రామ్ చరణ్ ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదికి సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఏపీలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. విజయవాడలో దాదాపు 256 అడుగులతో ఏర్పాటు చేసిన కటౌట్‌ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. ఈ భారీ కటౌట్‌కు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దిల్ రాజుకు అవార్డ్‌ను అందజేశారు. కాగా.. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఈ కటౌట్‌ను సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..' జనవరి 1న గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ట్రైలర్ చూస్తే ఈ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. గేమ్ ఛేంజర్‌లో రామ్‌చరణ్ నట విశ్వరూపం చూస్తారు. రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేసిన మెగా అభిమానులకు నా ధన్యవాదాలు' అని అన్నారు.
కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీలో కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment