ఎవరి కోసం ఎవరూ రారు.. అది మాత్రమే మాట‍్లాడాలి: దిల్‌ రాజు హాట్‌ కామెంట్స్ | Tollywood Producer Dil Raju Comments On Cinema Industry Support For Artists, Check Out For More Insights | Sakshi
Sakshi News home page

Dil Raju: మరోసారి ఎమోషనల్ కావొద్దు.. మీకు మీరే నిరూపించుకోవాలి: దిల్ రాజు

Published Fri, Nov 8 2024 3:59 PM | Last Updated on Fri, Nov 8 2024 4:47 PM

Tollywood Producer Dil Raju Comments On Cinema Industry Support For Artists

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్‌ మీట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన టాలెంట్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ సపోర్ట్ చేయరని అ‍న్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో చూశానని తెలిపారు. ఇదంతా నీ కష్టం వల్లే సాధ్యమైందని దిల్ రాజు ప్రశంసించారు. అంతేకానీ ఇక్కడ ఎవరి కోసమో మీరు వెయిట్ చేయవద్దని కోరారు. నీ దగ్గర టాలెంట్ ఉందని.. ట్రోల్స్ గురించి మరోసారి అలా ఎమోషనల్ కావొద్దని కిరణ్ అబ్బవరంకు దిల్‌ రాజు సూచించారు.

ఎవరూ సపోర్ట్‌ చేయరు..

ఇటీవల మరో టాలీవుడ్‌ హీరో రాకేశ్ వర్రే సైతం చిన్న హీరోలకు సెలబ్రిటీ స్టార్స్‌ ఎవరూ సపోర్ట్‌ చేయడం లేదని మాట్లాడారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం గురించి కూడా దిల్ రాజు ప్రస్తావించారు. మీ టాలెంట్‌, హార్డ్‌ వర్క్‌ను నమ్ముకోండి తప్ప.. ఇక్కడ ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయరు.. అలాగే వెనక్కి కూడా లాగరని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని.. సక్సెస్‌ వస్తే మాలాంటి వాళ్లు వచ్చి అభినందిస్తామని దిల్ రాజు కామెంట్స్ చేశారు.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో నిర్మాత దిల్‌ రాజు పాల్గొని మాట్లాడారు. కాగా.. ఈ చిత్రానికి సుజిత్, సందీప్‌ ద్వయం దర్శకత్వం వహించారు.

ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా...

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - 'మా "క" సక్సెస్ మీట్‌కు వచ్చిన  పెద్దలందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్  ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు ఆ నంబర్స్ మారిపోవడానికి. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను' అని అన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement