తొలి రోజే తనతో ప్రేమలో పడిపోయా: టాలీవుడ్ యంగ్ హీరో | Tollywood Hero Kiran Abbavaram Shares His Love Story With Rahasya Ghorak, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram Love Story: 'షూటింగ్ తొలిరోజే పడిపోయా'

Published Thu, Oct 17 2024 9:49 PM | Last Updated on Fri, Oct 18 2024 11:02 AM

Tollywood Hero Kiran Abbavaram Shares His Love With Rahasya Ghorak

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం 'క' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. 70వ దశకంలోని విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

ప్రస్తుతం 'క' మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగా పాల్గొన్న ఈవెంట్‌లో తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. షూటింగ్‌ మొదటి రోజే తనతో ప్రేమలో పడ్డానని తెలిపారు. ‍అయితే ఈ విషయం కేవలం తన సన్నిహితులకు మాత్రమే తెలుసన్నారు. మా రిలేషన్ ఎవరికీ చెప్పకుండా  సీక్రెట్‌గానే ఉంచినట్లు కిరణ్ వెల్లడించారు.

కాగా.. ఆగస్టు  22న కర్ణాటకలో కూర్గ్‌లో వీళ్ల పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. సాప్ట్‌వేర్ ఇంజినీర్స్ అయిన కిరణ్, రహస్య.. షార్ట్ ఫిల్మ్స్‌తో యాక్టింగ్ సైడ్ వచ్చాడు. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతో మొదలైన స్నేహం కాస్తా.. ఆ తర్వాత ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటల వరకు వచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు కిరణ్-రహస్య ప్రేమించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement