Marco Movie
-
మలయాళ మూవీ.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది!
ఉన్ని ముకుందన్( Unni Mukundan) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం 'మార్కో'(marco). ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో తెరకెక్కించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షరీప్ మహ్మద్ నిర్మించారు. అయితే ఈనెల 20న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వర్షన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!)ఈ నేపథ్యంలో మార్కో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల సరసన నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
Marco First Look: టెర్రిఫిక్ లుక్ లో ఉన్ని ముకుందన్
‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.2024లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తి ని పట్టుకొని ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా కు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్