
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఎవరి సినిమాపై ఎఫెక్ట్ పడుతుందో వారు మాత్రమే పైరసీ గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు. పైరసీ గురించి శుక్రవారం మాట్లాడితే సోమవారానికే మర్చిపోతున్నారని అన్నారు. పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దిల్ రాజు మాట్లాడుతూ..' ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే పైరసీపై మాట్లాడతారు. ఈ విషయాన్ని శుక్రవారం మాట్లాడితే.. సోమవారానికి మర్చిపోతున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా నేను లీడ్ చెస్తాను . నిర్మాతలందరు కలిసి రావాలి. డబ్బులు పోయేవి నిర్మాతలవే కాబట్టి అందరూ మేల్కోవాలి. సినిమాలు అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నవారు కూడా ముందుకు రావాలి. నేను నిర్మాతగా, పంపిణీదారుడిగా వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటా. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన, నితిన్ ఎల్లమ్మ సినిమాల స్క్రిప్ట్ లు సిద్దంగా ఉన్నయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.' అని వెల్లడించారు.
కాగా.. సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీ అనే భూతం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, తండేల్, విదాముయార్చి సినిమాలు సైతం పైరసీ బారినపడ్డాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఈ సంఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే తండేల్ మూవీని పైరసీ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని నిర్మాత బన్నీ వాసు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment