unni mukundan
-
మార్కో యాక్షన్
ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన చిత్రం ‘మార్కో’. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రధారులు. షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న మలయాళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఎన్వీఆర్ సినిమా తెలుగులో జనవరి 1న రిలీజ్ చేస్తోంది. ‘‘వయొలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘మార్కో’. టైటిల్ రోల్లో ఉన్ని ముకుందన్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా మలయాళంలో సంచలన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతం: రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ప్రొడ్యూసర్: జుమానా షరీఫ్, కెమెరా: చంద్రు సెల్వరాజ్. -
మలయాళ మూవీ.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది!
ఉన్ని ముకుందన్( Unni Mukundan) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం 'మార్కో'(marco). ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని దర్శకత్వంలో తెరకెక్కించారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షరీప్ మహ్మద్ నిర్మించారు. అయితే ఈనెల 20న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ హిందీ వర్షన్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్.. తెలుగులోనూ సాంగ్ వచ్చేసింది!)ఈ నేపథ్యంలో మార్కో మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మరిన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో తొలిసారి థియేట్రికల్ రిలీజైన మలయాళ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి, కేజీఎఫ్ లాంటి చిత్రాల సరసన నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసమే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. -
Marco First Look: టెర్రిఫిక్ లుక్ లో ఉన్ని ముకుందన్
‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘ఖిలాడీ’ ‘యశోద’, మాలికాపురం వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ఇప్పుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్కో . మైఖేల్, ది గ్రేట్ ఫాదర్ సినిమాల ఫేమ్ హనీఫ్ అదేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ జానర్లో రానున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.2024లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ యాక్షన్ మూవీని క్యూబ్స్ ఎంటర్టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా.. ప్రేమమ్ సినిమా హీరో నివిన్ పాలీ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది. రక్తపు మరకలతో సీరియస్ లుక్ లో కత్తి ని పట్టుకొని ఉన్ని ముకుందన్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా కు వస్తున్నారు ప్రేక్షకులు. త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు మేకర్స్ -
ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!
సూరి కథానాయకుడిగా నటించిన చిత్రం గరుడన్. శశికుమార్, ఉన్ని ముకుందన్, వడివుక్కరసి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం గరుడన్. దర్శకుడు వెట్రిమారన్ కథను అందించి తన గ్రాస్‌రూట్ స్డూడియో కంపెనీ సంస్థ కె.కుమార్‌కు చెందిన లార్క్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి దురై సెంథిల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ విడుదల కాగా.. స్థానిక నక్కలజాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించని ఘటన మరోసారి వివాదంగా మారింది. ఇంతకు ముందు ఇలాంటి ఘటనే చెన్నైలోని ఒక థియేటర్లో జరిగింది. తాజాగా గరుడన్ చిత్రాన్ని చూడడానికి వచ్చిన నక్కలజాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించక పోవడంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారుఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రాన్ని చూడటానికి నక్కలజాతికి చెందిన 20 మందికి పైగా ప్రజలు కడలూర్ సమీపంలోని అన్నాపాలంలోని థియేటర్‌కు వెళ్లారు. అయితే వారిని థియేటర్ నిర్వాహకుల థియేటర్లోకి అనుమతించలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కలగచేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కలజాతి ప్రజలకు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో వారు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ థియేటర్ వద్ద కలకలం చెలరేగింది. దీంతో 20కి పైగా పోలీసులతో ఆ థియేటర్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆ హీరోతో ఓ సినిమా చేశా.. అయినా నంబర్ బ్లాక్ చేశాడు: హీరోయిన్
మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జై గణేష్'. ఈ సినిమాకు రంజిత్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం థియేటర్లలో విడుదల కానుంది. వీరిద్దరు చివరిసారిగా 2017లో విడుదలైన'మాస్టర్‌పీస్' చిత్రంలో కనిపించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మహిమ నంబియాన్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మాస్టర్‌పీస్ చిత్రం తర్వాత ఉన్ని ముకుందన్ తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడని తెలిపింది. జై గణేశ్ మూవీలో నటించేవరకు తనను అన్‌బ్లాక్ చేయలేదని కూడా ఆమె పేర్కొంది. మహిమ నంబియార్ మాట్లాడుతూ..'ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకోవడానికి స్క్రిప్ట్ రైటర్ ఉదయ్కృష్ణకి కాల్ చేశా. అతని వద్ద నుంచి ఉన్ని ముకుందన్ నంబర్ తీసుకుని వాట్సాప్‌లో వాయిస్ మేసేజ్ పంపా. నేను మహిమను. నేనెవరో నీకు తెలుసు అనుకుంటున్నా. ఉదయన్ నీ నంబర్ ఇచ్చాడని చెబుతూనే ఉదయన్ అనే పదాన్ని రెండు మూడు సార్లు రిపీట్ చేశా. దీంతో ఉన్ని నా వాయిస్ మేసేజ్ విని బ్లాక్ చేశాడు. కానీ ఉన్ని ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. ఆ తర్వాత ఉన్ని ఉదయన్కి ఫోన్ చేశాడు. ఆమె చాలా అహంకారి. ఆమె మిమ్మల్ని ఉదయన్ అని పిలుస్తోంది. సీనియర్ని ఇలాగేనా పిలిచేది అన్నాడట. దీంతో ఏడేళ్లుగా నా నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేశాడు' అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా ఉన్ని ముకుందన్ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో కోపంతో తన నంబర్‌ను బ్లాక్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత బ్లాక్ చేసిన సంగతే మరిచిపోయినట్లు తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మహిమ ఆర్డీఎక్స్లో నటించి హిట్ కొట్టినప్పుడు చూశాను. ఆ తర్వాత రంజిత్ శంకర్ సినిమాలో మహిమ హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది. దీంతో వెంటనే ఆమె కాంటాక్ట్‌ని బ్లాక్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే అన్‌బ్లాక్ చేసి మెసేజ్ పంపాను.. నేను ఉన్నిని.. మీరు ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని' ఉన్ని ముకుందన్ అన్నారు. కాగా.. ఏడేళ్ల తర్వాత వీరిద్దరు జంటగా నటించిన జై గణేష్ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నాతో డేటింగ్ అంటే ఆమెకు పెళ్లి అయినట్లే: టాప్ హీరో
మలయాళ హీరో ఉన్ని ముకుందన్.. జనతా గ్యారేజ్,భాగమతి, యశోద చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. శబరిమల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించిన 'మాలికాపురం' అనే చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. గత కొద్దిరోజులుగా హీరోయిన్ అనుశ్రీతో డేటింగ్లో ఉన్నాడని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఉన్ని ముకుందన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం జై గణేష్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. మలయాళ చిత్రసీమలోని అతికొద్ది మంది బ్యాచిలర్లలో ఒకరైన కారణంగా, ఆయన తరచుగా తన సహనటులతో డేటింగ్ పుకార్లలో చిక్కుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో నటి అనుశ్రీతో ఉన్ని ముకుందన్ రిలేషన్లో ఉన్నాడని వార్తలు వ్యాపించాయి. ఈ పుకార్లకు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పాడు. అనుశ్రీతో ఒక సినిమా మాత్రమే చేయబోతున్నాను. ఇండస్ట్రీలో నా పేరు తరచుగా ఇతర హీరోయిన్లతో ముడిపెడుతూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుది. గతంలో కూడా ఇలాగే డేటింగ్లో ఉన్నానంటూ పలువురి హీరోయిన్లతో లింక్ పెట్టారు. ఇప్పుడు ఆ హీరోయిన్లు అందరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం నాతో డేటింగ్ రూమర్స్ కారణంగా అనుశ్రీ కూడా త్వరలో పెళ్లి చేసుకోనుంది అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతానికి అయితే నేను ఎవరితోనూ డేటింగ్లో లేను. కానీ ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఈ రూమర్స్ వల్ల అనుశ్రీ కాస్త ఒత్తిడికి గురికావచ్చు. ఎందుకంటే ఆమె ఇలాంటి పుకారులలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి, కానీ నాకు ఇలాంటివి అలవాటే..' అని ఆయన క్లారిటీ ఇచ్చారు. -
హీరోయిన్‌తో స్టార్ హీరో పెళ్లి?
మలయాళంలోని హ్యాండ్సమ్ హీరోల్లో ఉన్ని ముకుందన్ ఒకరు. జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడి, యశోద సినిమాలతో తెలుగువారికీ ఈయన సుపరిచితుడయ్యాడు. 36 ఏళ్ల వయసున్న ఈ హీరో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న అనుశ్రీతో కొత్త జీవితం ఆరంభించబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరు ఓ ఈవెంట్లోనూ కలిసి కనిపించడంతో ఇది నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వార్తలపై ఉన్నిముకుందన్ స్పందించాడు. తన పెళ్లి గురించి తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన వ్యక్తిని ఉద్దేశిస్తూ.. 'ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయకుండా ఆపడానికి నీకెంత డబ్బివ్వాలో చెప్పు..' అని మండిపడ్డాడు. దీంతో హీరోహీరోయిన్ల పెళ్లంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. చదవండి: మొదటి భార్యకు అందుకే విడాకులు.. ఆమె రెండో భర్త నా కొడుకును.. -
లైంగిక వేధింపుల కేసు.. హీరోకు షాకిచ్చిన హైకోర్టు!
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్మెంట్ కుదిరిందని ఊహగానాలు కూడా వచ్చాయి. (ఇది చదవండి: 'డింపుల్‌తో డీసీపీ ర్యాష్‌గా మాట్లాడారు.. అందుకే కాలితో తన్నారు') కాగా.. 2017 ఆగస్టు 23న సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకు ఫిర్యాదులో చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్మెంట్లో ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు. ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఆయనకు కోర్టుల్లో చుక్కెదురైంది. దీంతో నటుడు తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) కాగా.. నటుడు చివరిసారిగా 'మలికాపురం చిత్రంలో కనిపించారు. 2011లో 'సీడన్' అనే తమిళ సినిమాతో ముకుందన్ తెరంగేట్రం చేశారు. అతను మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు. 2020లో ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌ని ప్రొడక్షన్ బ్యానర్ నడుపుతున్నాడు. -
లైంగిక వేధింపుల కేసులో ‘యశోద’ నటుడికి షాక్!
యశోద మూవీ నటుడు, మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకించ్చింది. లైంగిక వేధింపులు కేసులో అతడికి స్టే ఆర్డర్‌ను విత్ డ్రా చేస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉన్ని ముకుందన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి 2018లో ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంఓ ఉన్ని ముకుందన్ తరపు న్యాయవాది ఈ కేసులో బాధిత యువతి సంతకం చేసినట్లు తప్పుడు పత్రాలను కోర్టుకు సమర్పించడంతో హైకోర్టు ఆమె ఫిర్యాదును కొట్టిపారేసింది. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ అంతేకాదు ఈ కేసులో ఉన్ని ముకుందన్‌కు స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో తాను ఎలాంటి పత్రాలపై సంతకం చేయలేదని బాధిత యువతి కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో ఉన్ని ముకుందన్‌కు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను తాజాగా హైకోర్ట్ విత్ డ్రా చేసుకుంది. అంతేకాదు కోర్టుకు తప్పుడు పత్రాలను చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని చూసిన వివాదాస్పద లాయర్ సాయిబీ జోస్ కిడంగూర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన చర్య అని, ఈ ఆరోపణలపై సమాధానాలు చెప్పాలని న్యాయవాదిని ఆదేశించింది. చదవండి: ఆ కామెంట్ నన్ను తీవ్రంగా బాధిస్తోంది: జాన్వీ కపూర్ ఆవేదన ఈ కేసులో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని కృష్ణన్‌ను ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా ఈ కేసును కోర్టు బయటే పరిష్కరించేందుకు సదరు బాధిత యువతి అంగీకరిస్తున్నట్లుగా ఆమె సంతకం చేసిన పత్రాన్ని న్యాయవాది సాయిబీ జోస్ కోర్టు ఫేక్ డాక్యూమెంట్స్ సమర్పించినట్లు సమాచారం. దీంతో కోర్టు ఉన్ని కృష్ణన్‌కు ఈ కేసులో స్టే ఆర్టర్ ఇచ్చింది. అయితే తాను ఎలాంటి పత్రాలపై సంతకం చేయలేదని, అవి తప్పుడు పత్రాలని సదరు యువతి కోర్టుకు వాంగ్మూలంతో ఇవ్వడంతో కేరళ హైకోర్టు ఉన్ని కృష్ణన్, సదరు న్యాయవాదిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. -
యశోద షూటింగ్లో సమంత అలా ఉండేది: నటుడు
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించారు. 'జనతా గ్యారేజ్', 'భాగమతి', 'ఖిలాడీ' తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో యశోద విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముకుందన్ మాట్లాడుతూ.. 'తెలుగులో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు 'యశోద'లో సమంతతో కలిసి నటించా. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్. నటుడిగా నా విషయానికి వస్తే... కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే కదా! సమంత చాలా డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సెట్లో ఇతర ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడతారు. అయితే సమంతకు మయోసైటిస్ ఉందన్న విషయం షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. షూటింగ్లో ఆమె చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి బాధగా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ కచ్చితగా మయోసైటిస్‌తో పోరాటం చేసి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు. ప్రస్తుతం మలయాళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాను. 'మాలికాపురం' సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్నాం. తెలుగులో కూడా దానిని విడుదల చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. చదవండి: గీతక్కా, నిన్ను ఏడిపించే రోజు దగ్గర్లోనే ఉంది: ఉడాల్ మామ మాస్ వార్నింగ్ ఆ హీరోతో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయని టబు -
రవితేజ ‘ఖిలాడీ’ మూవీ స్టిల్స్
-
యుద్ధవీరుడిగా మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్ డ్రామా మమాంగం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ ఫస్ట్‌లుక్‌లో మమ్ముట్టి కేరళ సాంప్రదాయ యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. మమాంగం అనే పండుగ సందర్భంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. 17వ శతాబ్దం నాటి కథతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తొలి షెడ్యూల్ సంజీవ్ పిళ్ళై దర్శకత్వం వహించగా తరువాతి షెడ్యూల్ నుంచి ఎం పద్మకుమార్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ప్రాచీ తెహ్లన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలోఉన్ని ముకుందన్, అను సితార, మాళవికా మీనన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
అనుష్క టిప్స్ ఉపయోగపడ్డాయి
అనుష్క టిప్స్ ఉపయోగపడ్డాయి ... అంటున్నారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ‘భాగమతి’లో అనుష్క పక్కన ఉన్ని ముకుందన్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉన్ని నటించబోయే తదుపరి సినిమా ‘చాణక్య తంత్రం’లో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో లేడీ గెటప్ కూడా ఒకటి. ‘‘ఆడవాళ్లు ఎలా నడుస్తారు. వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ ఎలా వేసుకుంటారు? అనే చాలా విషయాల్లో అనుష్క టిప్స్ ఇచ్చారు. ‘భాగమతి’ టైమ్‌లో ఈ క్యారెక్టర్ గురించి అనుష్కతో డిస్కస్ చేశాను. తను చాలా ఇన్పుట్స్ ఇచ్చింది. ఈ లేడీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనుష్క ఇచ్చిన టిప్స్ చాలా ఉపయోగపడ్డాయి’’ అన్నారు ఉన్ని ముకుందన్. -
హిజ్రాగా భాగమతి హీరో
జనతా గ్యారేజ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన మళయాల నటుడు ఉన్ని ముకుందన్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ప్రతినాయకుడిగా నటించిన ఈ యువ నటుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఉన్ని ముకుందన్ లీడ్రోల్లో తెరకెక్కుతున్న మళయాల సినిమా చాణక్య తంత్రం మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ హిజ్రా కరిష్మా పాత్రలో కనిపించనున్నాడు. తాజా కరిష్మా క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌తో పాటు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లేడీ గెటప్ లో కనిపించేందుకు ఉన్ని ముకుందన్ ఎంత కష్టపడ్డాడో ఈ వీడియోలో చూపించారు. మిరాకిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కన్నన్ తామరకుల్లం దర్శకుడు. శివదా, శృతి రామచంద్రన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అనూప్ మీనన్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భాగమతి’
అనుష్క ప్రధాన పాత్రలో పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ భాగమతి. అరుంధతి, రుద్రమదేవి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటిన అనుష్క భాగమతితో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లతో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అనుష్క లీడ్ రోల్ లోనటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, జయరామ్, విద్యుల్లేఖ రామన్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిపబ్లిక్ డే కానుకగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి భాగమతి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అనుష్క జోడిగా మళయాల స్టార్
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్న హీరోయిన్ అనుష్క. బాహుబలి పార్ట్ 2తో పాటు సింగం సిరీస్‌లో వస్తున్న ఎస్ 3 సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటి, మరో లేడి ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్రలోనటిస్తోంది. భాగమతి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క సరసన హీరోగా మళయాల స్టార్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో విలన్‌గా నటిస్తున్న ముకుందన్, మరోసారి తెలుగు సినిమాలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
'జనతా గ్యారేజ్' ఫొటో బయటకు వచ్చింది
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'కు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఫొటోను తన ట్విటర్ పేజీలో పెట్టారు. మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తో తాను కలిసివున్న ఫొటోను ట్వీట్ చేశారు. శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ సినిమాలో మోహన్ లాల్‌కు జోడిగా సుహాసిని నట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్ని ముకుందన్ భార్య పాత్రలో విదిశ కనిపిస్తుందని సమాచారం. విదిశ ఇంతకుముందు అత్తిలి సత్తిబాబు, మా ఇద్దరి మధ్య, దేవరాయ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యమీనన్ నటిస్తున్నారు. కాగా, జనతా గ్యారేజ్ టీమ్ ఇటీవల ముంబై లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. 'నాన్నకు ప్రేమతో' హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో 'జనతా గ్యారేజ్' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.