
ఫుల్‌గా ఎంక్వైరీ చేశాడు. క్రిమినల్స్ చిట్టా పట్టాడు. కానీ చట్టంలో ఉన్న లొసుగులతో కొందరు శిక్ష నుంచి తప్పించుకోవాల నుకున్నారు. అప్పుడా పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ తన బుద్ధిబలానికి పని చెప్పి వారికి ఎలా శిక్ష వేయించాడు? అతను ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్లు ఏంటి? ఇలాంటి కథాంశంతో మలయాళంలో ‘మాస్టర్ పీస్’ అనే చిత్రం రూపొందిందని సమాచారం. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇందులో వరలక్ష్మీ, మమ్ముట్టి పోలీసాఫీసర్లుగా నటించారని మాలీవుడ్ టాక్. ‘‘మమ్ముట్టి సార్, వాసుదేవ్‌లతో నటించడం ఎగై్జటింగ్‌గా ఉంది. చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సంగతి ఇలా ఉంచితే.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళంలో రూపొందనున్న ‘తుపాకీ మునై’ చిత్రంలో ఆమె కీ రోల్ చేయనున్నారు. ఇంతకీ.. ఈ వరలక్ష్మి అంటే ఎవరో కాదు.. నటుడు శరత్‌కుమార్ తనయ.
Comments
Please login to add a commentAdd a comment