Unni mukundhan
-
మా సినిమాలు అందుకే ఆడట్లేదు: మలయాళ హీరో
పాన్ ఇండియా ట్రెండ్ వల్ల ఎక్కువ లాభపడింది తెలుగు సినిమానే! బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, హనుమాన్, కల్కి 2898 ఏడీ సినిమాలు సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ అదరగొట్టాయి. కన్నడ మూవీ కేజీఎఫ్ కూడా ఆలిండియా స్థాయిలో అదరగొట్టింది.వెనకబడ్డ మలయాళ మూవీస్అయితే మలయాళ చిత్రాలు (Malayalam Movies) మాత్రం ఆ స్థాయి రేంజ్‌ను అందుకోలేకపోతున్నాయి. అన్ని చోట్లా పెద్ద పెద్ద స్టార్స్‌ను హీరోగా పెట్టి సినిమాల్ని ముందుకు తీసుకువెళ్తే మలయాళంలో మాత్రం కంటెంటే కింగ్ అని, దాని వల్లే కాస్త వెనకబడ్డామంటున్నాడు హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan). హిందీలో మార్కెట్ లేకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుతూ.. మా దగ్గర బడ్జెట్ అనేది ప్రధాన సమస్య. ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే ఆలోచిస్తారు. ఇంతకుముందెవరైనా ఎక్కువ పెట్టుబడితో హిట్ కొట్టారా? అని ఉదాహరణలు వెతుకుతారు.స్క్రిప్ట్, హీరో.. ఇంకా!సినిమా కమర్షియల్‌గా హిట్ కావాలంటే అందులో యాక్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే యాక్షన్ సినిమాల్ని చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడతారు. అలాంటి యాక్షన్ కథా చిత్రాన్ని తీయాలంటే ముందుగా ఒక స్టార్ హీరో కావాలి. అందరూ మెచ్చేటువంటి బలమైన స్క్రిప్ట్ కావాలి. సినిమాను భారీ ఎత్తున నిర్మించే అద్భుతమైన నిర్మాత కావాలి. ఇలా చాలా అంశాలు అనుకూలిస్తేనే అది సాధ్యమవుతుంది అని ఉన్ని ముకుందన్ చెప్పాడు.గతేడాది రూ.700 కోట్ల నష్టం2024లో పలు మలయాళ సినిమాలు సక్సెస్‌ను చూశాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం మలయాళ ఇండస్ట్రీకి నష్టాలే ఎక్కువగా వచ్చాయి. ఈ మేరకు ఓ నివేదికను కేరళ చలనచిత్ర నిర్మాతల మండలి రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. 2024లో 199 మలయాళ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కేవలం 26 మాత్రమే హిట్టయ్యాయి. ఓవరాల్‌గా అన్ని సినిమాలు తెరకెక్కించేందుకు అయిన ఖర్చు రూ.1000 కోట్లు అయితే అందులో రూ.300 కోట్లు మాత్రమే కలెక్షన్ల రూపంలో వెనక్కు వచ్చాయి. ఈ లెక్కన మలయాళ ఇండస్ట్రీ రూ.700 కోట్లు పోగొట్టుకుంది. హిట్ సినిమాల జాబితాలో మంజుమ్మల్ బాయ్స్, ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), ఆవేశం, ప్రేమలు, ఏఆర్ఎమ్, కిష్కింద కాండం, గురువాయూర్ అంబలనడయిల్, వర్షంగళక్కు శేషం సినిమాలున్నాయి.కేరళవాసి.. ఆ సినిమాతో క్లిక్ఉన్ని ముకుందన్ విషయానికి వస్తే.. కేరళలో పుట్టి పెరిగిన ఇతడు సీడన్ (2011) అనే తమిళ సినిమాతో కెరీర్ ఆరంభించాడు. అదే ఏడాది బాంబే మార్చి 12 మూవీతో తన మాతృక భాష మలయాళంలో ఎంట్రీ ఇచ్చాడు. మల్లు సింగ్ మూవీతో సెన్సేషన్ అయిన ఉన్ని.. విక్రమాదిత్య, కేఎల్ 10 పట్టు, స్టైల్, ఒరు మురై వంతు పార్థాయ, అచయన్స్, మాలికాపురం చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు.తెలుగులోనూ..తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఇటీవలే మార్కోతో హిట్ అందుకున్న అతడు గెట్ సెట్ బేబీ అనే సినిమా చేస్తున్నాడు. 2022లో మెప్పడియాన్ మూవీతో ఉత్తమ నిర్మాతగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నాడు. ఈయన చివరగా మార్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వయొలెన్స్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. మూవీకి హిట్ టాక్ రావడంతో దీనికి సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.చదవండి: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్ -
ప్రధాని మోదీతో జనతా గ్యారేజ్ నటుడు భేటీ.. ఎమోషనల్ పోస్ట్
కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కలిశారు. కొచ్చిలో సోమవారం రాత్రి మోదీతో వ్యక్తిగతంగా 45 నిమిషాలపాటు చర్చించారు. చిన్నప్పటి నుంచి మోదీని చూస్తూ పెరిగానని తాజాగా ప్రధానిని కలిసినందుకు తన ఆనందానికి అవధులు లేవని పేర్కొన్నాడు. ఈ మేరకు మోదీతో మాట్లాడిన అనుభూతిని పంచుకుంటూ సోషల్ మీడియాలో నటుడు ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘నా ఫేస్బుక్ అకౌంట్లో ఇదే చాలా పవర్ ఫుల్ పోస్ట్. నా 14 ఏళ్ళ వయసు నుంచి మిమ్మల్నిచూస్తున్నాను. మిమ్మల్ని కలవాలనే కోరిక నేడు నిజమైంది. మీరు నన్ను గుజరాతీ భాషలో ‘కేమ్ చో భైలా’ అని పలకరించడం విని షాక్ అయ్యాను. మిమ్మల్ని కలిసి మీతో గుజరాతీలో మాట్లాడాలనేది నా జీవితంలోని పెద్ద కల. అది నేడు నెరవేరింది. మీతో మాట్లాడిన ఈ 45 నిమిషాలు నా జీవితంలోనే గొప్పవి. మీరు చెప్పిన ప్రతి మాట మర్చిపోలేను. మీరిచ్చిన ప్రతి సలహా ఆచరణలో పెట్టడంతోపాటు అమలు చేస్తాను” అంటూ మోదీతో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. కాగా మలయాళ నటుడైన ఉన్ని ముకుందన్.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత భాగమతి, ఖిలాడీ, యశోద వంటి సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించాడు. అయితే ముకుందన్ మలయాళ నటుడు అయినప్పటికీ అతని బాల్యం అంత గుజరాత్ అహ్మదాబాద్‌లోనే సాగింది. గుజరాత్లో దాదాపు 20 ఏళ్లు ఉన్నారు. అందుకే ముకుందన్‌ను మోదీ గుజరాతీలో పలకరించారు. ఇదిలా ఉండగా ఉన్ని ముకుందన్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మోదీతో భేటీ కావడం ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది. -
గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రిలీజవుతున్న ‘మాలికాపురం’
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. మంచి సినిమాలను ప్రేక్షక్షులను అందించాలనేది ఆయన సంకల్పం. ఆ దిశగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంగా ఆహాను తీసుకువచ్చారు. దీని ద్వారా ఎన్నో కొత్త సినిమాలను, డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులన అందిస్తున్నారు. ఇక థియేటర్లో సైతం ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ల్లో సమర్పిస్తున్నారు. అలా ఇటీవల గీతా ఆర్ట్స్‌లో వచ్చిన కాంతార చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదిరించారో తెలిసిందే. ఇక్కడ ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్. ‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్ లీడ్‌లో రోల్లో తెరకెక్కి మలయాళ చిత్రం మాలికాపురంను జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తన సూపర్‌హీరో అయ్యప్పన్‌ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు. మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో అంటోన్ జోసెఫ్, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. -
Yashoda Movie Review: ‘యశోద’ మూవీ రివ్యూ
టైటిల్: యశోద నటీనటులు: సమంత,వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీదేవి మూవీస్ నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్ దర్శకత్వం: హరి-హరీష్ సంగీతం:మణిశర్మ సినిమాటోగ్రఫర్:ఎం. సుకుమార్ ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్ విడుదల తేది: నవంబర్ 11, 2022 ‘యశోద’ కథేంటంటే.. ఈ సినిమాలో రెండు కథలు సమాంతరంగా నడుస్తుంటాయి. ఒకవైపు ఇండియాకు వచ్చిన హాలీవుడ్ నటి ఒలివియా అనుమానస్పదంగా చనిపోతుంది. అలాగే టాప్ మోడల్ ఆరూషి, ప్రముఖ వ్యాపారవేత్త శివరెడ్డి కారుప్రమాదంలో మరణిస్తారు. ఈ కేసు దర్యాప్తు కోసం మిలటరీ ఆఫీసర్ వాసుదేవ్(సంపత్) టీమ్ రంగంలోకి దిగుతుంది. మరోవైపు పేదింటికి చెందిన యశోద(సమంత) తన చెల్లి ఆపరేషన్ కోసం సరోగసీ(అద్దెగర్భం)ని ఎంచుకుంటుంది. ఆమె కడుపున పుట్టబోయే బిడ్డ కోటీశ్వరుల ఇంటికి వెళ్తుందని..ఆమెను ఆరోగ్యంగా ఉంచేందుకు సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ ‘ఈవా’కి తరలిస్తారు. అక్కడ అందరూ అద్దెగర్భం దాల్చిన వాళ్లే ఉంటారు. వీరి బాగోగులను చూసుకునేందుకు మధు(వరలక్ష్మీ శరత్‌కుమార్), డాక్టర్ గౌతమ్(ఉన్ని ముకుందన్) ఉంటారు. యశోద ‘ఈవా’కి వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అనుమానస్పదంగా మరణించిన హాలీవుడ్ నటి ఓలివియాకి, ఈ సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌కు ఏదైన సంబంధం ఉందా? మోడల్ ఆరూషి నిజంగానే కారుప్రమాదంలో మరణించిందా?లేదా ఎవరైనా హత్య చేశారా? ప్రపంచంలో ధనవంతులైన మహిళలు రహస్యంగా ఇండియా ఎందుకు వస్తున్నారు? ఈ కథలో కేంద్రమంత్రి గిరిధర్ పాత్ర ఏంటి? అసలు యశోద నేపథ్యం ఏంటి అనేది థియేటర్స్‌లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. 'యశోద' ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకద్వయం హరి, హరీష్ ఈ కథను రాసుకున్నారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ట్విస్టులు ఉంటాయి. ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, యాక్షన్..అన్ని ఉంటాయి. కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. థ్రిల్లింగ్ సీన్స్‌ని ప్రేక్షకుడు ఆస్వాదించలోపే.. లాజిక్ లేని సన్నివేశాలు చిరాకు కలిగిస్తాయి. ఈవాలో యశోద చేసే పనులు విలన్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. చూసి చూడనట్లు వదిలేయడం. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఆమె ఈజీగా బయటకు వెళ్లడం.. ఇలా చాలా సీన్లలో లాజిక్ ఉండదు. ఒక థ్రిల్లింగ్ సీన్ తర్వాత మరో ఎమోషనల్ సీన్ అన్నట్లుగా ఫస్టాఫ్ సాగదీతగా సాగుతుంది. ప్రీఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. ఇక సెకండాఫ్ నుంచి వచ్చే ప్రతి సీన్ కొత్తగా ఉంటూ ఉత్కంఠ కలిగిస్తాయి. యశోద నేపథ్యం గురించి చెప్పే సీన్స్ ‘పోకిరి’తరహాలో ఉంటాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ బ్యాక్‌స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. దానిని మరింత డెప్త్‌గా డిజైన్ చేస్తే బాగుండేదేమో. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. సమంత ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సమంతనే. యశోద పాత్రలో నటించడం కంటే జీవించేసిందని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. ఈ సినిమా కోసం సమంత పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక సమంత తర్వాత బాగా పండిన పాత్రలు వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నికృష్ణలది. నెగెటివ్ షేడ్స్ ఉన్న మధు, డాక్టర్ గౌతమ్ పాత్రల్లో ఇద్దరూ పరకాయ ప్రవేశం చేశారు. పోలీసు అధికారిగా శత్రు, మిలటరీ ఆఫీసర్ వాసుదేవ్‌గా సంపత్ చక్కటి నటనను కనబరిచారు. కేంద్రమంత్రి గిరిధర్ పాత్రకి రావురమేశ న్యాయం చేశాడు. కలికా గణేశ్, దివ్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ బాగుంది. పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్ కోసం కాకుండా కథలో భావాన్ని తెలియజేసేలా డైలాగ్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
యశోద షూటింగ్లో సమంత అలా ఉండేది: నటుడు
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించారు. 'జనతా గ్యారేజ్', 'భాగమతి', 'ఖిలాడీ' తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రమిది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో యశోద విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముకుందన్ మాట్లాడుతూ.. 'తెలుగులో ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాను. ఇప్పుడు 'యశోద'లో సమంతతో కలిసి నటించా. ఆమె చాలా టాలెంటెడ్ యాక్టర్. నటుడిగా నా విషయానికి వస్తే... కథ ఎలా ఉంది? అందులో నా పాత్ర ఏమిటి? అని చూస్తాను. ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అనేది ఆలోచిస్తా. నటుడిగా కొత్తదనం చూపించడం కూడా ముఖ్యమే కదా! సమంత చాలా డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. తన పాత్ర కోసం ఆవిడ చాలా ప్రిపేర్ అయ్యారు. ఫైట్స్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. సెట్లో ఇతర ఆర్టిస్టులతో సరదాగా మాట్లాడతారు. అయితే సమంతకు మయోసైటిస్ ఉందన్న విషయం షూటింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు. షూటింగ్లో ఆమె చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. ఎప్పుడూ తాను అటువంటి వ్యాధితో పోరాటం చేస్తున్నాని చెప్పలేదు. సమంత పోస్ట్ చూసి బాధగా ఫీలయ్యాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా ఆవిడ కచ్చితగా మయోసైటిస్‌తో పోరాటం చేసి పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు. ప్రస్తుతం మలయాళంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నాను. 'మాలికాపురం' సినిమా పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్నాం. తెలుగులో కూడా దానిని విడుదల చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. చదవండి: గీతక్కా, నిన్ను ఏడిపించే రోజు దగ్గర్లోనే ఉంది: ఉడాల్ మామ మాస్ వార్నింగ్ ఆ హీరోతో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయని టబు -
11 మంది ఫ్రెండ్స్ సరదాగా ఆడిన ఆట ఒకరి ప్రాణం తీస్తే.. '12th మ్యాన్' రివ్యూ
టైటిల్: 12th మ్యాన్ (మలయాళం) నటీనటులు: మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్, లియోనా లిషాయ్ తదితరులు కథ: కెఆర్. కృష్ణ కుమార్ దర్శకుడు: జీతూ జోసేఫ్ సంగీతం: అనిల్ జాన్సన్ సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ నిర్మాత: ఆంటోనీ పెరుంబవూరు విడుదల తేది: మే 20, 2022, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలక్షణ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '12th మ్యాన్'. దృశ్యం, దృశ్యం 2 సినిమాల డైరెక్టర్ జీతూ జోసేఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-జీతూ జేసేఫ్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చింది ఈ చిత్రం. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. అదేకాకుండా ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచెలా ఉంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మే 20) నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన '12th మ్యాన్' (12th Man Movie) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 11 మంది స్నేహితులు తమ ఫ్రెండ్ సిద్ధార్థ్ (అను మోహన్) బ్యాచ్‌లర్ పార్టీకి వారి భార్యలతో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్తారు. ఈ 11 మందిలో ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటతో (ఇద్దరు) పాటు నలుగురు దంపతులు (8 మంది), ఒక పెళ్లి అయి భర్తతో సెపరేట్ అయిన మహిళ ఉంటారు. వీరందరు కలిసి బ్యాచ్‌లర్ పార్టీ బాగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. పార్టీలో భాగంగా మొబైల్ ఫోన్స్‌తో ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ కాస్తా వారిలోని రహస్యాలను బయటపెడుతుంది. దీంతో ఆ సముహాంలో ఒక అనుమానం, గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆ 11 మందిలో మాథ్యూ (సైజు కురూప్) భార్య షైనీ (అనుశ్రీ) అనుమానస్పదంగా చనిపోతుంది. షైనీ ఎలా చనిపోయింది ? హత్యా ? ఆత్మహత్య ? వారికి ఎదురైన అనుమానం ఏంటీ ? ఆ 11 మందితో కలుస్తానన్న 12వ మనిషి చంద్రశేఖర్ (మోహన్ లాల్) ఎవరు ? అనేది తెలియాలంటే '12th మ్యాన్' మూవీ చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. దృశ్యం సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ జీతూ జోసేఫ్ మళ్లీ అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎలా సస్పెన్సింగ్‌గా చూపెట్టాలో బాగా తెలిసిన దర్శకుడు జీతూ. ఈ మూవీని ఆద్యంతం థ్రిల్లింగ్, సస్పెన్సింగ్‌గా చూపెట్టడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు. 11 మంది పాత్రల పరిచయంతో ప్రారంభమైన సినిమా తాగుబోతుగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్‌తో ఆసక్తిగా మారుతుంది. బ్యాచ్‌లర్ పార్టీలో మొబైల్ ఫోన్స్ గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో బ్యాచ్‌లర్ పార్టీ ఇస్తున్న సిద్ధార్థ్‌కు వచ్చిన ఫోన్ కాల్‌తో తన రహస్యం ఒకటి బయటపడుతుంది. దీంతో ఆ ఫ్రెండ్స్ మధ్య ఒక గందరగోళం, అనుమానం ఏర్పడుతుంది. ఇంతలో వారి ఫ్రెండ్ భార్య షైనీ చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ మోహన్ లాల్ గురించి ఒక విషయం రివీల్ అవుతుంది. అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తప్ప మూవీలో మరే ట్విస్ట్‌లు ఏం లేకపోయినా ఒక్కొక్కరు తమ హిడెన్ సీక్రెట్స్ (నిజాలను) బయటపెట్టడం ఆద్యంతం ఉత్కంఠంగా, ఆసక్తిరకంగా ఉంటుంది. సినిమా రన్ టైమ్ కొంచెం ఎక్కువగానే 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. షైనీది హత్య ? ఆత్మహత్య ? అనేది చివరి వరకు తేలేదాకా ఎంతో గ్రిప్పింగ్‌గా నారేట్ చేశారు. దృశ్యం, దృశ్యం 2 తరహాలో స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. సస్పెన్స్‌ను క్రియేట్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా కుదిరింది. ఎవరెలా చేశారంటే ? తాగుబోతుగా, మరొక రోల్లో మోహన్ లాల్ అదరగొట్టారు. ఆయన ఆక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేనేలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన వారంతా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారనే చెప్పవచ్చు. సినిమాకు కథ, కథనం పాత్రల నటన, బీజీఎం, సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. సినిమా కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా తరెకెక్కించారు డైరెక్టర్ జీతూ. అప్పుడేల ఒక నిజం చెప్పడం.. అంతలోనే అది అబద్ధం అని తేలడం ఎంతో థ్రిల్లింగ్‌గా డైరెక్ట్ చేశారనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'దృశ్యం' సిరీస్‌లా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే '12th మ్యాన్' సినిమాను కచ్చితంగా ట్రై చేయాల్సిందే. -
హనీమూన్‌కి వెళితే..
‘జనతా గ్యారేజ్, భాగమతి’ చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితులయ్యారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. తాజాగా ఆయన నటించిన మలయాళ చిత్రం ‘చాణక్య తంతరమ్’. శివదా నాయర్ కథానాయికగా నటించారు. కణ్ణన్ తమెరక్కులమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘అశోక ది గ్రేట్’ పేరుతో కెవీఎస్ మూవీస్ పతాకంపై కల్లూరు శేఖర్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. హనీమూన్ కోసం అడవికి వెళ్లిన ఓ జంట తప్పిపోతారు. నలుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి, చంపేస్తారు. వారిపై భర్త ఎలా పగ తీర్చుకున్నాడు? ఉన్నత కుటుంబాలకు చెందిన ఆ యువకుల్లో ఒక్కొక్కర్ని చాకచక్యంగా ఎలా అంతం చేశాడన్నదే కథ. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ మల్ల యుద్ధం, కత్తి యుద్ధం మాస్ట ర్గా కనిపిస్తారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కల్లూరు వెంకట సుబ్బయ్య, సంగీతం: రమేష్ పిషరోడి. -
అనుష్క ‘భాగమతి’ టీజర్
బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క, త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పిల్లజమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. స్వీటీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రయూనిట్ భాగమతి టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ పాత కాలం బంగ్లాలోకి అనుష్క ప్రవేశించటం తరువాత తన చేతికి తానే సుత్తితో మేకు కొట్టుకోవటం లాంటి షాట్స్ తో టీజర్ ను కట్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫి మది విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క ‘భాగమతి’ టీజర్ విడుదల -
అనుష్క ‘భాగమతి’ టీజర్ విడుదల
-
బుద్ధి చెప్పాడు!
ఫుల్‌గా ఎంక్వైరీ చేశాడు. క్రిమినల్స్ చిట్టా పట్టాడు. కానీ చట్టంలో ఉన్న లొసుగులతో కొందరు శిక్ష నుంచి తప్పించుకోవాల నుకున్నారు. అప్పుడా పవర్ఫుల్ పోలీసాఫీసర్ తన బుద్ధిబలానికి పని చెప్పి వారికి ఎలా శిక్ష వేయించాడు? అతను ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్లు ఏంటి? ఇలాంటి కథాంశంతో మలయాళంలో ‘మాస్టర్ పీస్’ అనే చిత్రం రూపొందిందని సమాచారం. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇందులో వరలక్ష్మీ, మమ్ముట్టి పోలీసాఫీసర్లుగా నటించారని మాలీవుడ్ టాక్. ‘‘మమ్ముట్టి సార్, వాసుదేవ్లతో నటించడం ఎగై్జటింగ్‌గా ఉంది. చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సంగతి ఇలా ఉంచితే.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళంలో రూపొందనున్న ‘తుపాకీ మునై’ చిత్రంలో ఆమె కీ రోల్ చేయనున్నారు. ఇంతకీ.. ఈ వరలక్ష్మి అంటే ఎవరో కాదు.. నటుడు శరత్‌కుమార్ తనయ. -
భాగమతి కమింగ్
డిసెంబర్లో రిలీజ్ చేస్తారా? గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయట కదా.. డిసెంబర్లో కష్టం. సంక్రాంతికి రేస్‌లో ఉంటుందేమో? ఊహూ.. సమ్మర్‌కి వస్తుందేమో? – ఇదిగో ఇలాంటి చర్చలే ‘భాగమతి’ సినిమా రిలీజ్ గురించి ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. ఆ చర్చలకు ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే... ‘భాగమతి’ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క ముఖ్యపాత్రలో రూపొందుతున్న సినిమా ‘భాగమతి’. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆషా శరత్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘సూపర్‌ఫామ్‌లో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భాగమతి’ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్‌కి వచ్చిన స్పందన చిత్రబృందానికి మంచి ఎనర్జీ ఇచ్చింది. దర్శకుడు అశోక్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క నటన సినిమాకు హైలైట్. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. తమన్ సంగీతం సూపర్. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
జనతా గ్యారేజ్‌లో మరో మళయాలి
నాన్నకు ప్రేమతో సక్సెస్‌తో సూపర్ ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమా జనతా గ్యారేజ్. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్లను తిరగరాసిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ స్టార్ కాస్ట్‌ను సెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓ కీలకపాత్రకు మోహన్ లాల్ సంప్రదించారు. ఈసినిమాలో నటించడానికి తెలుగు కూడా నేర్చుకుంటున్నట్టుగా తెలిపాడు మళయాలి సూపర్ స్టార్. హీరోయిన్గా మళయాలి ముద్దుగుమ్మ నిత్యమీనన్‌ను ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. వీరితో పాటు మరో మళయాలి స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. ఇప్పుడు మరో మళయాల యువ నటుడు ఉన్ని ముకుందన్‌ను ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంపిక చేశారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. మరి ఫహాద్ ఫాజిల్‌ను అనుకున్న పాత్రకే ఉన్ని ముకుందన్‌ను తీసుకున్నారా.. లేక మరో పాత్రకా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే జనతా గ్యారేజ్‌లో తాను నటిస్తున్నట్టుగా ఉన్నిముకుందన్ స్వయంగా ప్రకటించటంతో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌లో మరో మళయాలి స్టార్ వచ్చి చేరినట్టుగా కన్ఫామ్ అయ్యింది.