
మాలీవుడ్ స్టార్ ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన చిత్రం మార్కో(Marco Movie). మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. కేవలం మలయాళంలోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టర్‌ను షేర్ చేసింది. అయితే ఆహాలో కేవలం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అయితే ఓవర్‌సీస్ అభిమానులకు మాత్రం ఈనెల 18 నుంచే స్ట్రీమింగ్ కానుంది. కాగా.. మార్కో చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
మార్కో కథేంంటంటే?
జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్‌ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.
Get ready to experience the most violent and biggest film on Aha! #Marco storms in with action like never before. Streaming from Feb 21 only in Telugu, on Aha!
Overseas streaming from Feb 18 ! pic.twitter.com/uHFHr7zH6f— ahavideoin (@ahavideoIN) February 16, 2025
Comments
Please login to add a commentAdd a comment