్చు. అలా అని ఆ సినిమాలో పాటలు, సీన్స్‌ను వదిలేయడం లేదు కదా. ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సు బట్టి మారుతూ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment