
గతేడాది రిలీజైన మోస్ట్ వయలెంట్ చిత్రం మార్కో(Marco). ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం.. మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది.
అంతేకాకుండా మలయాళంతో(Malayalam Movie) పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ(OTT) విడుదల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. వచ్చేనెల 14న లవర్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మార్కో ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సోనీ లివ్(Sony Liv) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
మార్కో కథేంటంటే..?
జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్‌ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment