Marco First Look: టెర్రిఫిక్ లుక్ లో ఉన్ని ముకుందన్ | Marco Movie First Look Out | Sakshi
Sakshi News home page

Marco First Look: టెర్రిఫిక్ లుక్ లో ఉన్ని ముకుందన్

Published Sun, Jun 16 2024 1:17 PM

Marco Movie First Look Out

‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్ష‌న్ జాన‌ర్‌లో రానున్న ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్‌ కు మంచి స్పందన లభించింది.

2024లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యాన‌ర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండ‌గా.. ప్రేమ‌మ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తి ని పట్టుకొని ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా కు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement