ఓటీటీలోకి రూ.100 కోట్ల సంచలనం ‘మార్కో’.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా? | Unni Mukundan Marco Movie OTT Platform Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి మోస్ట్‌ వయలెంట్‌ మూవీ ‘మార్కో’.. స్ట్రీమింగ్‌ అప్పుడేనా?

Published Sat, Jan 25 2025 6:21 PM | Last Updated on Sat, Jan 25 2025 7:06 PM

Unni Mukundan Marco Movie OTT Platform Locked

మార్కో(Marco Movie).. గతేడాది రిలీజైన మోస్ట్‌ వయలెంట్‌ చిత్రమిది. ఉన్ని ముకుందన్(Unni Mukundan) హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా..మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమా అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ ఈ మూవీ రైట్స్‌ కొనేందుకు పోటీ పడ్డాయట. చివరకు  సోనీలివ్ (Sony LIV) ఈ సినిమాను అన్ని భాషల హక్కులతో  భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

స్ట్రీమింగ్‌ అప్పుడేనా?
మోస్ట్‌ వయలెంట్‌ చిత్రంగా చరిత్రకెక్కిన ఈ మూవీ అన్ని భాషల డిజిటల్‌ రైట్స్‌ని సోనీలివ్‌ కొనుగోలు చేసింది. మలయాళ ఇండస్ట్రీలోనే ఇంతవరకు ఏ సినిమాకు పెట్టని రేటు ఈ చిత్రానికి పెట్టారట. థియేటర్స్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో..ఓటీటీలోనూ మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంపై భారీ పోటీ ఏర్పడింది. 

(చదవండి: ఓటీటీలో రియల్‌ పొలిటిక‌ల్‌ థ్రిల్ల‌ర్ సినిమా.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్‌)

అయితే ఇప్పుడప్పుడే కాకుండా కాస్త ఆలస్యంగానే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని సోనీలివ్‌ భావిస్తోందట. పిభ్రవరి మూడో వారంలో  ఈ చిత్రం ఓటిటిలో వచ్చే అవకాసం ఉందంటోంది మాలీవుడ్‌ టాక్‌.త్వరలోనే ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

మార్కో కథేంటి?
జార్జ్‌ (సిద్దిఖ్ఖీ) గోల్డ్‌ బిజినెస్‌ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్‌ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా ‍వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్‌(ఇషాన్‌ షౌకాత్‌) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్‌. విక్టర్‌ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది.  విదేశాలకు వెళ్లిన జార్జ్‌ మరో తమ్ముడు(జార్జ్‌ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్‌)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్‌ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్‌ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్‌ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement