హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించారు. 'జనతా గ్యారేజ్', 'భాగమతి', 'ఖిలాడీ' తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో యశోద విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ముకుందన్ మాట్లాడుతూ.. 'తెలుగులో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు 'యశోద'లో సమంతతో కలిసి నటించా. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్. నటుడిగా నా విషయానికి వస్తే... కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే కదా! సమంత చాలా డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సెట్‌లో ఇతర ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడతారు.
అయితే సమంతకు మయోసైటిస్ ఉందన్న విషయం షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. షూటింగ్‌లో ఆమె చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి బాధగా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ కచ్చితగా మయోసైటిస్‌తో పోరాటం చేసి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు. ప్రస్తుతం మలయాళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాను. 'మాలికాపురం' సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్నాం. తెలుగులో కూడా దానిని విడుదల చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
చదవండి: గీతక్కా, నిన్ను ఏడిపించే రోజు దగ్గర్లోనే ఉంది: ఉడాల్ మామ మాస్ వార్నింగ్
ఆ హీరోతో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయని టబు
Comments
Please login to add a commentAdd a comment