గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ద్వారా రిలీజవుతున్న ‘మాలికాపురం’ | Geetha Arts Releases Unni Mukundan Malkapuram In Telugu This Sankranti | Sakshi
Sakshi News home page

Geetha Arts Banner: డబ్బింగ్‌ చిత్రం ‘మాలికాపురం’ రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Thu, Jan 12 2023 5:51 PM | Last Updated on Thu, Jan 12 2023 8:00 PM

Geetha Arts Releases Unni Mukundan Malkapuram In Telugu This Sankranti - Sakshi

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ నుంచి మరో డబ్బింగ్‌ చిత్రం రాబోతోంది. టాలీవుడ్‌ అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్‌ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. మంచి సినిమాలను ప్రేక్షక్షులను అందించాలనేది ఆయన సంకల్పం. ఆ దిశగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంగా ఆహాను తీసుకువచ్చారు. దీని ద్వారా ఎన్నో కొత్త సినిమాలను, డబ్బింగ్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులన అందిస్తున్నారు.

ఇక థియేటర్లో సైతం ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్‌ చేసి గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ల్లో సమర్పిస్తున్నారు. అలా ఇటీవల గీతా ఆర్ట్స్‌లో వచ్చిన కాంతార చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదిరించారో తెలిసిందే. ఇక్కడ ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌. ‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్‌ లీడ్‌లో రోల్లో తెరకెక్కి మలయాళ చిత్రం మాలికాపురంను జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

తన సూపర్‌హీరో అయ్యప్పన్‌ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు. మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ  బ్యానర్లో అంటోన్‌ జోసెఫ్‌, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement