Geetha Arts Banner
-
‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ రివ్యూ
టైటిల్: వినరో భాగ్యము విష్ణు కథ నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశ, మురళీ శర్మ,ప్రవీణ్ తదితరులు నిర్మాణ సంస్థ: జీఏ2 పిక్చర్స్ నిర్మాత: బన్నీ వాసు సమర్పణ: అల్లు అరవింద్ దర్శకత్వం: మురళీ కిశోర్ అబ్బూరు సంగీతం: చైతన్ భరద్వాజ్ ఎడిటర్: మార్తండ్ కె వెంకటేశ్ విడుదల తేది: ఫిబ్రవరి 18, 2023 యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘వినరో..’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచాల మధ్య మహా శివరాత్రి సందర్భంగా శనివారం (ఫిబ్రవరి 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. తిరుపతికి చెందిన విష్ణు(కిరణ్ అబ్బవరం)ఓ లైబ్రేరియన్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత(శుభలేఖ సుధాకర్) పెంపకంలో పెరుగుతాడు.పొరుగు వాళ్లకు చేతనైనంత సహాయం చేసే విష్ణు జీవితంలోకి నైబర్ నంబర్ అనే కాన్సెప్ట్‌తో దర్శన (కాశ్మీర పరదేశి) ప్రవేశిస్తుంది. ఆమె ఒక యూట్యూబర్. ట్రెండింగ్ వీడియోలు చేసి సెలెబ్రిటీ అయిపోవాలనుకుంటుంది. అందులో భాగంగా నైబర్ నంబర కాన్సెప్ట్‌తో వీడియో చేయాలనుకుంటుంది. తన ముబైల్ నంబర్లోని చివరి అంకెకు అటు, ఇటు ఉండే నంబర్లతో ఫోన్ చేయగా..ఒకవైపు విష్ణు, మరోవైపు శర్మ(మురళీ శర్మ) పరిచయం అవుతారు. వీరిద్దరితో కలిసి వీడియోలు చేసే క్రమంలో విష్ణు, దర్శన ప్రేమలో పడతారు. కట్ చేస్తే.. ఒక రోజు శర్మను తుపాకీతో కాల్చి చంపుతుంది దర్శన.అసలు శర్మను దర్శన ఎందుకు చంపింది? నిజంగానే అతను మరణించాడా? శర్మ నేపథ్యం ఏంటి? మంత్రి పదవి కోసం కుట్రలు చేస్తున్న ఓ ఎమ్మెల్యే('కె.జి.యఫ్' లక్కీ)కి, శర్మకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జైలుకు వెళితే విష్ణు ఏం చేశాడు? నిందితులను పట్టుకోవడానికి నైబర్ నంబర్ కాస్పెప్ట్ ఎలా ఉపయోగపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మన మొబైల్ నంబర్ నుంచి పక్క నంబర్‌కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది? వారెవరు..ఎక్కడ ఉంటారో..ఎం చేస్తారో తెలియదు. కానీ ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేస్తే.. వినడానికే కొత్తగా, గమ్మత్తుగా ఉంది కదా. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. దర్శకుడు మురళీ కిశోర్ చాలా కొత్త పాయింట్‌ని ఎంచుకొని అంతే కొత్తగా తెరపై చూపించాడు. కొన్ని సీన్లు సినిమాటిక్‌గా ఉన్నా.. ఫ్లోలో ఓకే అనిపిస్తాయి. ఎన్ఐఏ అధికారులు ఓ టెర్రరిస్టు గ్రూప్‌ని పట్టుకోవడం కోసం ప్రయత్నించడం..వారు పారిపోయి ఒకచోట దాక్కోవడం..వారి దగ్గరకు హీరో వెళ్లడం..ఇలా సినిమా ప్రారంభమే సీరియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికీ సినిమా అంతా లవ్‌స్టోరీగా మారిపోతుంది. నైబర్ నెంబర్ కాన్సెప్ట్‌తో హీరో హీరోయిన్లు కలిసిన తర్వాత వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మురళీ శర్మ హీరోయిన్‌తో కలిసి వేసే స్టెప్పులు..వారిద్దరి రిలేషన్‌పై హీరో వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇలా ఒకవైపు సినిమాను సరదాగా నడిపిస్తూ..మరోవైపు శర్మను హత్య చేయడానికి ఎమ్మెల్యే మనుషులు ప్రయత్నించడం..హీరోయిన్ పాత్రపై అనుమానం కలిగిస్తూ ప్రేక్షకులు అయోమయానికి గురైయ్యేలా చేశాడు దర్శకుడు. అసలు శర్మ ఎవరు? అతన్ని ఎమ్మెల్యే మనుషులు ఎందుకు చంపాలనుకుంటున్నారు? అనేది చివరి వరకు చెప్పకుండా క్యూరియాసిటీని పెంచేశాడు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా, కాస్త సిల్లీగా సాగుతుంది. నైబర్ కాన్సెప్ట్ విదేశాల వరకు చేరి అక్కడ నిందితుడిని పట్టుకోవడం..అనేది కాస్త సినిమాటిక్ అనిపించినా..చివర్లో దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభం కూడా ఓవర్‌గా అనిపించినా..క్లైమాక్స్‌లో వచ్చే టిస్ట్తో అది కూడా ఓకే అనిపిస్తుంది.‘వినరో భాగ్యము విష్ణు కథ’ స్టోరీ టైటిల్ అంత పెద్దది కాకపోయినా..ప్రేక్షకులను మాత్రం అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. లైబ్రేరియన్ విష్ణు పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. పక్కింటి మంచి కుర్రాడిలా చక్కగా నటించాడు.అయితే కిరణ్ ఈ తరహా పాత్ర చేయడం కొత్తేమి కాదు.గత సినిమాలలో మాదిరిదే ఇందులో కూడా సాదాసీదాగా కనిపిస్తాడు.ఎమోషనల్ సీన్స్ బాగానే చేశాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుంటుందేమో. దర్శనగా కాశ్మీర పరదేశీ మెప్పించింది. తెరపై అందంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఆయన పాత్ర ఉంటుంది. ఆయన నటన..వేసిన స్టెప్పులు ప్రతీది నవ్విస్తుంది. హీరో తాతగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిదండ్రులుగా దేవీ ప్రసాద్, ఆమని.. టెర్రరిస్ట్ రాజన్‌గా శరత్ లోహితన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్ భరద్వాజ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. కొన్ని చోట్ల కథ కంటే నేపథ్య సంగీతమే గుర్తుండిపోతాయి. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ల పనితీరు బాగుంది.డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. కానీ కంటెంట్‌తో సంబంధం లేకుండా అవసరానికి మించిన డైలాగ్స్ హీరో చేత చెప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. జీఏ2 పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా రిలీజవుతున్న ‘మాలికాపురం’
గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి మరో డబ్బింగ్ చిత్రం రాబోతోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. మంచి సినిమాలను ప్రేక్షక్షులను అందించాలనేది ఆయన సంకల్పం. ఆ దిశగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాంగా ఆహాను తీసుకువచ్చారు. దీని ద్వారా ఎన్నో కొత్త సినిమాలను, డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులన అందిస్తున్నారు. ఇక థియేటర్లో సైతం ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ల్లో సమర్పిస్తున్నారు. అలా ఇటీవల గీతా ఆర్ట్స్‌లో వచ్చిన కాంతార చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఆదిరించారో తెలిసిందే. ఇక్కడ ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే తరహాలో మలయాళ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్. ‘భాగమతి’ ఫేం ఉన్ని ముకుందన్ లీడ్‌లో రోల్లో తెరకెక్కి మలయాళ చిత్రం మాలికాపురంను జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తన సూపర్‌హీరో అయ్యప్పన్‌ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు. మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. యాన్ మెగా మీడియా, కావ్య ఫిల్మ్ కంపెనీ బ్యానర్లో అంటోన్ జోసెఫ్, వేణు కున్నపిల్లి సంయుక్తంగా నిర్మించారు. -
వినరో భాగ్యము విష్ణు కథ.. ఫ్యాన్స్‌కు బంపరాఫర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు గతేడాది పెద్దగా కలిసి రాలేదు. తను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస దగ్గర పత్తా లేకుండా పోయాయి. ప్రస్తుతం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వాసవ సుహాస సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండటంతో పాటు సినిమాకు మంచి హైప్నిచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ముఖ్యమైన అప్డేట్ రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ బ్యానర్. వినరో భాగ్యము విష్ణు కథ టీజర్‌ను జనవరి 9న ఉదయం 10.15 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఈ చిత్రం ఏ జానర్‌కు చెందిందో కరెక్ట్‌గా గెస్ చేస్తే వారితోనే టీజర్ రిలీజ్ చేయిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరింకే.. మీరూ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. Guess the genre, & you will be releasing the official teaser ✨ Drop your comments on below link 👇https://t.co/pmKEMeROM9#VBVKTeaser on Jan 9th @ 10:15 AM#VinaroBhagyamuVishnuKatha ✨ #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram A @chaitanmusic @kashmira_9 @KishoreAbburu pic.twitter.com/B1CBrfp1CY — GA2 Pictures (@GA2Official) January 5, 2023 చదవండి: -
గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఎదుట అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నా
-
‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం 'భేధియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేదియా'. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది. ఇటీవల గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ‘కాంతార’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. -
త్వరలో 'కాంతార' హీరో రిషబ్ శెట్టితో సినిమా: అల్లు అరవింద్
ఓటీటీల వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదు అనేదాంట్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించాయి పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కార్తికేయ 2 సినిమాలు. కంటెంట్ ఉంటే చాలు కేవలం మౌత్ టాక్‌తోనే జనాలను థియేటర్స్‌కు రప్పించవచ్చని నిరూపించింది కాంతార. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో దీన్ని రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతున్న తరుణంలో బుధవారం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'సినిమాకు భాషా సరిహద్దులు లేవు, ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం రుజువు చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ. ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో విష్ణు తత్వం, రౌద్ర రూపం చూశాక ఇది సింహాచలంకి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఇందులో హీరో ఎంత గొప్పగా చేశాడో మీరు చూశారు. అతను ఫీల్ అయ్యి చేయడం వల్ల ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాధ్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్‌ను రికార్డ్ చేసి మ్యూజిక్‌తో పాటు వదిలారు. ఈ సినిమాను కన్నడలో చూసిన బన్నీ వాసు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అన్నాడు. ఏంటి, బన్నీ వాసు ఇంత ఎగ్జైట్మెంట్గా చెబుతున్నాడు అనుకున్నాను. సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యి దీన్ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించి తెలుగులో రిలీజ్ చేశాం. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టిని అడిగాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు' అని చెప్పాడు అల్లు అరవింద్. చదవండి: సర్దార్లో అన్ని గెటప్సా? సూర్యను దాటేస్తాడా? బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కాంతా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో గీత ఎవరో చెప్పేసిన అల్లు అరవింద్
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలో గీత ఆర్ట్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. చెప్పాలంటే ఈ నిర్మాణ సంస్థకు పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ బ్యానర్లో సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగిపోతాయి. కొత్త నటినటులు ఉన్నప్పటికి ఈ బ్యానర్లో వచ్చే సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితే ఏ నిర్మాణ సంస్థకు అయిన వారివారి కూతుళ్ల పేర్లులేదా భార్య పేరు, ఇంటి పేరు ఉంటుంది. కానీ, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ ‘గీత ఆర్ట్స్’లో గీత అనేది ఎవరు పేరు అనేది ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే ఈ పేరుతో అల్లు కుటుంబంలో ఎవరు లేకపోవడమే! చదవండి: బిగ్‌బాస్ 6: గీతూ రాయల్ భర్త ఎవరు, ఏం చేస్తుంటాడో తెలుసా? తాజాగా గీత ఆర్ట్స్‌లో గీత అంటే ఎవరో రివీల్ చేశారు సంస్థ అధినేత అల్లు అరవింద్. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న ఆయనకు గీత ఆర్ట్స్‌లో.. గీత అంటే ఎవరనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘గీత’ అనేది నా గర్ల్ ఫ్రెండ్ అనే డౌటు చాలామందిలో ఉంది. అది నిజమే. నాకు గీత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరునే మా నిర్మాణ సంస్థకు పెట్టానని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అందులో నిజం లేదు. నా గర్ల్‌ఫ్రెండ్ పేరు గీత అనేది నిజం, మా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ అని పెట్టడం నిజం. కానీ ఈ రెండూ వేరు వేరు సందర్భాలు. అయితే నా స్నేహితులు ఈ రెండింటిని కలిపేసి నన్ను ఆటపట్టిస్తుంటారు‘’ అని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం తమ బ్యానర్‌కు గీత ఆర్ట్స్ పెట్టడం వెనక అసలు కారణమేంటో ఆయన వివరించారు. చదవండి: పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్ ‘‘నిజానికి ‘గీత ఆర్ట్స్’ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను పెడదామనే ఒక ప్రపోజల్‌ను పెట్టింది మా నాన్నగారు (అల్లు రామలింగయ్య). భగవద్గీత బోధన ప్రకారం.. ప్రయత్నం మాత్రమే మనది .. ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం. అది సినిమాలకు కరెక్టుగా సరిపోతుంది. నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే.. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంటుంది. ‘గీత’లో చెప్పినట్లుగా సినిమా నిర్మాణ వ్యవహారాలు ఉండటంతో ‘గీత ఆర్ట్స్’ అని పెడదామని నాన్నగారు అనడం.. అదే ఫైనల్ కావడం జరిగిపోయింది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. మరి పెళ్లి తర్వాత అయినా ఈ పేరు నిర్మల ఆర్ట్స్ అని మార్చొచ్చు కదా అని హోస్ట్ అడగడంతో అప్పటికే ఈ బ్యానర్ నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయని, అందుకే మార్చడం ఎందుకని వదిలేశామని నవ్వుతూ సమాధానం ఇచ్చారు అల్లు అరవింద్. -
తెలుగులోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతారా’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెలుగులోకి కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతారా’, ఆసక్తిగా ట్రైలర్
కన్నడ దర్శక-నటుడు, రచయిత రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతారా’. ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 30న రిలీజైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ‘కాంతారా’ సినిమాను ఇతర భాషల్లోకి కూడా అనువదించి, రిలీజ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ అధినేత అల్లు అరవింద్ ‘కాంతారా’ తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్నారు. చదవండి: మనోజ్ సెకండ్ మ్యారేజ్‌పై మంచు లక్ష్మి షాకింగ్ రియాక్షన్ కాగా గీతా ఫిలింస్ బ్యానర్ ద్వారా తెలుగులో ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడట. అతను ఏదో ఒక రాయి కోసం విశాలమైన భూమిని తన ఊరివాళ్లకు ఇచ్చేశాడట’, ‘ధైర్యం.. ధైర్యం ఉండేది నీలో ఉన్న ఆవేశంలోనే.. కానీ నీలో ఉన్న ఆవేశం నీకు శత్రువు కాకూడదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
అల్లు శిరీష్ క్రేజీ అప్డేట్.. కొత్త సినిమా టీజర్ ఆరోజే..!
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్రబృందం. ఈ మూవీకి 'ఊర్వశివో రాక్షసివో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టీజర్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. (చదవండి: అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్) టైటిల్ పోస్టర్లో అల్లు శిరీష్ – అను ఇమ్మానియేల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం రొమాంటిక్ కథ అని తెలుస్తోంది. నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. తాజాగా ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. The teaser of our film #UrvasivoRakshasivo will be out on the 29th September (Thursday). Cant wait to share it with you :) pic.twitter.com/lR938fFE4i — Allu Sirish (@AlluSirish) September 26, 2022 -
'నేనే వస్తున్నా' రిలీజ్ డేట్ ఫిక్స్.. సినిమాపై భారీ అంచనాలు
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'నానే వరువెన్'. తెలుగులో ఈ సినిమాను 'నేనే వస్తున్నా' అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 29న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించారు. (చదవండి: గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేనే వస్తున్నా చిత్రం) ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తెలుగులో చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ధనుష్‌కు తెలుగులో కూడా అభిమానుల ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కాదల్ కొండేన్', 'పుదుపేట్టై', 'మయక్కం ఎన్న' సినిమాల తర్వాత ధనుష్, సెల్వ రాఘవన్ కాంబినేషన్లో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగింది. తమిళంలో వి క్రియేషన్స్ బ్యానర్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ నిర్మించగా.. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో ధనుశ్ ‘నేనే వస్తున్నా’ చిత్రం
తమిళ స్టార్ హీరో ధనుశ్ తాజా చిత్రం ‘నానే వరువేన్’. ధనుశ్ సోదరుడు, డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో నేనే వస్తున్నా పేరుతో విడుదల చేస్తున్నారు. చదవండి: రణ్వీర్ చెంప చెల్లుమనిపించిన బాడిగార్డ్! అసలేం జరిగిందంటే.. అయితే ఈ సినిమాను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి కలై పులి ఎస్ తను ఈ సినిమాను సమర్నిస్తున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. తాజాగా నిర్మాత కలై పులి గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా నేను వస్తున్నా పోస్టర్ రిలీజ్ చేశారు. అనంతరం నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెలలో(సెప్టెంబర్) విడుదల చేస్తామని, త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు. కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
నిర్మాతలకు చుక్కలు చూపించిన రష్మిక మందన్నా!
Actress Rashmika Demands Rs 3 Cr from Geetha Arts: కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ బ్యూటీ గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాన్ ఇండియా క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఫాలో అవుతున్నట్లుంది.అందుకే పుష్ప సక్సెస్ తర్వాత నిర్మాతల నుంచి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా ఉమెన్ సెంట్రిక్ మూవీ కోసం గీతా ఆర్ట్స్ బ్యానర్ సంప్రదించినప్పుడు, రష్మిక జీఎస్టీతో కలిపి రూ. 3కోట్ల వరకు డిమాండ్ చేసిందట. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ పుష్ప సెకండ్ పార్ట్‌కి 3కోట్లకు పైగా పారితోషికం డిమాండ్ చేసినట్లు టాక్. -
Mahesh Babu: గీతా ఆర్ట్స్ బ్యానర్లో మహేష్ బాబు సినిమా!
సర్కారు వారి పాటతో పాటు మరో మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. వీటిలో రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలు కూడా ఉన్నాయి. నవంబర్ నాటికి సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడు మహేష్. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సూపర్ స్టార్ మరో సినిమా కూడా కమిటైనట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ బాబు సినిమా ఉండబోతుందని తాజా సమాచారం. సరిలేరు నీకెవ్వరుతో మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆ చిత్రం ఉండనుందని తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా మహేష్ బాబు సినిమా అంటే కచ్చితంగా అంచనాలు మరోలా ఉంటాయి. అయితే ఈ ప్రాజక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
గీతా ఆర్ట్స్ బ్యానర్లో రాహుల్ సినిమా!
'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్..తొలి సినిమాకే నేషనల్ అవార్డు వరించింది. దీంతో రెండో సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మన్మథుడు వంటి క్లాసిక్ హిట్‌కు సీక్వెల్‌గా తీసిన మన్మథుడు-2 బాక్స్‌ఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్..ఈ మధ్యకాలంలో ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నాడట. లవ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కనన్ను ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బన్నీ వాసుకు కథ నచ్చడంతో ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అయితే హీరో హీరోయిన్లు ఎవరు అన్నదానికపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా అన్నపూర్ణ బ్యానర్‌లోనూ మరో మూవీ చేసే అవకాశాన్ని కూడా రాహుల్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా రాహుల్ హీరోగా నటిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కిచెన్ తమిళ రీమేక్‌లో రాహుల్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించనుంది. చదవండి : మలయాళ డెబ్యూ కోసం కసరత్తులు చేస్తోన్న ఈషా Rahul Sipligunj: సర్ప్రైజ్ లవ్ అనౌన్స్మెంట్ -
ఖరీదైన కారు కొన్న యువ నటుడు
తాను నటించిన సినిమా విజయవంతం కావడంతో తనకు తానే బహుమతి ఇచ్చుకున్నట్లు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ చెప్పాడు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొన్న రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లాక్డౌన్ వలన కారు కొనడం ఆలస్యమైందని తెలిపాడు. ఈ కారు విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ‘హ్యాపీడేస్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి వచ్చిన నిఖిల్ ఆ తర్వాత ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందాడు. గతేడాది ‘అర్జున్ సురవరం’ సినిమా విడుదలై విజయవంతమవడంతో ఈ కారు కొన్నట్లు తెలిపారు. కరోనా వలన కారు కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నాడు. దీంతోపాటు గతేడాది తన ప్రేయసిని పెళ్లాడాడు. ప్రస్తుతం వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమాలపరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ- 2, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ‘18 పేజెస్’ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
అవకాశాలు అంత తేలికకాదు..
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సెలబ్రిటీలకు సవాల్ విసురుతున్నారు. ప్రముఖుల పేర్లు, వివరాలు, ఫొటోలు వినియోగిస్తూ యువతులకు వలవేస్తున్నారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయి. ఇలాంటి నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు నిర్ధారించుకోనిదే వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంపిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెలబ్రెటీలకు సంబంధించి నమోదైన మూడు కేసుల్లో ఒక కేసులో నిందితుడిని పట్టుకున్న అధికారులు మిగిలిన కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ దేవరకొండగా పేరుతో.. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తాను ఆయన పర్సనల్ మేనేజర్‌ను అని, ఆయన్ను కలవాలంటే సంప్రదించాలంటూ ఓ ఫోన్ నంబర్ పొందుపరిచాడు. విజయ్ దేవరకొండ గొంతును అనుకరించగలగటం కూడా ఈ యువకుడికి కలిసి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అతను పలువురు యువతులతో విజయ్ దేవరకొండ మాదిరిగా మాట్లాడాడు. ఎవరైనా కలవాలని కోరితే... తనను కాదని, మొదట తన డబ్బింగ్ ఆర్టిస్టును కలవాలంటూ తనకు సంబంధించిన మరో నంబర్ ఇచ్చేవాడు. దీనికి కాల్ చేసిన వారితోనూ మాట్లాడటం, చాటింగ్ చేయడం చేశాడు. ఓ యువతికి ప్రేమ పేరుతో ఎర వేసిన ఈ యువకుడు ఆమె కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చేశాడు. ఈ లోగా విజయ్ దేవరకొండ సంబంధీకులు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు నగరానికి వచ్చిన సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. డైరెక్టర్ అజయ్ భూపతినంటూ... కేవలం హీరోలే కాదు... దర్శకుల పేరుతోనూ సైబర్ నేరగాళ్లు తమ ‘పని’ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి పేరుతో అమ్మాయిలకు వల వేసిన ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆయన పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ కేంద్రంగా యువతుల వివరాలు సేకరించాడు. ఇలా పరిచయం చేసుకుని వారితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం మొదలెట్టాడు. వారితో తాను అజయ్ భూపతిగానే వారితో పరిచయం చేసుకున్నాడు. తాను త్వరలో విజయ్ దేవరకొండ, విశాల్‌లతో సినిమా తీయబోతున్నానని, అందులో నటించే అవకాశం కల్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. ఇలా ఎంపిక పేరుతో ఆ యువతుల నుంచి వ్యక్తిగత ఫొటోలు సైతం సేకరించి వారిని వేధించడం మొదలెట్టాడు. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు అజయ్ భూపతి తీవ్రంగా పరిగణించారు. తన పేరును వినియోగిస్తూ, యువతులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పేరుతో... ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేరుతో మోసాలకు తెర లేపిన వ్యవహారం గత వారం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా కేంద్రంగా ఈ సంస్థ పేరుతో సైబర్ క్రిమినల్స్ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీని ఆధారంగా ఆ సంస్థలో పని చేసే డిజైనర్, మేకప్ మ్యాన్స్‌గా తమను తాము పరిచయం చేసుకున్నారు. వీరిని సంప్రదించిన యువతులతో సినిమాలో నటించే అవకాశం ఇస్తామంటూ ఎర వేశారు. ఓ ప్రముఖ హీరోతో తమ సంస్థ తమిళ చిత్రం నిర్మించబోతోందని, అందులో హీరోయిన్గా నటించడానికి అవకాశం ఇస్తానంటూ నమ్మబలికారు. అయితే ఈలోపు విషయం గీతా ఆర్ట్స్ నిర్వాహకులకు తెలిసింది. దీంతో ఆ సంస్థ మేనేజర్ తమ బ్యానర్ పేరు చెప్పి అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసుల్ని సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు బాధ్యుల్ని గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవకాశాలు అంత తేలికకాదు ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కువగా యువతులనే టార్గెట్ చేసుకుంటున్నారు. సినీ హీరో, దర్శకుడు, నిర్మాణ సంస్థ.. ఇలా వివిధ పేర్లు చెబుతూ నటించే అవకాశాల పేరుతో ఎర వేస్తున్నారు. ఆడిషన్లు నిర్వహిస్తామంటూ, అందుకు ఎంపికలు జరుగుతాయంటూ ఫొటోలు సంగ్రహిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు రావడం అంత తేలికకాదని, సోషల్‌మీడియా ద్వారా ఆ ఎంపికలు జరగవని గుర్తుంచుకోవాలి. నేరుగా సంప్రదించిన తర్వాతే ఎదుటి వారికి ఫొటోలు పంపడం వంటివి చేయాలి. అలా కాకుంటే బ్లాక్‌మెయిలింగ్ తదితర తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. – సైబర్ క్రైమ్ పోలీసులు -
మెగా బ్యానర్లో యువ దర్శకుడు
ఇటీవల టాలీవుడ్లో ఒక్క సినిమాతో సెన్సేషన్‌గా మారిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఛలో సినిమాతో ఈ జాబితాలో చేరిన దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వెంకీ తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. దీంతో పెద్ద బ్యానర్ల నుంచి కూడా వెంకీకి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకీ కుడుముల ఓ బడా బ్యానర్లో సినిమా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్లో వెంకీ కుడుముల ఓ సినిమా చేయనున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో రూపొందించబోయే సినిమా ఇది అన్న టాక్ వినిపిస్తోంది. ఛలో తరువాత వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. -
విజయ్ దేవరకొండ `టాక్సీవాలా' ఫస్ట్ లుక్
-
గేర్ మార్చిన విజయ్ దేవరకొండ
సాక్షి, సినిమా : టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన తర్వాతి చిత్రం టాక్సీవాలా ఫస్ట్ లుక్ ఇచ్చేశాడు. టాక్సీవాలా ఫస్ట్ గేర్ పేరుతో ఓ చిన్న వీడియో బైట్‌ను వదిలారు. ఫుల్ జోష్‌తో టాక్సీలో దూసుకెళ్తున్న విజయ్ లుక్కును రివీల్ చేశారు. జేక్స్ బెజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఎస్కేఎన్, గీతా ఆర్ట్స్ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్నాడు. టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యాబ్ డ్రైవర్ రోల్లో కనిపించబోతుండగా.. మాళవికా నాయర్, షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
ఐ యామ్ బ్యాక్.. ఏదో ఒకరోజు..!
సాక్షి, సినిమా : టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం చాలా వైవిధ్యభరితంగా ముందుకు సాగుతోంది. అర్జున్ రెడ్డి తర్వాత ఇతగాడి క్రేజ్ అమాంతం పెరిగిపోవటంతో చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో అరడజను ప్రాజెక్టులు ఉండగా... అందులో ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇట్స్ టైమ్.. ఐ యామ్ బ్యాక్... అంటూ విజయ్ దేవరకొండ తన ట్విటర్లో ఈ చిత్ర ప్రీలుక్ పోస్టర్‌ను ఉంచాడు. దుమ్ము రేపుతున్న టాక్సీ పోస్టర్ కింద ‘ఫస్ట్ లుక్ ను ఏదో ఒక రోజు విడుదల చేస్తాం’ అన్న క్యాప్షన్ కింద కనిపిస్తోంది. రాహుల్ సంకృత్యన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ క్యాబ్ డ్రైవర్ రోల్లో కనిపించబోతుండగా.. షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆసక్తికర టైటిల్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. It's time. I am back. pic.twitter.com/2jQMmMr926 — Vijay Deverakonda (@TheDeverakonda) 9 February 2018 -
గమ్మునుండవోయ్
‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి చెప్పిన డైలాగ్ ఇది. పిల్లలకు, పెద్దలకు గోన గన్నారెడ్డి అలియాస్ అల్లు అర్జున్ ఓ వెరైటీ స్టైల్లో చెప్పిన ఈ డైలాగ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడీ డైలాగ్‌ని గుర్తు చేయడానికి కారణం ఉంది. ఫిల్మ్ నగర్లో బన్నీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సొంత బేనర్ పెట్టి, బన్నీ ప్రొడ్యూసర్ కావాలనుకుంటున్నాడన్నది ఆ వార్త సారాంశం. నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడితో తీయడానికి రెడీ అయిపోయాడని కూడా చెప్పుకుంటారు. నిజమేనా బాసూ? అని అడిగితే.. ‘గమ్మునుండవోయ్’ అని ఫిల్మ్‌నగర్‌లో ఓ వర్గం అంటోంది. తండ్రి అల్లు అరవింద్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోన్న గీతా ఆర్ట్స్, భాగసామ్యంలో నడిపిస్తోన్న ‘జీఏ2’, ‘వి4’.. ఇన్ని బేనర్లు ఉండగా బన్నీ ఇంకో కొత్త బేనర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటున్నారు. పాయింటే కదా. బన్నీ సన్నిహిత వర్గాలు కూడా ‘ఇది గాసిప్’ అని తేల్చేశాయి. సో.. బన్నీ సొంత బేనర్ పెట్టడంలేదు. భవిష్యత్తులో నిర్మాత అవ్వాలనుకుంటే ‘జీఏ2’ బేనర్ మీద నిర్మించాలనే ఆలోచన ఉందట. అప్పటివరకూ గమ్మునుందాం. -
విజయం.. గౌరవం... రెండూ దక్కాయి
అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. యువతరం అభిరుచులకు తగ్గట్టు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన పరశురామ్ (బుజ్జి) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పరశురామ్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘శ్రీరస్తు శుభమస్తు’కి లభిస్తున్న స్పందనపై మీ అనుభూతి? ఓ మంచి కథ చెప్పారంటూ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. విజయంతో పాటు దర్శకుడిగా నాకు గౌరవం తీసుకొచ్చిన చిత్రమిది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కథలు ప్రేక్షకులకు చేరువైనప్పుడు ఎనర్జీ వస్తుంది. లేదంటే ఇంత కష్టపడ్డా ఫలితం రాలేదని మూస కథలు వైపు వెళ్లాలనిపిస్తుంది. కానీ, ప్రేక్షకులు తమకు మంచి అభిరుచి ఉందని నిరూపించారు. ఓ దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది? చెప్పండి. అల్లు శిరీష్ కోసమే ఈ కథ రాశారా? అవునండి. సిరి (అల్లు శిరీష్)తో ముందు మరో సినిమా తీయాలనుకున్నాను. ‘హిట్ సినిమా కాదు, నా కెరీర్లో గుర్తుండే ఓ మంచి సినిమా కావాలి’ అని సిరి అడిగాడు. తిరుపతిలో దేవుణ్ణి దగ్గర్నుంచి చూసే సన్నివేశం స్ఫూర్తితో అప్పుడీ కథ రాశా. నా కథను నమ్మి అల్లు అరవింద్, సిరిలు ఎంతో ప్రోత్సహించారు. ఓ టీచర్లా పరశురామ్ నాకు చాలా విషయాలు నేర్పారని అల్లు శిరీష్ అన్నారు.. శిరీష్ సంస్కారం అది. కథ రాసి, సినిమా తీయడానికి నేను పడిన కష్టం కంటే నటుడిగా అతను పడ్డ కష్టమే ఎక్కువ. పాత్రకు అనుగుణంగా తనను తాను మలచుకున్నాడు. ‘మీకెలా కావాలో చెప్పండి, నటిస్తా’ అన్నాడు. నేనెంత చెప్పినా తెరపై చేసింది అతనే కదా. క్లైమాక్స్ సీన్స్ తీసే టైమ్‌కి మా ఇద్దరికీ బాగా సింక్ అయ్యింది. చాలా సహజంగా నటించాడు. లావణ్యా త్రిపాఠి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. దర్శకుడిగా కంటే మాటల రచయితగానే ఈ చిత్రం మీకు ఎక్కువ పేరు తెచ్చినట్లుంది? కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ అంటూ విడదీసి చూడడం నాకు తెలియదు. కథతో పాటు సహజంగా ఉండేలా మాటలు రాస్తాను. ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోను. గతంలో రైటర్ కమ్ డెరైక్టర్స్ పూరి జగన్నాథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ వద్ద పనిచేయడంతో ఆ పద్దతి అలవాటయింది. ‘బొమ్మరిల్లు’తో మీ సినిమాను పోల్చడం గురించి? నేపథ్యం ఒక్కటే కావొచ్చు కానీ, భావోద్వేగాల్ని వ్యక్తం చేసిన విధానం వేరు. ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’తో చిరంజీవిగారు పోల్చినప్పుడు చాలా సంతోషమేసింది. నాపై పూరి, భాస్కర్ల ప్రభావం ఉంది. గురువుగారి హిట్ సినిమాతో పోలిస్తే గర్వంగానే ఉంటుంది కదా. తదుపరి సినిమా? లవ్ ఎంటర్టైనర్ చేస్తా. గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉంటుంది. నేను రాసుకున్న కథలన్నీ అల్లు అరవింద్‌గారు, బన్నీ వాసులకు తెలుసు. హీరో ఎవరనేది అల్లు అరవింద్‌గారే చెప్పాలి.